బాబు మేనియా..బ్లాక్ మనీయా..?

రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి..!
అంతా సింగపూరే..!
చంద్రబాబు అవినీతి  ఖండాంతరాలకు వ్యాపించింది. ప్రపంచమంతా మార్మోగుతుంది. ఇది చెప్పిందో ఎవరో కాదు. రాష్ట్ర ప్రణాళిక శాఖ, సండే గార్డియన్ పత్రికలే. అవును చంద్రబాబు పాలనలో విచ్చలవిడి కరప్షన్ ఉన్నట్లు ఈరెండు బయటపెట్టాయి. చంద్రబాబు అవినీతే కాదు ప్రజాసమస్యలను గాలికొదిసినట్లు  సర్వేలు, పత్రికా కథనాల్లో  బట్టబయలైంది.. 

చూశారుగా ప్రభుత్వ పనితనం..!
రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అవినీతి పెచ్చుమీరిందని రాష్ట్ర ప్రణాళిక శాఖ నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమంతా ముక్తకంఠంతో చెప్పింది. సర్వేలో 75 శాతానికి పైగా మంది ప్రజలు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. రాష్ట్రంలో అవినీతి జరగలేదని సర్వేలో పాల్గొన్న వారు ఒక్కరు కూడా చెప్పలేదు. అంతేకాదు రాష్ట్రంలో ప్రజాసమస్యలు పట్టిపీడిస్తున్నాయని అసమర్థ ప్రభుత్వం గురించి ఎత్తిచూపారు. ప్రజల మౌళిక అవసరాలకు సంబంధించి 12 అంశాలపై జనాభిప్రాయం కోరగా ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

చంద్రబాబు అవినీతా మజాకా మరి..!
భారతీయుల నల్లధనానికి సంబంధించి సండే గార్డియన్ పత్రిక చాలా విషయాలే చెప్పిందే. అందులో ఏపీ చంద్రయ్య టాప్ ప్లేస్ లోనే ఉన్నాడు. సమైక్యరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఒకరు (చంద్రబాబు)సింగపూర్ లో హోటల్ కొనుగోలు చేసిన వైనాన్ని పత్రిక బయటపెట్టింది. ఇదే విషయాన్నిగతంలో తెహల్కా కూడా ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన రాజకీయవేత్తగా చంద్రబాబు పేరు పేర్కొంటూ ఆయనకు సింగపూర్ లో ఓ హోటల్ కూడా ఉందని తేల్చింది. అధికారంలోకి వచ్చిన నాటినుండి చంద్రబాబు చేస్తున్న సింగపూర్ నామస్మరణంతో ప్రజల్లో అనుమానాలు రేకెత్తాయి. 
 
దోచుకున్నది దాచుకునేందుకే..!
దోచుకున్న డబ్బంతా సింగపూర్ లో దాచిపెట్టి తిరిగి పెట్టుబడుల పేరుతో దేశానికి రప్పిస్తున్నారని పత్రిక పేర్కొంది. సింగపూర్ తో చంద్రబాబు అవినీతి బంధంపై ప్రజలంతా గుసగుసలాడుకుంటున్నారు. రాజధాని పేరుతో వేలాది ఎకరాల భూములు లాక్కోవడం, ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్ట్ లు , ఇసుకమాఫియా ఇలా  అన్నింటిలోనూ అవినీతే. ఈవిధంగా  దోచుకున్న సొమ్మంతా  పచ్చనేతలు విదేశాలకు తరలిస్తున్న నిజాన్ని తెలుసుకొని ప్రజలు షాక్ కు గురవుతున్నారు. మా పొట్టలు గొట్టి అడ్డదారిలో దోచుకున్న సొమ్మంతా విదేశాల్లో దాచిపెట్టుకొని..అభివృద్ధి, ఆవకాయ బద్ద అంటూ డైలాగులు చెబుతున్న వైనాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మొదటి నుంచి ప్రభుత్వ అవినీతిని నిలదీస్తూనే ఉంది. తాజా కథనాలతో అది మరింత బలపడింది. చంద్రబాబు అవినీతి సామ్రాజ్యం గురించి ప్రజలకు అర్థమైంది. 
Back to Top