అడ్డ‌గోలుగా అమ్మేద్దాం

ప్ర‌జాస్వామ్య
స‌మాజంలో విద్య‌, వైద్యం అన్న‌ది ప్రభుత్వాల క‌నీస బాధ్య‌త‌. అయితే
చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి ఇటువంటి కనీస స్పృహ  ఉండ‌టం లేదు. సాధ్య‌మైనంత
త్వ‌ర‌గా ప్ర‌భుత్వ విద్య‌, ప్ర‌భుత్వ వైద్యం నుంచి త‌ప్పుకోవాల‌న్న‌ది
టీడీపీ సంకీర్ణ ప్ర‌భుత్వ ధ్యేయంలా క‌నిపిస్తుంది.

ప్ర‌భుత్వ
ఆసుప‌త్రుల‌కు అందించాల్సిన నిధుల్ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం
ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌గ్గిస్తూ వ‌స్తోంది. దీంతో ఆసుప‌త్రుల్లో చేయాల్సిన
ప‌నుల‌న్నీ నీరసించిపోయాయి. ప్ర‌జ‌ల‌కు అందాల్సిన సేవ‌లు అంద‌క పోవ‌టంతో
రోగులు అల్లాడిపోతున్నారు. ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో స‌గానికి స‌గం
ప‌రికరాల్ని మూల‌న పెట్టేసేందుకు కుట్ర‌లు ప‌న్నారు. బోధ‌నాసుప‌త్రుల్లో
రూ. 375 కోట్లు, విధాన ప‌రిష‌త్ ఆసుప‌త్రుల్లో రూ. 65 కోట్లు, ప్ర‌జారోగ్య
శాఖ లో రూ. 60 కోట్ల మేర ప‌రికరాలు ఉన్న‌ట్లు అంచ‌నా. మొత్తంగా రూ. 500
కోట్ల విలువైన ప‌రికరాలు ఉంటే వాటిలో రూ. 200 కోట్ల విలువైన ప‌రికరాల్ని
మూల‌న పెట్టేశారు. ఈ విధంగా ప‌రిక‌రాలు, ఉప‌క‌ర‌ణాల్ని మూల‌న
పెట్టేస్తున్నారు. 

 ఇదంతా ఆసుప‌త్రుల్ని
ప్రైవేటు ప‌రం చేసేందుకు జ‌రుగుతున్న కుట్ర అన్న మాట బ‌లంగా వినిపిస్తోంది.
ఇప్ప‌టికే మెడిక‌ల్ షాపుల్ని ద‌శల వారీగా ప్రైవేటుప‌రం చేసేశారు. త‌ర్వాత
కాలంలో డ‌యాగ్న‌స్టిక్ లాబ‌రేట‌రీల‌ను ప్రైవేటు సంస్థ‌ల‌కు అప్ప‌గించేశారు.
ర‌క్త ప‌రీక్ష‌ల నుంచి ఎమ్ ఆర్ ఐ ప‌రీక్ష దాకా అన్నింటి నిర్వ‌హ‌ణ
ప్రైవేటు సంస్థ‌ల చేతిలోకి వెళ్లిపోయింది. దీంతో డ‌బ్బులు ఉన్న‌వారికే
ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో చికిత్స దొరికే ప‌రిస్థితి త‌లెత్తింది. ఈ లోపుగా
వైద్య ప‌రిక‌రాల నిర్వ‌హ‌ణ ప్రైవేటు సంస్థ‌ల‌కు త‌ర‌లించేస్తున్నారు. వైద్య
ప‌రిక‌రాల్ని అందుబాటులో ఉంచుకోవ‌టం, నిర్వ‌హించటం అంతా ప్రైవేటు మ‌యంగా
మారింది. మొత్తం మీద ద‌శ‌ల వారీగా ప్రైవేటు కబంధ హ‌స్తాల చేతిలోకి సేవ‌లు
వెళ్లిపోతున్నాయి.

అటు ప్రైవేటు టీచింగ్
ఆసుప‌త్రుల కోసం ప్ర‌ధాన ప్ర‌భుత్వాసుప‌త్రుల్ని అడ్డ‌గోలుగా
ఇచ్చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కేంద్ర ఆసుప‌త్రిని నేరుగా అపోలో
ఆసుప‌త్రి కి ఇచ్చేసి చేతులు దులుపుకొన్నారు. ఇదే బాట‌లో మ‌రికొన్ని
ప్ర‌ధాన ఆసుప‌త్రుల్ని ప్రైవేటు బాట ప‌ట్టించేస్తున్నారు. మొత్తంగా
ప్ర‌భుత్వ వైద్య వ్య‌వ‌స్థ‌ను ప్రైవేటు ప‌రం చేసేస్తున్నారు. 
Back to Top