చంద్రబాబు కక్ష సాధింపు

ప్రతిపక్ష పార్టీలు
నాయకత్వం వహిస్తున్న స్థానిక సంస్థల మీద చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు
పాల్పడుతోంది. ఇప్పటికే జన్మభూమి కమిటీల పేరుతో సమాంతర వ్యవస్థ నడుపుతున్న
సర్కారు, తాజాగా మరో నిర్ణయాన్ని రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. రక్షిత మంచినీటి
పథకానికి నిధులు కూడా పంచాయితీలే భరించాలని చెప్పడం.. ఇప్పుడు కలకలం రేపుతోంది.

గ్రామపంచాయితీల బడ్జెట్ సాధారణంగా
తక్కువగా ఉంటుంది. గ్రామంలో పన్నులు తక్కువ కాబట్టి ఆదాయం కూడా చాలా తక్కువ. అక్కడ
రోడ్లు,
ఆరోగ్యం, పారిశుధ్యం,
వీధిదీపాల మరమ్మత్తులు వంటివి ఎలాగో పంచాయితీ నెత్తినే
పడతాయి. కనీసం రక్షిత తాగునీటి పథకాలైనా జిల్లా పరిషత్ లు భరించేవని,
ఇప్పుడు వాటిని కూడా తమకే అంటగట్టడమేమిటని చాలా చోట్ల
పలువురు సర్పంచ్ లు సర్కారును నిలదీస్తున్నారు.

ఇప్పటికే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు
ప్రాతినిధ్యం వహిస్తున్న చోట జన్మభూమి కమిటీలకు పెత్తనం ఇచ్చి పంచాయతీ వ్యవస్థల్ని
నిర్వీర్యం చేస్తున్నారు. ఇటు నిధుల విషయంలో కూడా మొండి చేయి చూపించి ప్రజల్ని
ఇబ్బంది పెట్టాలని యత్నిస్తున్నారు. ముఖ్యంగా వానలు తగ్గుముఖం పట్టిన తర్వాత
నీటిని అందించలేక పోతే, స్థానిక సంస్థలనే నిలదీస్తారు కాబట్టి ఈ రకమైన కుట్ర
చేస్తున్నట్లు భావిస్తున్నారు. 

Back to Top