షర్మిలపై వెల్లువెత్తిన జనాభిమానం

కామేపల్లి (ఖమ్మం జిల్లా) : మండుటెండలోనూ మరో ప్రజాప్రస్థానం దారులు జనాభిమానంతో వెల్లువెత్తాయి. జనం మంగళహారతులు పడుతూ పాదయాత్రికురాలు శ్రీమతి షర్మిలకు ఎదురొచ్చారు. రాజన్న తనయపై అభిమానం నిండిన మహిళలు సమీపం నుంచే చూడాలని రోడ్లకు ఇరువైపులా బారులు తీరారు. లంబాడీలు సాంప్రదాయ నృత్యాలతో ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న శ్రీమతి షర్మిల ఖమ్మం జిల్లాలో ఏడవ రోజు ఆదివారం 13.4 కిలోమీటర్లు నడిచారు. ఖమ్మం అర్బన్ మండలం శివాయిగూడెం శివారు నుంచి ఉదయం పాదయాత్ర  ప్రారంభమైంది. అక్కడి నుండి కామేపల్లి మండలం ముచ్చర్ల వరకు కొనసాగింది.

శివాయిగూడెం నుంచి శ్రీమతి షర్మిల పాదయాత్ర మంచుకొండ వరకూ వచ్చినప్పుడు లంబాడీ మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. మంచుకొండ సెంటర్‌లో శ్రీమతి షర్మిల వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ తరువాతా వాహనం ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. అక్కడి నుంచి బూడిదంపాడుకు పాదయాత్ర చేరుకోగానే మహిళలు శ్రీమతి షర్మిలకు బొట్టుపెట్టి స్వాగతం పలికారు. ‌బూడిదంపాడు సెంటర్‌లో మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే మహిళలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి వారి సమస్య‌లు అడిగి తెలుసుకున్నారు.

ఈ రచ్చబండ కార్యక్రమానికి లంబాడీ మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల ప్రసంగిస్తూ జగనన్న సిఎం అయితే రాజన్న రాజ్యం వస్తుందని, అందరి కష్టాలు తీరుతాయని వారికి భరోసా ఇచ్చారు. రాంరెడ్డినగర్ మీదుగా పాదయాత్ర ఇల్లెందు నియోజకవర్గం కామేపల్లి మండలంలోకి ప్రవేశించింది.‌

పండితాపురంలో హార్దిక స్వాగతం :
ఇల్లెందు నియోజకవర్గానికి చెందిన నాయకులు పండితాపురం సరిహద్దులో శ్రీమతి షర్మిల పాదయాత్రకు డప్పు వాయిద్యాలు, లంబాడీ నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. డోర్నకల్, కురవి మండలాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు పండితాపురం తరలివచ్చారు. పండితాపురంలో‌ మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేయడంతో‌ పాటు పార్టీ జెండాను శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. అక్కడి నుంచి ముచ్చర్ల క్రాస్‌రోడ్ వద్దకు పాదయాత్ర చేరుకుంది. ఇక్కడ వై‌యస్‌ఆర్ విగ్రహావిష్కరణ చేసి వికలాంగులతో ‌ఆమె ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ముచ్చర్ల రహదారుల్లో జనమే జనం :
ముచ్చర్ల క్రాస్‌రోడ్డు నుంచి ముచ్చర్ల వరకు రహదారులన్నీ జనంతో నిండిపోయాయి. శ్రీమతి షర్మిల నడిచివచ్చే రోడ్డుకు ఇరువైపులా మహిళలు బారులు తీరారు. వారికి అభివాదం చేస్తూ శ్రీమతి షర్మిల ముచ్చర్ల సెంటర్ వరకు ‌వెళ్ళారు. సెంటర్‌లో వైయస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభలో మాట్లాడుతూ ముచ్చర్ల వాసుల కలలు జగనన్న ‌సిఎం అయితే నెరవేరుతాయని, జగనన్నను సిఎం కావాలని ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ఇల్లెందు నియోజకవర్గం కామేపల్లి, ఇల్లెందు, టేకులపల్లి, గార్ల, బయ్యారం మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సభకు హాజరయ్యారు.
Back to Top