18 నెలల్లో జ‌రిగింది 3 శాతం ప‌నులే..

హైద‌రాబాద్‌: ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రెండు క‌ళ్ల సిద్ధాంతానికి ప‌ట్టిసీమ‌,
పోల‌వ‌రం ప్రాజెక్టుల్ని ఉదాహ‌ర‌ణ‌లుగా చెప్ప‌వ‌చ్చు. కాంట్రాక్ట‌ర్ ల
నుంచి ముడుపులు దండిగా అంద‌టంతో ప‌ట్టిసీమ ప‌నులు పూర్తి కాకుండానే
అయిపోయిన‌ట్లుగా రికార్డుల్లోకి ఎక్కించారు. చెంబుడు నీళ్ల‌ను క్రిష్ణా
న‌దిలో క‌లిపి న‌దుల అనుసంధానాన్ని పూర్తి చేశాన‌ని చెప్పేశారు. ప‌ట్టిసీమ
విష‌యంలో ప‌ని పూర్తయింది అనిపించేందుకు చాలా ఆరాటం చూపించారు.

ప్ర‌జ‌ల‌కు
ఎంతో వ‌ర‌దాయిని వంటి పోల‌వ‌రం విష‌యంలో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం
అల‌విమాలిన అశ్ర‌ద్ధ చూపిస్తోంది. మూడున్న‌ర సంవ‌త్స‌రాల్లో ప్రాజెక్టుని
పూర్తి చేసేస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వ పెద్ద‌లు చెబుతున్నారు. కానీ, 18
నెల‌ల్లో జ‌రుగుతున్న ప‌నుల్ని చూస్తే మాత్రం ఎటువంటి పురోగ‌తి కనిపించ‌టం
లేదు. 2013 మార్చి లో స్పిల్ వే ప‌నులు, స్పిల్ చాన‌ల్‌, ప‌వ‌ర్ చానెల్
ప‌నులు పునః ప్రారంభం అయ్యాయి. వీటిని   ఇప్పటిదాకా 9.9 కోట్ల క్యూబిక్
మీట‌ర్ల మేర ప‌నులు జ‌రగాల్సి ఉంది. కానీ, 1.6 కోట్ల క్యూబిక్ మీట‌ర్ల మేర
మాత్ర‌మే ప‌నులు జ‌రిగాయి. మొత్తం ప‌నుల‌కు గాను ప్ర‌ధాన కాంట్రాక్ట్
సంస్థ‌కు రూ. 291 కోట్ల రూపాయిలు మొబిలైజేష‌న్ కింద చెల్లించారు. దీని
త‌ర్వాత రెండు సంస్థ‌ల‌కు స‌బ్ కాంట్రాక్టుల‌ను బ‌ద‌లాయింపు చేశారు. ఆ
త‌ర్వాత ప‌నుల్ని పూర్తిగా లెక్క క‌డితే 3శాతం మేర మాత్ర‌మే పూర్తయిన‌ట్లు
లెక్క తేలింది. అటువంటప్పుడు 18 నెల‌ల్లో 3శాతం ప‌నులు పూర్త‌యితే,
మూడున్న‌రేళ్ల‌లో మొత్తం ప‌నులు ఎలా పూర్త‌వుతాయన్న‌ది అర్థం కాని
ప‌రిస్థితి. దీని మీద నీటిపారుద‌ల శాఖ అధికారుల ద‌గ్గర మాత్రం జ‌వాబు
లేదు. 

మొత్తంగా చూస్తే పోల‌వ‌రం
ప‌నుల్నిసాగ‌దీసి పూర్తిగాని ప‌నుల జాబితాలో వేయాల‌న్న‌దే ల‌క్ష్యంగా
క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ప‌నుల్ని దూరం పెట్ట‌డం దిశ‌గానే
ప్ర‌భుత్వం క‌ద‌లిక‌లు క‌నిపిస్తున్నాయి. 
Back to Top