చంద్రబాబుకు తీరని భూదాహం ..!

పరిశ్రమల పేరుతో ల్యాండ్ బ్యాంక్..!
లక్షలాది ఎకరాలు పెట్టుబడిదారులకి ధారాదత్తం..!
రాష్ట్రంలో చంద్రబాబు అరాచకాలు పరాకాష్టకు చేరాయి.రైతుల పాలిట యమపాశంలా తయారయ్యాడు.కనపడిన చోటల్లా భూములను స్వాహా చేస్తూ ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకుంటున్నాడు. భూదాహంతో అన్నదాతలను బలిచేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే రాజధాని, ఎయిర్ పోర్టులు అంటూ వేలాది ఎకరాలు కొల్లగొట్టిన చంద్రబాబు....తాజాగా మరో భూదందాపై కన్నేశాడు.  
 
రైతుల పాలిట యముడయ్యాడు..!
పరిశ్రమలు, ఉపాధి కల్పనల పేరుతో  రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యాడు. రైతుల దగ్గరి నుంచి బలంవంతంగా భూములను లాక్కొని పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దశాబ్ధాల తరబడి సాగులో ఉన్న పేదల భూములను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది.రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారులు భూములపై లెక్కలు తేల్చే పనిలో పడ్డారు. 15 లక్షల ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ గా పెట్టుకున్న ప్రభుత్వం ..ఇప్పటికే ఏడు లక్షల ఎకరాలను గుర్తించింది. 

పేదల భూములపై కన్ను..!
రాష్ట్రంలో పరిశ్రమల సాకుతో  పెద్దలకు భూములను దోచిపెట్టేందుకు చంద్రబాబు టీం ల్యాండ్ మాఫియా చేస్తోంది. పరిశ్రమలు మూతబడి కార్మికులు ఉపాధి కోల్పోయినా పట్టించుకోని ప్రభుత్వం...కొత్త పరిశ్రమలు వస్తే ఉపాధి దొరుకుతుందని మాయమాటలు చెప్పి భూములను లాక్కునే కార్యక్రమానికి   శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు దండిగా ఉన్నప్పటికీ రైతుల భూములు దోచుకునే పనిలో  ఉంది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top