షర్మిల పాదయాత్రకు పోటెత్తిన జన ప్రభంజనం

కనగల్‌ (నల్గొండ జిల్లా) : ‌కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు, దానికి వంత పాడి భుజాన మోస్తున్న చంద్రబాబు తీరుకు నిరసనగా మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న శ్రీమతి షర్మిలకు మంగళవారంనాడు అభిమానులు, పార్టీ శ్రేణులు, నల్గొండ జిల్లా ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. చండూరు మండలం కురంపల్లి నుంచి జిల్లాలో ప్రారంభమైన ఐదవ రోజు పాదయాత్రకు జనం విశేష సంఖ్యలో పోటెత్తారు. మండలంలోని జి.యడవల్లి, బుడమర్లపల్లి, కనగల్ ఎ‌క్సురోడ్ మీదుగా కనగ‌ల్ ‌వరకు శ్రీమతి షర్మిల పాయాత్ర కొనసాగింది. మంగళవారంనాడు శ్రీమతి షర్మిల 15.3 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. శ్రీమతి షర్మిలకు స్థానిక ప్రజలు అఖండ స్వాగతం పలికారు. అదే స్థాయిలో బహిరంగ సభకు కూడా జనం హాజరు కావడంతో కనగల్ ఎ‌క్సురోడ్ కిక్కిరిసి‌పోయింది.

రాజన్న కూతురు, జగనన్న సోదరి శ్రీమతి షర్మిలను దగ్గరగా చూసేందుకు, కలిసేందుకు జి.యడవల్లిలో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు పోటీ పడ్డారు. మహిళలు తమ బిడ్డలను ఎత్తుకొని పరుగులు తీస్తూ శ్రీమతి షర్మిల వద్దకు వచ్చారు. అనంతరం జి.యడవల్లిలో ఆమె నిర్వహించిన రచ్చబండలో పాల్గొని తమ సమస్యలు చెప్పుకున్నారు.

పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహం:
శ్రీమతి షర్మిల మంగళవారం నాటి మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆద్యంతమూ హుషారుగా, ఉత్సాహంగా కొనసాగింది. పాదయాత్ర సందర్భంగా శ్రీమతి షర్మిల కనగల్ సెంటర్‌లో ఉన్న మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మందడి రామచంద్రారెడ్డి, చర్లగౌరారానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు పల్లె శ్రీనివా‌స్‌గౌడ్‌కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అంతకు ముందు నకిరేకల్ నియోజకవర్గంలో నిమ్మ రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ‌ శ్రీమతి షర్మిలకు ఆ మండల కన్వీనర్ శ్రీనివా‌స్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. పాదయాత్రలో కనగల్ మండలం, నల్లగొండ పట్టణానికి చెందిన అనేక‌ మంది కాంగ్రెస్, ‌టిడిపి నాయకులు కూడా పాదయాత్రను చూసేందుకు ఆసక్తిగా తరలి రావడం గమనార్హం.

ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సిపి జిల్లా సమన్వయకర్త బండారు మోహన్‌రెడ్డి, కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి, నిజామాబా‌ద్ జిల్లా పరిశీలకు‌డు గాదె నిరంజన్‌రెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి కె.ఎల్‌.ఎన్‌. ప్రసాద్, ‌బి.సి., మైనారిటీ, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్లు వనం శ్రీశైలంగౌ‌డ్, ఎం‌.డి సలీం, ఇరుగు సునీల్ కుమా‌ర్, మైనారిటీ నాయకులు సిరా‌జ్‌ఖాన్, స్టీరింగ్ కమిటీ సభ్యులు పిట్టా రాంరెడ్డి, తుమ్మలపల్లి భాస్క‌ర్, కుంభం శ్రీనివా‌స్‌రెడ్డి, తిప్పర్తి రుక్మారెడ్డి, మేకల ప్రదీప్‌రెడ్డి, ఇంజం నర్సిరెడ్డి, తన్నీరు ఉమేష్, విద్యార్థి విభాగం జిల్లా కన్వీన‌ర్ పర్వతం వేణు, యువజన విభాగం కన్వీన‌ర్ కాటంరెడ్డి ప్రసా‌ద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Back to Top