మహిళ ప్రాణాలకు వెలకట్టిన తెలుగుదేశం నేతలు

విశాఖ పట్నం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెటిల్ మెంట్ల బాటలో తెలుగుదేశం
ఎమ్మెల్యేలు నడుస్తున్నారు. ఏకంగా ఒక నిండు ప్రాణానికి సెటిల్ మెంట్ చేసేందుకు వైజాగ్ టీడీపీ నాయకులు ఉరకలు వేస్తున్నారు.

        విశాఖపట్నం వడ్లపూడి
ప్రాంతానికి చెందిన మోహన్ కుమార్, లావణ్య దంపతులు అనకాపల్లిలోని నూకాలమ్మ
దర్శనానికి వెళ్లి బైక్ మీద తిరిగి వస్తున్నారు. అనకాపల్లి ప్రాంతానికి చెందిన
హేమంత్ కుమార్, అతని స్నేహితులు కారు మీద వస్తూ ఈవ్ టీజింగ్ కు పాల్పడ్డారు. బైక్
ను వెంటాడి వేధిస్తుంటే తప్పించుకొనేందుకు లావణ్య దంపతులు ప్రయత్నించారు. చివరకు
ఆమెను కారుతో గుద్దించి హేమంత్ కుమార్ తదితరులు చంపేశారు. తర్వాత తాపీగా అక్కడ
నుంచి వెళ్లిపోయారు. సహజంగానే ఇది విశాఖ జిల్లాలో సంచలనం కలిగించింది. అయితే
వెంటనే తెలుగుదేశం నాయకులు రంగంలోకి దిగారు.

        చనిపోయిన మహిళ ఎలాగు
తిరిగిరాదంటూ భర్త మోహన్ కుమార్ కుటుంబ సభ్యుల్ని బెదిరించారు. తాము చెప్పినట్లుగా
సెటిల్ మెంట్ కు ఒప్పుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీంతో
భయపడిన ఆ కుటుంబం టీడీపీ నేతల మాటలకు తలొగ్గింది. దీంతో 10 లక్షల రూపాయిలకు సెటిల్
మెంట్ జరిగిపోయింది.

        అలనాడు ఇసుక మాఫియాను అడ్డుకొనేందుకు
మహిళా తహశీల్దార్ వనజాక్షి ప్రయత్నించినప్పుడు ఆమె మీద టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని
ప్రభాకర్ దాడి చేయించారు. పట్టపగలు ఒక మహిళ మీద నిస్సిగ్గుగా దాడికి పాల్పడిన
ఎమ్మెల్యేను దగ్గర పెట్టుకొని చంద్రబాబు క్యాంప్ కార్యాలయంలో సెటిల్ మెంట్
చేయించారు. మహిళా అధికారి నోరెత్తకుండా సెటిల్ మెంట్ చేయించారు. తర్వాత మహిళా
విద్యార్థిని రిషితేశ్వరి నాగార్జున విశ్వవిద్యాలయంలో మ్రగాళ్ల బారిన పడి ఆత్మహత్య
చేసుకొంటే టీడీపీ నేతలు అలాగే సెటిల్ మెంట్ చేయించారు. ఈ విధంగా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే సెటిల్ మెంట్లు చేయిస్తూ టీడీపీ నేతలు విర్రవీగుతున్నారు. 

        ఇప్పుడు ఏకంగా నడిరోడ్డు మీద
మహిళను వేధించి, వెంటాడి చంపేస్తే దిక్కులేని పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం
ఎమ్మెల్యే స్వయంగా సెటిల్ మెంట్ చేయించటంతో న్యాయానికి గంతలు కట్టినట్లయింది.

 

Back to Top