రాజ‌ధాని ర‌హ‌స్యం బ‌ట్ట‌బ‌య‌లు!

() రాజ‌ధాని అభివృద్ధి భాగ‌స్వామి ఎంపిక‌కు టెండ‌ర్ నోటిఫికేష‌న్ జారీ
() సింగ‌పూర్ క‌న్సార్టియం ప్ర‌తిపాద‌న‌ల‌పై కౌంట‌ర్ల‌కు ఆహ్వానం
()  స‌ర్కార్ వాటాపై గోప్య‌త... కౌంట‌ర్ ప్ర‌తిపాద‌న‌ల‌కు అది ప్ర‌ధాన అడ్డంకి
() కౌంట‌ర్‌ల గ‌డువు 45 రోజుల‌కే ప‌రిమితం.. ష‌ర‌తుల‌న్నింటికీ స‌ర్కారు స‌రే
న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి అభివృద్ధి పేరుతో సాగుతున్న అంత‌ర్జాతీయ స్కాముల నాట‌కంలో అస‌లు అంకానికి తెర‌లేచింది. ప్ర‌పంచ స్థాయి రాజ‌ధాని నిర్మాణం పేరుతో సింగ‌పూర్ ప్రైవేట్ సంస్థ‌ల‌తో కుమ్మ‌క్కై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ర‌చించిన దోపిడీ ప్ర‌ణాళిక‌లో ఒక్కొక్క ర‌హ‌స్యం బ‌య‌ట‌ప‌డుతోంది. రాజ‌ధాని అభివృద్ధి భాగ‌స్వామి ఎంపిక కోసం స్విస్ ఛాలెంజ్ ప‌ద్ధ‌తిలో  టెండ‌ర్ నోటిఫికేష‌న్ జారీ అయ్యంది. సింగ‌పూర్ ప్రైవేటు సంస్థ‌లు ప్ర‌భుత్వ పెద్ద‌ల మ‌ధ్య కుదిరిన ర‌హ‌స్య ఒప్పందాలు  జారీ చేశారు. టెండ‌ర్ నోటిఫికేష‌న్‌తో ఈ విష‌యం స్ప‌ష్టంగా బ‌ట్ట‌బ‌య‌ల‌య్యాయి. రాష్ట్ర ప్ర‌భుత్వం సింగ‌పూర్ కంపెనీలు కుమ్మ‌క్క‌య్యాయనేందుకు ఈ టెండ‌ర్ నోటిఫికేష‌న్ ఓ స‌జీవ సాక్ష్యం. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఎంత రెవెన్యూ ఇస్తార‌నే విష‌యాన్ని ర‌హ‌స్యంగా ఉంచారు. కౌంట‌ర్ దాఖ‌లు చేసే సంస్థ‌ల‌ను గంద‌ర‌గోళ ప‌ర‌చ‌డం కోస‌మే ఈ గోప్య‌త పాటించార‌ని అర్ధ‌మౌతోంది. అలాగే కౌంట‌ర్ల‌కు 60 రోజుల పాటు గ‌డువు ఇవ్వాల్సి ఉండ‌గా 45 రోజుల‌కు ప‌రిమితం చేశారు. 1.691 ఎక‌రాల భూమిని స‌మ‌కూర్చ‌డంతో పాటు రూ.5.500 కోట్ల‌తో ఆ భూముల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం మౌలిక స‌దుపాయాలు క‌ల్ప‌స్తే సింగ‌పూర్ ప్రైవేట్ సంస్థ‌లు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేల కోట్ల మేర ల‌బ్ధి పొంద‌బోతున్నారు.
లోగుట్టు బాబుకెరుక‌
రాజ‌ధాని అభివృద్ధి భాగ‌స్వామి ఎంపిక‌కు స్విస్ ఛాలెంజ్ విధానంలో ఏపీఈ-ప్రొక్యూర్‌మెంట్‌.కాంమ్ వెబ్‌సైట్‌లో సీఆర్‌డీఏ జారీ చేసిన ప్ర‌క‌ట‌న అర గంట‌లోనే మాయ‌మైపోయింది. సోమ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు టెండ‌ర్ నోటిషికేష‌న్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెస్తామ‌ని సీఆర్‌డీఏ ప్ర‌క‌టించింది. కానీ.. సాయంత్రం 6.30 గంట‌ల వ‌ర‌కూ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి అర‌గంట‌లోనే ఆ ప్ర‌క‌ట‌న‌ను వెబ్‌పైట్ నుంచి తీసివేసింది. ఇందులో లోగుట్టు బాబు స‌ర్కారుకే ఎరుక‌.
