హోదా ఉద్యమం ఇంతటితో ఆగలేదు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ప్రజల ఆశలకు వారధి. వైఎస్ ఆశయాల సారధి. ప్రత్యేక హోదా కోసం దేశరాజధానిలో ఒంటరి పోరు చేస్తున్న ధీర. అధ్యక్షుడి ఒక్కమాటతో కదనరంగంలోకి దూకిన వీర సైనికులు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్.పిలు. వయసును లెక్కచేయలేదు, ఆరోగ్యాన్ని లెక్కచేయలేదు, ప్రకృతి విలయాన్ని లెక్కచేయలేదు..చివరకు ప్రాణాలను కూడా లెక్కచేయాలేదు. అవును...ఇది పోరాటాల పార్టీ. ఈ పార్టీ పుట్టుకే ఓ పోరాటం. ప్రజాల ఆకాంక్షలు నెరవేర్చడమే పార్టీ సిద్ధాంతం. 

ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్ అంచెలంచల ఉద్యమ ప్రణాళిక రచించారు. దాన్ని ప్రజలముందు స్పష్టంగా వివరించారు. పార్లమెంట్ లో ఎమ్.పిల ప్రశ్నలు, కేంద్రంపై అవిశ్వాసం, అది అవ్వని పక్షంలో రాజీనామాలు, వెనువెంటనే ఆమరణ నిరాహారదీక్ష అంటూ తమ హోదా ఉద్యమ కార్యాచరణను ప్రతిఒక్కరిముందూ ఉంచారు. బహిరంగ సభలో ప్రజా సమక్షంలో హోదా కోసం తమ పార్టీ చేసే పోరాటాన్ని వివరంగా తెలియజెప్పారు. ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎమ్.పిల నిరాహారదీక్ష ఆరంభమైన క్షణం నుంచీ రాష్ట్రం యావత్తూ మద్దతుగా ఎన్నో నిరసన కార్యక్రమాలు జరిగాయి. రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలు వెల్లువెత్తాయి. 

వయసును లెక్కచేయని పెద్దాయన

మేకపాటి రాజమోహన రెడ్డి. ఈయన వయసు 74 సంవ్సరాలు. ఆ వయసులో నిరాహార దీక్షకు పూనుకోవడం అంటే తెలిసి తెలసి ప్రాణాలను బలిపెట్టడమే. కానీ హోదా కోసం, రాష్ట్ర శ్రేయస్సుకోసం, తమ అధినేత మాట కోసం దీక్షకు సై అన్నారు. రెండు రోజుల తర్వాత తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ కూడా ఆయన దీక్షను కొనసాగించారు. వైద్యులు ఆయన ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉందని, బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా హోదా కోసం నినదించిన మేకపాటిని చూసి తెలుగు ప్రజలు గర్వించారు. 

వెనుకడుగేయని వరప్రసాద్

తిరుపతి ఎమ్.పి వరప్రసాద్ సైతం పోరాటానికి వెనుకడుగు వేయలేదు. ఆమరణదీక్షలో తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ కూడా నిరాహారదీక్షను కొనసాగించారు. ఎలాంటి ఆహారం లేకుండా ఉండటంతో డీహైడ్రేషన్ కు గురయ్యారు. షుగర్ లెవెల్స్ 72కు పడిపోయాయి. ఇలాంటి సమయంలో దీక్ష కొనసాగించడం సరికాదంటూ వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల తర్వాత వైద్యులు ఆయనను దీక్ష ఆపేయాలని సూచించారు. అయినప్పటికీ ఆయన ఒప్పుకోకపోవడంతో పోలీసుల సాయంతో బలవంతంగా ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. 

