రుణమాఫీ బాధితులు


అధికారంలోకి రాగానే రుణమాఫీ ఫైలు పైనే తొలిసంతకం అన్నాడు చంద్రబాబు. కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే హామీకి తూట్లు పొడిచేసాడు. రుణమాఫీ కమీటీపై సంతకం అని మాట మార్చేసాడు. బేషరుతు రుణమాఫీ హామీని కాస్త పంట రుణాల మాఫీగా కుదించేశాడు. అందులోనూ సవాలక్ష కొర్రీలు వేసాడు. లబ్ది దారులను కుదించేసాడు. చేసే రుణమాఫీ కూడా విడతలవారీగా అంటూ అందులోనూ కటింగులు, ఆలస్యాలు చేసాడు.

బాబు రుణమాఫీ చేస్తాడని రుణాలు చెల్లించని వాళ్లకు బ్యాంకుల నుంచి ఒత్తిళ్లు తప్పలేదు. వచ్చిన ముక్కల ముక్కల మాఫీ రైతుల అప్పుల వడ్డీలకు కూడా చెల్లుబాటు కాలేదు. అప్పు యథాప్రకారం, వడ్డీ తథా ప్రకారం అన్నట్టే ఉంది. కొత్త అప్పులు పుట్టక రైతుల పుట్టి మునిగింది. చివరకు ఫసల్ బీమా కూడా అందక అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. చంద్రబాబుకు శాపనార్థాలు పెడుతున్నారు. ప్రతి జిల్లాలోనూ రుణమాఫీ కాలేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వేలాది మంది రైతులు జిల్లా పరిషత్తుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. పాదయాత్రలో వైఎస్ జగన్ ను ప్రత్యేకంగా వచ్చి కలుస్తున్న రైతులు తమకు రుణమాఫీ జరగనేలేదని ఆవేదనతో చెబుతున్నారు. బాబు మళ్లీ మోసం చేసాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ అయ్యిందని చంద్రబాబు నుంచి లేఖ వచ్చింది కానీ మాఫీ మాత్రం కాలేదంటూ చాలామంది ప్రతిపక్ష నేతకు తెలిపారు. 

ఉమ్మడిరాజధానిగా హైదరాబాద్ 10ఏళ్లపాటు ఉంది. కానీ హైదరాబాద్ లో ఉన్నారన్న సాకు చూపుతూ ఎపిలో పంట రుణం తీసుకున్న వారికి రుణమాఫీ లేకుండా చేసారు.
చేసిన విడతల వారీ హామీల్లో వడ్డీలతో పాటు ఇన్సూరెన్స్ కట్ చేసుకున్నారు. రైతులకే కాదు, మహిళలకు, చేనేత రుణమాఫీలకూ బాబు చిల్లులు పెట్టాడు. ఉపాధిలేక బతుకు తెరువు కోసం వలస పోయిన వారికి రుణమాఫీ వర్తించదంటూ మెలికలు పెట్టాడు బాబు. ఆధార్ లింక్ పేరుతో ఎంతో మందికి మాఫీ వర్తించకుండా చేశాడు. రేషన్, ఆధార్ రెండూ ఉంటేనే మాఫీ అని మాటమార్చారు. ఉద్యాన పంటలకు రుణమాఫీ ఉండదని తేల్చారు. కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అన్నారు. రుణమాఫీ బాధితులు ఇప్పుడు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. చంద్రబాబు మారని మనిషని, ఎప్పటికీ మారడని, రైతులను నాశనం చేసే నరకాసురడని అంటున్నారు. ఎన్నికల హామీల్లో రుణమాఫీ చంద్రబాబు అధికారానికి తొలిమెట్టు అయ్యింది. నేడు అదే రుణమాఫీ అందని రైతుల ఆగ్రహమే జ్వాలగా మారి రాబోయే ఎన్నికల్లో బాబు అధికారం ఆహుతి కాబోతోంది. 




 

తాజా వీడియోలు

Back to Top