<p style="text-align:justify">హైదరాబాద్) అసెంబ్లీలో రెండో రోజు కూడా ప్రతిపక్షం గొంతు నొక్కే కుట్ర జరుగుతోంది. అసెంబ్లీ సమావేశం మొదలైన వెంటనే నిబంధన 344 కింద వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ప్రకటించారు. దీని మీద మాట్లాడేందుకు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ప్రయత్నించారు. కాల్ మనీ సెక్సు రాకెట్ ప్రధాన నిందితుడు సత్యానందం ముఖ్యమంత్రి తో తీయించుకొన్న ఫోటోను చూపించారు. ముఖ్యమంత్రి తో నిందితులు చెట్టపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారని, ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనలు చేస్తున్నారని సభ ద్రష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండగానే మైక్ కట్ చేశారు. తరవాత అదే పనిగా ప్రభుత్వంలోని మంత్రులు మాట్లాడేందుకు అవకాశాలు ఇచ్చారు తప్పితే విపక్షానికి మాత్రం అవకాశం ఇవ్వలేదు. చివరగ ప్రతిపక్షానికి మరోసారి అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ మైక్ కట్ చేయించారు. అనంతరం సభ వాయిదా పడింది. <iframe width="600" height="40" src="https://www.youtube.com/embed/ZnIlBhC5ieQ" frameborder="0"/></p>