ప్రజలకు పువ్వులు పెట్టడం ఎలా..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఆయన వెంట ఉండే పచ్చ చొక్కాల టీమ్ కు నాలుక మడత వేయటం బాగా వచ్చు. అందుకే అవసరం ఉన్నప్పుడల్లా అబద్దాలు అలవోకగా చెప్పేస్తుంటారు. ఖ్యాతి అయితే అది చంద్రబాబు నాయుడికి దక్కాలి లేదంటే అపఖ్యాతి అయితే మాత్రం అధికారుల మీదకు తోసేయాలి. ఇదే విధానం..!

రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి భూములు లాక్కొనేందుకు చంద్రబాబు పెద్ద పన్నాగమే
పన్నారు. రైతుల్ని భయపెట్టి, ఆందోళన పుట్టించేందుకు ప్రయత్నించారు. ల్యాండ్
పూలింగ్ కు సహకరించని రైతుల పొలాల్లో పంటల్ని తగలబెట్టించారు. భూ సమీకరణ
చేసేస్తామని, అప్పుడు ఈ కొద్దిపాటి పరిహారం కూడా అందబోదంటూ ప్రచారం చేయించారు.
దీన్ని ప్రజల్లో రుద్దేందుకు హడావుడిగా ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. గుంటూరు
జిల్లా కలెక్టర్ పేరు మీద ఉత్తర్వులు విడుదల చేశారు. సహజంగానే దీని మీద వ్యతిరేకత
వ్యక్తం అయింది. అప్పుడే చంద్రబాబు మార్కు నాటకాన్ని రక్తి కట్టించారు. ప్రజల్ని
భయపెట్టడమే చంద్రబాబు ఉద్దేశం కాబట్టి 
నాలిక మడత వేశారు. సినీ నటుడు పవన్ కళ్యాణ్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు
కాబట్టి దీన్ని వెనక్కి తీసుకొంటున్నామని మంత్రి నారాయణ చేత చెప్పించారు.
నిస్సిగ్గుగా అసలు ఈ భూ సమీకరణ జీవో గురించి ముఖ్యమంత్రికి తెలీనే తెలీదని, ఆయనకు
తెలియకుండానే ఉత్తర్వులు విడుదల అయ్యాయని అధికారుల మీదకు నెట్టేశారు.

ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాల మీద కూడా అదే నాటకాన్ని రక్తి
కట్టించారు. గిరిజనుల పొట్ట కొట్టేందుకు ఉద్దేశించిన బాక్సైట్ తవ్వకాల్ని బడా
పారిశ్రామిక వేత్తల కోసం అనుమతులు ఇచ్చారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. గిరిజనులకు హాని కలగని రీతిలో తవ్వకాలు
కొనసాగుతాయని చెప్పకనే చెప్పారు. తెలుగుదేశం ఏపీ శాఖ అధ్యక్షుడు కిమిడి కళా
వెంకట్రావు మాట్లాడుతూ ఇదంతా కేంద్రం పని అంటూ బీజేపీని ఇరికించే ప్రయత్నం చేశారు.
కానీ, జననేత జగన్ పర్యటిస్తున్నారని తెలియడంతో ప్రజల ఆందోళన ఉదృతం అవుతుందని వెనక్కి తగ్గారు. అసలు ఈ
బాక్సైట్ తవ్వకాల గురించి జీవో గురించి చంద్రబాబుకి ఏమీ తెలీదని, అంతా అధికారులే
చేశారు అని కల్లబొల్లికబుర్లు మొదలెట్టారు.

అసలు పరిపాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి
తెలియకుండా జరిగిపోతున్నాయంటే జనం ఎలా నమ్ముతారు. మంచి పేరు వస్తుందంటే అది
చంద్రబాబు ఖాతాలో వేయాలి, లేదంటే దాన్ని అధికారుల మీదకు తోసేయ్యాలి అన్న
సిద్ధాంతాన్ని చంద్రబాబు బాగా పాలో అవుతున్నారు. 

Back to Top