'పశ్చిమ'లో షర్మిల సమైక్య శంఖారావం

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో మహానేత డాక్టర్‌ వైయస్ రాజ‌శేఖరరెడ్డి తనయ, జననేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రారంభించిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర చినవెంకన్న కొలువైన పశ్చిమగోదావరి జిల్లాలోకి దూసుకు వస్తోంది. తెలుగువారంతా ఎప్పటికీ ఒక్కటిగా.. సుభిక్షంగా ఉండాలని కోరుకున్న మహానేత ‌రాజన్న ఆదర్శాన్ని.. తెలుగు నేలను చీల్చకూడదన్న జననేత జగనన్న ఆకాంక్షను.. ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సిందే అన్న శ్రీమతి విజయమ్మ దృఢ సంకల్పాన్ని ఆలంబనగా చేసుకుని శ్రీమతి షర్మిల సమైక్య శంఖారావం పూరించారు.

ఏలూరు, 12 సెప్టెంబర్ 2013:‌

సమన్యాయం చేయలేదు కనుక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న ‘సమైక్య శంఖారావం’ బస్సుయాత్ర గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించనుంది. కృష్ణా జిల్లా కైకలూరులో బహిరంగ సభ అనంతరం శ్రీమతి షర్మిల పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తారు.

కృష్ణా గోదావరి జిల్లాల సరిహద్దు గ్రామం కలకుర్రు వంతెనపై శ్రీమతి షర్మి బస్సు యాత్ర జిల్లాలోకి రాగానే స్వాగతం పలికేందుకు దెందులూరు నియోజకవర్గ నాయకులు భారీగా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి ఏలూరు నగరం వరకూ శ్రీమతి షర్మిల బస్సుయాత్రను మోటార్ సైకిళ్ల ర్యాలీతో నగరంలోకి తీసుకు‌వస్తారు. ఏలూరులోని ఫైర్‌స్టేషన్ సెంట‌ర్‌కు శ్రీమతి షర్మిల బస్సు యాత్ర మధ్యాహ్నం చేరుకుంటుంది. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల మాట్లాడతారు. ఈ సభ కోసం వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నాయకులు పెద్ద‌ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఫైర్‌స్టేషన్ సెంట‌ర్‌తో పాటు నగరమంతటా భారీగా స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు.

ఏలూరు నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు సమైక్యవాదులు కూడా శ్రీమతి షర్మిల బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొనేందుకు వస్తున్నారు. సభ ముగిసిన తర్వాత శ్రీమతి షర్మిల ఏలూరులోనే బస చేస్తారు.

శుక్రవారంనాడు పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శిస్తూ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం చేరుకుంటారు. ఏలూరుతో పాటు దెందులూ రు, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు నియోజకవర్గాల మీదుగా ఆమె సమైక్య శంఖారావం బస్సు యాత్ర కొనసాగుతుంది.

 పార్టీ పట్ల ఆకర్షితులవుతున్న ప్రజలు :
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అలుపెరగకుండా పోరాటం చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ పట్ల ప్రజలు విశేష సంఖ్యలో ఆకర్షితులవుతున్నారు. పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఆందోళనల్లో టిడిపి నాయకులను ఛీకొడుతున్న ఎన్జీవోలు, విద్యార్థులు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ పట్ల ఆదరణ కనబరుస్తున్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నాయకులు చేస్తున్న ఆందోళన లో జేఏసీ నాయకులు కూడా పాల్గొంటున్నారు.

‌ఈ క్రమంలోనే శ్రీమతి షర్మిల బస్సు యాత్రకు మద్దతు ఇస్తామని ఇప్పటికే ఎన్జీవోలు ప్రకటించారు. బుధవారం ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నాయకులు, సభ్యులు కూడా ఏలూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిలుపునకు వేదికలో భాగంగా ఉన్న ఎన్జీవోలు, వ్యాపారులు, విద్యార్థులు సానుకూలంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది.

సమైక్య శంఖారావానికి కొల్లేరు వాసుల మద్దతు :

సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చిత్తశుద్ధితో చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీకి కొల్లేరు ప్రజలు మద్దతు పలికిన విషయం తెలిసిందే. మంగళవారం లంక గ్రామాల పెద్దలు, నాయకులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. లంక గ్రామాల ప్రజలు‌ శ్రీమతి షర్మిల యాత్రలో పాల్గొని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీకి మద్దతు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. తమ సమస్యలను పరి‌ష్కారానికి వై‌యస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే సరైన వేదిక అని కొల్లేరు పెద్దలు భావిస్తున్నారు. శ్రీమతి షర్మిల బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు వారు రెట్టించిన ఉత్సాహంతో తరలివస్తున్నారు.

తాజా వీడియోలు

Back to Top