హోదా యుద్ధంలో యువసైనికులు

అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి...ఇరువురు యువకిషోరాలు. రాష్ట్ర భవిష్యత్ పై ఎ.న్నోసార్లు తమ పంథాను తెలియజేసినవారు. పార్లమెంట్లో సైతం మిథున్ రెడ్డి తన వాదనను ఎంతో సమర్థవంతంగా వినిపించారు. రాజకీయ జీవితంలో పదవులే ప్రధానం అని వీరెప్పుడూ భావించలేదు. ప్రజలు, తాము నమ్మిన పార్టీ, తమను నమ్మిన నాయకుడు ఇవే వారి ప్రాధాన్యాలు. అందుకే హోదా కోసం నినదించడమే కాదు, నిర్ణయాత్మకంగా వ్యవహరించారు. పదవులకు రాజీనామాలు ఇచ్చి, ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఆరు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న మిథున్, అవినాష్ రెడ్డిల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో బుధవారం రోజున రామంమనోహర్ లోహియా ఆసుత్రి వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించారు. ఎంపి అవినాష్ రెడ్డి బ్లడ్ షుగర్ లెవెల్స్ 73కు పడిపోగా, మరో ఎంపీ మిథున్ రెడ్డి బ్లడ్ షుగర్ 71కి పడిపోయింది. బీపీ లెవల్స్ కూడా ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయని వైద్యులు తెలిపారు. ఇలాగే దీక్షను కొనసాగిస్తే శరీరంలోని ఇతర అవయవాలు, మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరించారు. అయినప్పటికీ ఇరువురు యువ ఎమ్.పిలు దీక్షను విరమించడానికి నిరాకరించారు. మొక్కవోని ధైర్యంతో దీక్షను కొనసాగించారు. వైద్యులు వారి ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడంతో, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సును రంగంలోకి దింపి దీక్షా శిబిరంలో ఉన్న ఎమ్.పిలను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. కదలలేని పరిస్థితుల్లో సైతం దీక్షా స్థలినుంచి ఆసుపత్రికి తరలించడాన్ని వ్యతిరేకించారు ఎమ్.పిలు. దీక్ష జరుగుతున్న ఎపి భవన్ ప్రాంగణం అంతా ప్రత్యేక హోదా నినాదాలతో, ఎమ్.పిలను బలవంతంగా దీక్షా స్థలి నుంచి తరలించడంపై నిరసనలతో హోరెత్తింది. ఎమ్.పిల తరలింపును అడ్డుకునేందుకు వైఎస్సార్సిపీ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నంచాయి. పోలీసులను ప్రతిఘటించాయి. పోలీసు బలగాలు, వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర తోపులాటలు కూడా జరిగాయి. ఇటువంటి గందరగోళ పరిస్థితుల మధ్యే మిథున్, అవినాష్ రెడ్డిలను రాంమనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. 

విజయమ్మ ఆశీర్వాదం

ఎమ్.పి మేకపాటి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను పరామర్శించడానికి, హోదా దీక్షలో ఉన్న ఎమ్.పిలకు మద్దతు తెలిపేందుకు వైఎస్. విజయమ్మ ఢిల్లీకి వచ్చారు. ఆసుపత్రిలో మేకపాటిని పరామర్శించి, ఎపి భవన్ కు వచ్చి దీక్షా శిబిరంలో ఎమ్.పిలకు తన మద్దతు ప్రకటించారు. అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమని, దాన్ని సాధించేవరకూ తనబిడ్డ, వైఎస్సార్ కాంగ్రెస్ వెనకడుగు వేయవని అన్నారు వైఎస్ విజయమ్మ. దీక్ష చేస్తున్న ఎమ్.పిలందరినీ ఆమె అభినందించారు. 

హోదా ఆంధ్రుల హక్కు. అది భిక్ష కాదు. రక్ష అంటోంది వైఎస్సార్ కాంగ్రెస్. హోదా ఉద్యమాన్ని, ఎమ్.పిల నిరాహారదీక్షను భగ్నం చేయడంద్వారా నీరుకార్చామని ప్రభుత్వం భావిస్తే అది తెలివితక్కువ తనమే అవుతుంది. ఓ పక్క రైలు రోకోలు, రాస్తారోకోలు, నిరసనలతో ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతోంది. ప్రత్యేక హోదా ఉద్యమాని మరింత తీవ్రతరం చేసి, ప్రభుత్వం దిగి వచ్చేలా చేసేందుకు వైఎస్ జగన్, ఇంకా పార్టీ నేతలూ కలిసి పటిష్టమైన కార్యాచరణకు రంగం సిద్ధం చేసకోనున్నారు. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుకుంటూ, అటు కేంద్రంపై, కలిసి రావాల్సిందిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం పై కూడా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు.  
 
Back to Top