చంద్రబాబు ఆల్ ఫ్రీ అసలు గుట్టు ఇది


() ఇసుక మాఫియాతో అడ్డగోలు దోపిడీ

() వేల కోట్లు దోచేసిన
తెలుగు తమ్ముళ్లు

() టెండర్లలో బయట
వ్యాపారులకు అవకాశం

() ఖంగు తిన్న పచ్చ
చొక్కాలు

() ఉచితం పేరుతో లోకల్
దందాలకు తెర

హైదరాబాద్) ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడుకి అకస్మాతుగా ప్రజల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. అందుకే నిరుపేదలు
ఇళ్లు కట్టుకొంటుంటే వారికి ఇసుకను ఉచితంగా ఇస్తామని ప్రకటించేశారు. ఇందుకోసం విధి
విధానాల్ని త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. రెండేళ్లుగా ఇసుక పేరుతో ఎడాపెడా
దోచేసిన చంద్రబాబుకి ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చిందా అని అంతా ఆశ్చర్యపోయారు. తీరా
లోతులో విచారణ చేస్తే చాలా విషయాలు బయట పడుతున్నాయి.

        ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టేసరికి
రాష్ట్రంలో ఇసుక రేటు రూ. 60 పలికేది. ఇది క్రమ క్రమంగా పెరిగి రూ. 700 దాకా చేరిపోయింది.
అంటే దాదాపు పది రెట్ల మేర పెరిగిపోయింది. అదే సమయంలో ఇసుక మీద ప్రభుత్వానికి
బోలెడు ఆదాయం తెచ్చేస్తున్నామని ప్రభుత్వం కోతలు కోసింది. గతంలో రూ. 200 కోట్లు
వచ్చే ఆదాయం కాస్తా తమ హయంలో రూ. 800 కోట్లకు చేరిందని గొప్పలు పోయింది. ఇదంతా
తాము అవలంబిస్తున్న కొత్త ఇసుక పాలసీ తోనే అని గప్పాలు కొట్టుకొన్నారు. వాస్తవంగా
ఇసుక ధర పది రెట్లు పెరిగినప్పుడు ఆదాయం కూడా అదే రీతిన పది రెట్లు పెరగాలి.అంటే
రూ. 2 వేల కోట్ల మేర ఆదాయం రావాలన్న మాట. అక్కడే అధికారికంగా రూ. 12వందల కోట్ల
రూపాయిల మేర దోపిడీ జరిగిపోయింది. అనధికారికంగా ఎన్ని వందల కోట్ల రూపాయిలు
దోచేశారో అర్థం చేసుకోవచ్చు.

        చంద్రబాబు  అధికారం
చేపట్టిన నాటి నుంచి ఇప్పటి దాకా పదుల సంఖ్యలో మంత్రివర్గ సమావేశంలో ఇసుక మీదనే
చర్చించారంటే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.  ఈ క్రమంలో చివరకు టెండర్ విధానాలకు తెర దీశారు.
కానీ, టెండర్లు ఖరారు అవుతున్న వేళ మరో విషయం వెలుగు  చూసింది. చాలా చోట్ల టెండర్లు టీడీపీకి సంబంధం
లేని వ్యక్తులకు ఖరారు అవుతున్నట్లుగా బయట పడింది. దీంతో బయట వారికి టెండర్లు
ఖరారు అయి, ఇసుక అమ్మకాలు చేతులు మారతాయని అర్థం అయింది. దీంతో టెండర్లను రద్దు
చేసి ఉచిత విధానం అంటూ కొత్త పల్లవి అందుకొన్నారన్న మాట వినిపిస్తోంది.

                అంటే ఇప్పటి దాకా బడా బాబుల చేతుల మీదుగా సాగిన ఇసుక
అమ్మకాలు దొడ్డి దారిన స్థానిక నేతల చేతుల్లోకి మారతాయన్న మాట వినిపిస్తోంది.
ఇప్పటికే ఎక్కడికక్కడ తెలుగుదేశం నేతల వివరాలు సేకరించుకొని అనధికారికంగా వాటాల
కార్యక్రమం సాగుతోందని తెలుస్తోంది. ఉచిత ఇసుక పేరుతో తెలుగు తమ్ముళ్లు
పంచుకొనేట్లుగా రంగం సిద్ధం చేసుకొన్నట్లు సమాచారం. 

Back to Top