బాక్సైట్ తవ్వకాల మీద మొండి పంతానికి పోతున్న చంద్రబాబుకాసుల కోసం దొంగదార్లు వెదకుతున్న ప్రభుత్వంప్రజాభిప్రాయ సేకరణ అంటూ కొత్త నాటకాలుఐటీడీఏ సమావేశం వేదికగా ముక్తకంఠంతో నినదించిన గిరిజనంబాక్సైట్ తవ్వకాలు వద్దే వద్దంటూ తీర్మానంవిశాఖపట్నం: కమీషన్ల కోసం ఎంతకైనా తెగించే చంద్రబాబు ప్రభుత్వానికి గిరిజనులు ఎదురొడ్డి నిలుస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలు వద్దంటే వద్దని ఐటీడీఏ సమావేశం వేదికగా తీర్మానం చేసి పంపించారు. ప్రజాభిప్రాయం స్పష్టంగా తెలియటంతో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది అనే దానిపై ఆసక్తి నెలకొంది.బాక్సైట్ కోసం నాటకాలుబాక్సైట్ తవ్వకాలు జరిపితే లక్షల కోట్ల రూపాయిల వ్యాపారం జరుగుతుందని చంద్రబాబు భావించారు. ఇందులో భారీగా ముడుపులు దొరుకుతాయన్న అంచనాతో ఈ తవ్వకాలకు అనుమతులు ఇప్పించారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావటం, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ప్రజల తరపున ఉద్యమించటంతో ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి. దీంతో ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కొత్త నాటకానికి తెర దీసింది. ప్రజల అభిప్రాయం ప్రకారమే నడచుకొంటామని ప్రచారం మొదలు పెట్టారు. అంతే తప్ప బాక్సైట్ తవ్వకాలు ఆపేస్తామంటూ ఎక్కడా చెప్పటం లేదు.ఐటీడీఏ సమావేశంలో తీర్మానంఈ పరిస్థితుల్లో విశాఖ ఏజన్సీ కి సంబంధించిన ఐటీడీఏ పాలక మండలి సమావేశం జరిగింది. సమీక్రత గిరిజనాభివ్రద్ది సంస్థ (ఐటీడీఏ) అంటే గిరిజనుల అందరికీ పాలన పరంగా, ప్రగతి పరంగా బాధ్యత వహించే ప్రభుత్వ యంత్రాంగం అన్న మాట. ఇందులో గిరిజన సంక్షేమ మంత్రి తో పాటు గిరిజనులకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. తాజాగా జరిగిన ఐటీడీఏ భేటీలో బాక్సైట్ తవ్వకాల మీద చర్చ జరిగింది. బాక్సైట్ తవ్వకాల తో వచ్చే అనర్థాల్ని గుర్తించిన ప్రజా ప్రతినిధులంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారు. వద్దంటే వద్దని స్పష్టం చేయటమే కాకుండా పాలక మండలి సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.ప్రజాభిప్రాయం స్పష్టంప్రభుత్వం చెబుతున్నట్లుగా చూసుకొన్నా కానీ, బాక్సైట్ మీద ప్రజాభిప్రాయం స్పష్టంగా బయట పడింది. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం వెంటనే బాక్సైట్ తవ్వకాల్ని ఆపేస్తున్నట్లుగా ప్రకటించాల్సి ఉంటుంది. మరి, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి, ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా లేక కమీషన్ల కోసం గిరిజనుల గొంతు కోస్తుందా అన్నది వేచి చూడాల్సి ఉంటుంది.