దర్జాగా దోపిడీ

– హైకోర్టు కట్టకుండా నిధులు మింగేసిన బాబు 
– కేంద్ర నిధులు ఆడంబరాలకు 


ఆంధ్రాలో గత మూడున్నరేళ్లుగా విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం ఒక రహస్య ఎజెండాతో ముందుకుసాగుతున్నట్టుగా ఉంది. ప్రభుత్వం ఎన్ని అవినీతి ఆరోపణలొచ్చినా ఏనాడూ చర్యలు తీసుకున్న పాపాన పోలేదు సరికదా.. కనీసం ఆరోపణలపై వివరణ ఇచ్చుకున్న దాఖలాలు కూడా లేవనే చెప్పాలి. 2014 ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలలతోపాటు ముఖ్యమంత్రి సహా అందరి మీదా వచ్చిన ఆరోపణలతో పుస్తకమే తయారైంది. చంద్రబాబు అవినీతి చక్రవర్తిగా చరిత్ర పుటల్లోకెక్కాడు. ఈ మూడున్నరేళ్ల కాలంలో రూ. 3.75 లక్షల కోట్లు అవినీతి చేసినట్టు లెక్కతేలింది. తన నలభయ్యేళ్ల అనుభవంతో రాష్ట్రం విడిపోయేనాటికి ఉన్న అప్పులను లక్షన్నర కోట్లకు పెంచాడు.
అమరావతి భూముల నుంచి హైకోర్టు దాకా..
చంద్రబాబు అవినీతి బాగోతం శాఖోపశాఖలుగా విస్తరించిపోయింది. 2014లో ముఖ్యమంత్రి అయ్యాక మొదలెట్టిన తొలి ప్రాజెక్టు అమరావతి రాజధాని నిర్మాణం. ఆ భూమి పూజ కూడా అవినీతితోనే మొదలైంది. రూ. 400 కోట్లు ఖర్చు చేసి స్పెషల్‌ ఫ్లయిట్‌లు, కార్లు వేయించి ప్రధాన మంత్రిని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులను ఆహ్వానించాడు. అక్కడ్నుంచి మొదలైన అవినీతి ప్రవాహం శాఖోపశాఖలుగా విస్తరించింది. పట్టిసీమ, పోలవరం, ఆక్వా పార్కులు, ఎయిర్‌పోర్టులు, కాకినాడ పోర్టు, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు, ఇసుక కుంభకోణం, కాల్‌మనీ సెక్స్‌ రాకెట్, అమరావతి భూముల కుంభకోణం, స్విస్‌ ఛాలెంజ్, సదావర్తి భూములు, విశాఖ భూ కుంభకోణం, హెరిటేజ్‌కు లబ్ధి, మజ్జిగ పథకం, చెట్టు నీరు, జలహారతి పేరుతో దోపిడీ, పేపర్‌ యాడ్స్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే పని చేపట్టే ముందు చంద్రబాబు మొదట ఆలోచించేది రాబడి గురించే అన్నంతగా బాబు అవినీతి రాజ్యమేలింది. 
అరాచకాలకు లెక్కేలేదు..
బాబు పాలనలో అవినీతే కాదు.. అరాచకాలు.. మహిళల మీద దాడులు, ప్రతిపక్ష పార్టీ నాయకుల హత్యలు తక్కవేం కాదు. రిషతేశ్వరి, శ్రీవిద్య, దివ్వ వంటి వారు టీడీపీ నాయకుల దాడుల్లో అసువులు బాసారు. వనజాక్షి వంటి ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి వ్యతిరేకంగా పోరాడితే వారిని గుర్తించకపోగా ఛీత్కారాలే ఎదురయ్యాయి. సొంత పార్టీ నేతలైన జానీమూన్, సుజాతమ్మ, శ్రీదేవి వంటి వారికీ వేధింపులు తప్పలేదు. ఎన్నారై కుటుంబానికి టిక్కెట్‌ ఇప్పిస్తామని ఆశ చూపించి ఇక్కడికి రప్పించారు. వారితో డబ్బులు ఖర్చు చేయించి చివరికి ఆత్మహత్య వరకు ప్రేరేపించారు. 
కేంద్రానికి లెక్కలు చెప్పరంట..
ఇచ్చిన డబ్బుకు లెక్కలు చెప్పడమంటే చంద్రబాబుకు మా చెడ్డ చిరాకు. డబ్బులు తీసుకోవడమే తప్ప ఏం చేశామో చెప్పడమంటే ఆయనకిస్టం ఉండదు. అది ప్రజలైనా.. కేంద్ర ప్రభుత్వమైనా.. అసలే అప్పుల్లో ఉన్నాం.. పేద రాష్ట్రం అంటూనే ఉంటాడు.. ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరిగి వస్తుంటాడు. ఒక్క రూపాయి పెట్టుబడి కూడా తీసుకురాలేకపోయాడు. పట్టిసీమలో జరిగిన అవినీతిపై కాగ్‌ అక్షింతలు వేసినా.. స్విస్‌ ఛాలెంజ్‌ వద్దని సుప్రీంకోర్టులే వద్దన్నా.. ఆధారాలతో సహా రాజధాని భూముల కుంభకోణం వెలుగు చూసినా, సదావర్తి కుంభకోణంపై కోర్టులు ఆక్షేపణ చెప్పి రెండు సార్లు వేలం నిర్వహించినా ఆయనకు పట్టదు. పోలవరం కోసం కేటాయింపులు గురించి కేంద్రం లెక్కలడిగితే ఆయనకు కడుపు మండింది. ఇప్పుడు హైకోర్టు, అసెంబ్లీ ఏర్పాటు కోసం 1508 కోట్లు కేంద్రం ఇచ్చిందని తెలిసింది. అయితే హైకోర్టు నిర్మించకుండానే ఆ నిధులు ఏమయ్యాయనేది శేష ప్రశ్నగా మిగిలిపోయింది. ఇలా నిధులు మళ్లించడం చంద్రబాబుకు అలవాటే. 
 
Back to Top