చీకట్లో చంద్రబాబు

పారదర్శకత అంటూ ఉపన్యాసాలు
దంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆచరణలో మాత్రం చీకటి పరిపాలన సాగిస్తున్నారు.
రహస్య పరిపాలనకు నిలువెత్తురూపంలా పాలన సాగుతోంది. పదిహేడు నెలల కాలంలో మొత్తంగా
845 రహస్య జీవోలు వెలువరించారు. ఇందులో అత్యధిక భాగం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
పర్యవేక్షణ లో ఉండే సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) నుంచి వెలువడినవే. 17 నెలల కాలంలో
552 రహస్య జీవోలు వెలువరించాయి.

సుపరిపాలన అంటే ప్రభుత్వ
వ్యవహారాలన్నీ పారదర్శకంగా ఉండాలి. అన్నింటిని ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉంచటం
విధానం. ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) అన్నింటిని వెబ్ సైట్ లో ఉంచితే ప్రజలకు
అందుబాటులో ఉంటాయి. పారదర్శకతకు మారు పేరు, ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ కి ఆద్యుడిని
అని చెప్పుకొనే చంద్రబాబు.. ఆచరణలో మాత్రం ఈ స్ఫూర్తికి పాతర వేస్తున్నారు. అందుకే
చీకటి ఒప్పందాలు, చీకటి పనులకు సంబంధించిన ఉత్తర్వుల్ని అధిక సంఖ్యలో
వెలువరిస్తున్నాయి. వీటికి కాన్ఫిడెన్షియల్ అని ముద్ర వేస్తున్నారు. అంటే ఈ జీవో
ను క్లిక్ చేస్తే వివరాలు కనిపించవు. జీవో నెంబర్, తేదీ మాత్రమే కనిపిస్తుంది.
దీనికే కాన్ఫిడెన్షియల్ అని ముద్ర వేస్తారు.

ఈ పదిహేడు నెలల్లో మొత్తం
845 రహస్య జీవోల్ని విడుదల చేశారు. ఇందులో మొదటి స్థానంలో సీఎం చేతిలో ఉండే జీఏడీ
శాఖది. 552 రహస్య జీవోల్ని విడుదల చేసింది. తర్వాత స్థానంలో రెవిన్యూ శాఖ 104,
హోమ్ శాఖ 86 జీవోల్ని విడుదల చేసింది. మొత్తం 14 శాఖల్లో ఈ చీకటి జీవోల కథ నడుస్తోందంటే
పారదర్శకత కు చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయిలో పాతర  వేస్తోందో అర్థం చేసుకోవచ్చు.  a

Back to Top