రాజధాని అంటే అప్పు చేసి పప్పుకూడు అన్నమాట

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా ఒకటే పని మీద ఉంది. రాజధాని
శంకుస్థాపన విషయం తప్ప మరో విషయం ఏదీ ప్రభుత్వ పెద్దలకు కనిపించటం లేదు.
అందుకే అన్ని శక్తులు ఒడ్డి బ్రహ్మాండం బద్దలు అయిపోయే రీతిలో దీన్ని
సంకల్పించారు.

కానీ రాష్ట్రంలో మింగటానికి మెతుకు లేదన్నది
నిష్టూర సత్యం. కానీ తన మీసాలకు మాత్రమే కాకుండా, వచ్చిపోయే అతిథుల మీసాలకు
కూడా సంపెంగ నూనె రాస్తానని చంద్రబాబు చెప్పొకొస్తున్నారు. దాదాపు 15 వందల
మంది వీ వీ ఐ పీలను పిలవాలని ఫిక్సు అయిపోయారు. వీరి కోసం బ్రహ్మాండమైన
ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. వేల సంఖ్యలో వీ ఐ పీలను రప్పించేందుకు ఖరారు
అయింది. ఈ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాల్సి ఉంది. హైదరాబాద్ వచ్చే వీ వీ ఐ
పీలను ప్రత్యేక విమానాల్లో విజయవాడకు తరలిస్తారు. అక్కడ నుంచి
హెలికాప్టర్లలో శంకుస్థాపన దగ్గరకు తీసుకొస్తారు. దీన్ని బట్టి ఏ స్థాయిలో
ఏర్పాట్లు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఇంతకీ అసలు విషయం
ఏమిటంటే ప్రభుత్వ ఖజానాలో డబ్బు కనిపించటం లేదు. జీతాలు, పెన్షన్లు తప్ప
ఇతర చెల్లింపులకు డబ్బు లేనే లేదు. శంకు స్థాపన పేరు చెప్పి 100 కోట్ల
రూపాయిల మేర ఓవర్ డ్రాఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. అప్పుడప్పుడు బడ్జెట్
సర్దుబాట్లలో భాగంగా వేస్స్ అండ్ మీన్స్ పద్దతిలో సర్దుబాట్లు పూర్తయ్యాయి.
ఇప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ చేయటం మాత్రమే మిగిలింది. అంటే అచ్చ తెలుగులో
చెప్పాలంటే ఆస్తుల కాగితాలు చూపించి అధిక వడ్డీకి అప్పు తెచ్చుకోవటం అన్న
మాట. చంద్రబాబు దర్జాల కోసం ఈ స్థాయిలో అప్పు చేసి పప్పుకూడు అవసరమా అన్న
ప్రశ్న బలంగా వినిపిస్తోంది. 

తాజా ఫోటోలు

Back to Top