టీడీపీ నేతల ప్రత్యేక దోపిడీ

హైదరాబాద్) ముఖ్యమంత్రి చంద్రబాబు
చేతిలో ఉండే ప్రత్యేక అభివ్రద్ధి నిధి అన్నది పూర్తిగా పచ్చ నేతల ప్రత్యేక దోపిడీ
నిధి గా మారిపోతోంది. ముఖ్యంగా నామినేషన్ విధానం వెసులుబాటు పూర్తిగా పచ్చ
తమ్ముళ్లకు కాసులు కురిపిస్తోంది.

చంద్రబాబు చేతివాటం

ఒకప్పుడు ఎమ్మెల్యేల సిఫార్సు
ఆధారంగా నియోజక వర్గాలకు నిదులు ఇచ్చేవారు. ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేలు నిధులు
కేటాయిస్తే అధికారులు పనులు చేయించేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ నిధికి
అర్థం మార్చేశారు. ప్రతీ నియోజకవర్గంలోనూ టీడీపీ నేతల మాటకే పెద్ద పీట
వేస్తున్నారు. ఏ ఏ పనులకు ఎంతెంత కేటాయించాలని అనే దాని మీద టీడీపీ జిల్లా
అధ్యక్షులు, స్థానిక టీడీపీ నేతలదే హవాగా మారింది.

నామినేషన్ దోపిడీ

ఈ నిదుల వినియోగం లో రూ. 5 లక్షల
దాకా నామినేషన్ పద్దతిలో కేటాయించుకొనే వెసులుబాటు ఉంది. దీంతో కోరిన వాళ్లకు
పనుల్ని చిన్న చిన్న ప్యాకేజీలుగా మార్చేసి దోచేసుకొంటున్నారు. ప్రతీ పనిని
ముక్కలు చేసుకొని పూర్తిగా టీడీపీ నేతలకే పనులు కేటాయిస్తున్నారు. అడ్డగోలు దోపిడీ
అని తెలిసినప్పటికీ అధికారులు నోరు మెదపడం లేదు. గట్టిగా అడిగితే టీడీపీ అగ్ర నేతల
నుంచి ఫోన్ లు వస్తున్నాయని వాపోతున్నారు. దీంతో మారు మాట్లాడకుండా నిధుల్ని
విడుదల చేసేస్తున్నారు.

వాటాల మేరకు

నిధుల్ని కేటాయించే సమయంలోనే
వాటాల్ని కుదుర్చుకొంటున్నారు. దక్కించుకొన్న నేత పార్టీ సీనియర్ నాయకులకు పక్కాగా
వాటాలు ఇచ్చే విధంగా అంగీకారం చేసుకొంటున్నారు. దీంతో ఎక్కడికక్కడ పద్దతి ప్రకారం
వాటాలు పంచేసుకొంటున్నారు. అంతిమంగా ప్రజల నెత్తిన కుచ్చుటోపీ పెట్టేస్తున్నారు.
నూటికి 90 శాతం మేర నిదుల్ని మింగేస్తున్నారంటే పరిస్తితి అర్థం చేసుకోవచ్చు. 

తాజా వీడియోలు

Back to Top