భూబకాసురుడి అవతారమెత్తిన చంద్రబాబు..!

వేలాది ఎకరాల రైతుల భూములు దోపిడీ.!
ఎయిర్ పోర్టు పేరుతో ప్రైవేటు సంస్థలకు  ధారాదత్తం..!
భూములు తినేస్తున్న ముఖ్యమంత్రి..!

చంద్రబాబుకు  భూముల పిచ్చి పట్టుకుంది. అధికార దాహంతో రాష్ట్రంలో చంద్రబాబు అరాచక పాలన సృష్టిస్తున్నాడు.  యధేచ్చ‌గా  రైతుల భూములు కొల్లగొడుతూ చెలరేగుతున్నాడు .  భూబకాసురుని అవతారం ఎత్తిన చంద్రబాబు.... రైతుల భూములను అప్పనంగా దోచేస్తూ అవినీతి సామ్రాట్ గా చరిత్రకు ఎక్కుతున్నాడు. ఇప్పటికే రాజధాని పేరుతో వేలాది ఎకరాలు బలవంతంగా లాక్కొని రైతుల పొట్టగొట్టిన చంద్రబాబు..మరోసారి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం పేరుతో సరికొత్త భూదందాకు తెరలేపాడు. పేదల భూములను కాజేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన ఆరునెళ్లకే అంతర్జాతీయ విమానాశ్రయాల కోసమంటూ టీడీపీ ప్రభుత్వం వైమానికి విధానాన్ని రూపొందించింది. ఇందుకోసం వేలఎకరాలు కొల్లగొట్టేందుకు ప్లాన్ వేస్తోంది. 

ఎయిర్ పోర్టు అంటూ వేల ఎకరాలకు ఎసరు..!
భూసేకరణ ఆర్డినెన్స్ బిల్లుపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవ్వడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. కానీ చంద్రబాబు మాత్రం పంథాను వీడడం లేదు. ఎయిర్ట్ పోర్ట్ ల పేరుతో విజయనగరం జిల్లా భోగాపురంలో 5,311 ఎకరాలు, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో 1,398 ఎకరాలు, కర్నూలు జిల్లా ఓర్వకల్లు, నెల్లూరు జిల్లా దగదర్తిలో 3,407 ఎకరాల  భూములను దోపిడీ చేస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులను బాబు వదలడం లేదు. అందినకాడికి నిలువునా దోచేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. ఆగష్టు 31తో భూసేకరణ ఆర్డినెన్స్ కాలపరిమితి ముగుస్తున్న నేపథ్యంలో ఆఘమేఘాలమీద భోగాపురం ఎయిర్ పోర్ట్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు.నిబంధనలకు పాతరేస్తూ ప్రైవేటు సంస్థలకు భూములన్నీ ధారాదత్తం చేయడం దురదృష్టకరం.

బాధితుల ఆందోళన..!
భూసేకరణ నోటిఫికేషన్ నేపథ్యంలో భోగాపురం ప్రాంత ప్రజలు అలర్ట్ అయ్యారు. ఎయిర్ పోర్టు కు వ్యతిరేకంగా ధర్నా చేపట్టి నినాదాలు చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్  సెల్ కు బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన చేపట్టారు. భూములు లాక్కొని తమను బజారున పడేయోద్దంటూ  ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చారు. తమ  జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.  

Back to Top