రాజ‌ధాని సిత్రాలు సూడ‌రో..!


* గుట్టుచ‌ప్పుడు కాకుండా మాస్ట‌ర్ డెవ‌ల‌ప‌ర్ ఎంపిక‌
 * సింగ‌పూర్ కంపెనీతో బేర‌సారాలు
* దోచిపెట్టేందుకు ప్ర‌భుత్వం సిద్ధం
హైద‌రాబాద్‌) కొత్త రాజ‌ధాని అమ‌రావతిలో సింగ‌పూర్ జెండా పాతేందుకు చంద్రబాబు ప్ర‌భుత్వం త‌హ‌త‌హ‌లాడుతోంది. అక్క‌డ మాస్ట‌ర్ డెవ‌ల‌ప‌ర్ గా స్విస్ చాలెంజ్ ప‌ద్ద‌తిలో అసెండాస్ కంపెనీని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ద‌మైంది.

రాజ‌ధాని ఏర్పాటులో సింగ‌పూర్ కంపెనీల‌దే ఇష్టారాజ్యం అని చాలా కాలం క్రిత‌మే తెలిసిపోయింది. అక్క‌డ రాజ‌ధాని నిర్మాణం కోసం స్విస్ చాలెంజ్ ప‌ద్ద‌తిలో అసెండాస్ ను ఎంపిక చేయ‌నున్నారు. మొద‌టి ద‌శ‌లో ఈ సంస్థ‌కు 3వేల ఎక‌రాలు అప్ప‌గిస్తారు. ఇందులో 375 ఎక‌రాల్లో ప్ర‌భుత్వ కాంప్లెక్స్ ల నిర్మాణాలు చేప‌ట్ట‌నున్నారు. వీటి నిర్మాణ బాధ్య‌త‌లు ఈ సంస్థ కే అప్ప‌గిస్తారు. అయితే ఈ 3 వేల ఎక‌రాల‌కు పూర్తి హ‌క్కుల్ని త‌మ‌కే అప్ప‌గించాల‌ని ఆ కంపెనీ కోరుకొంటోంది. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పూర్తి హ‌క్కులు అప్ప‌గిస్తే గొడ‌వ అవుతుంద‌ని, ఇందుకు ప్ర‌తిగా 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వ‌టం మేల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

మొద‌టి ద‌శ రాజ‌ధానిని అక్టోబ‌ర్ 2018 క‌ల్లా పూర్తి చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం, సింగ‌పూర్ కంపెనీల మ‌ధ్య అవ‌గాహ‌న కుదిరింది. 2019 ఎన్నిక‌ల నాటికి ఈ మొద‌టి ద‌శ నిర్మాణం పూర్తి చేసిన రూపం క‌నిపించాల‌న్న‌ది బాబు తాప‌త్ర‌యం. అందుకే ఈ నిర్మాణాలు అనుకొన్న ల‌క్ష్యానికి పూర్తి చేయాల‌ని భావిస్తున్నారు. మిగిలిన ద‌శ నిర్మాణాలు పూర్తి చేయాలంటే త‌న‌కే ఓటు వేయాల‌ని కోర‌టం ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట్ల‌ను కొల్ల‌గొట్టాల‌న్న‌ది చంద్ర‌బాబు వ్యూహంగా క‌నిపిస్తోంది.

సింగ‌పూర్ కంపెనీ కోరుకొన్న‌ట్లుగా ప్ర‌భుత్వ యంత్రాంగం మోక‌రిల్లేట్లుగా ఇప్ప‌టికే ఒత్తిడి తీసుకొచ్చారు. దీనికి అంగీక‌రించిన అధికారుల్ని సాగనంపుతున్నారు. ఇప్ప‌టికే మునిసిప‌ల్ వ్య‌వ‌హారాల శాఖ కార్య‌ద‌ర్శిగా మొద‌టి ద‌శ ప‌నుల్ని చూసిన సాంబ‌శివ‌రావును టీటీడీ ఈవోగా పంపించారు. త‌ర్వాత వచ్చిన గిరిధ‌ర్ ను కూడా అలాగే సాగ‌నంపారు. మొత్తం మీద సింగ‌పూర్ కంపెనీల‌కు స‌ర్వం స‌మ‌ర్పించేట్లుగా చంద్ర‌బాబు కోట‌రీ కుట్ర‌ను అమ‌లు చేస్తోంది. 
Back to Top