సింగ‌పూర్ సంస్థ‌ల‌కు సాగిల‌ప‌డ్డ స‌ర్కార్‌: 
రాజ‌ధాని నిర్మించేట‌ప్పుడుగానీ... నిర్మాణం పూర్త‌యిన త‌ర్వాత గానీ ఏడీపీ ఒప్పందాన్ని ర‌ద్దు చేస్తే స‌ర్కార్ న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని సింగ‌పూర్ సంస్థ‌లు మెలిక పెట్టాయి. ఈ వ్య‌వ‌హారంలో స‌ర్కార్ వైఫ‌ల్యం ఉంటే ప‌రిహారం రాబ‌ట్టుకోవ‌డానికి వీలుగా ప‌లు తిర‌కాసులు పెట్టాయి. సింగ‌పూర్ సంస్థ‌ల క‌న్సార్టియం ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకుంటే మాత్రం .. అప్ప‌టి మార్కెట్ విలువ ఆధారంగా ఆ సంస్థ వాటాను స‌ర్కార్ కొనుగోలు చేయాలి. ఈ వ్య‌వ‌హారంలో ఏదైనా వివాదాలు ఉత్ప‌న్న‌మైతే... వాటిని లండ‌న్ కోర్టులోనే ప‌రిష్క‌రించుకోవాలంటూ సింగ‌పూర్ సంస్థ‌లు తిర‌కాసు పెట్టాయి.
ర‌హ‌స్య ఒప్పందాలు
సార్ట‌ప్ ఏరియా ప్రాజెక్టు అమ‌లుకు స్విస్ ఛాలెంజ్ విధానం టెండ‌ర్ నోటిషికేష‌న్‌ను ప్ర‌భుత్వం జారీచేసిన విధానాన్ని, అందులోని అంశాల‌ను ప‌రిశీలిస్తే... సింగ‌పూర్ సంస్థ‌ల‌కే ప్రాజెక్టును క‌ట్ట‌బెట్టేందుకు సిద్ధ‌మైన‌ట్టు తేట‌తెల్ల‌మ‌వుతోంది. అమ‌రావ‌తి అభివృద్ధి భాగ‌స్వామిగా ఎంపిక కావాల‌నుకునే సంస్థ‌లు సింగ‌పూర్‌ సంస్థ‌ల‌క‌న్నా మెరుగైన ప్ర‌తిపాద‌న‌ల‌ను ఇవ్వాలి. అంటే.. ప్ర‌భుత్వ ఖ‌ర్చును త‌గ్గించి, త‌మ ఖ‌ర్చును పెంచి ప్రాజెక్టును చేప‌ట్ట‌డం ద్వారా వ‌చ్చే ఆదాయంలో స‌ర్కారుకు ఎక్క‌వ వాటా వ‌చ్చేలా ప్ర‌తిపాద‌న‌లు త‌యారు చేయాల్సి ఉంటుంది. కానీ... సింగ‌పూర్ సంస్థ‌లు ప్రాజెక్టు ద్వారా వ‌చ్చే ఆదాయంలో స‌ర్కార్‌కు ఎంత వాటా ఇస్తామ‌న్న‌ది టెండ‌ర్ బ‌హిర్గ‌తం చేయ‌లేదు. అంటే.. కౌంట‌ర్ ప్ర‌తిపాద‌న‌లు దాఖ‌లుకు అవ‌కాశ‌మే ఉండ‌దు. ఇది స్విస్ ఛాలెంజ్ విధానం నిబంధ‌న‌ల‌కు... సుప్రీంకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల‌కు విరుద్ధం. దీన్ని బ‌ట్టి చూస్తే ప్రాజెక్టును సింగ‌పూర్ సంస్థ‌ల‌కే క‌ట్ట‌బెట్టేలా ఆ సంస్థ‌ల‌తో ప్ర‌భుత్వ పెద్ద‌లు ర‌హ‌స్య ఒప్పందాలు చేసుకున్న‌ట్లు తేట‌తెల్ల‌మ‌వుతోంది.


Back to Top