కేరళ ను చూసి నేర్చుకోండి.


6,7 దశాబ్దాలుగా
పాలకులుచేసిన పొరపాటునే చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ పునరావ్రతం చేస్తోంది.
రాజధానిగా హైదరాబాద్ ను మాత్రమే డెవలప్ చేసి, మిగిలిన ప్రాంతాల్ని వదిలేశారు.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో వికేంద్రీకరణకు ప్రయత్నాలు జరిగాయి
తప్ప మిగిలిన సమయం అంతా ఇలాగే జరిగింది. ఇప్పుడు తిరిగి చంద్రబాబు పోకడలు ఆ
విధంగానే వెళుతున్నాయి. అమరావతి పేరుతో ఒక్క చోటే అన్నింటిని ఏర్పాటు
చేస్తున్నారు.

అసెంబ్లీ, సచివాలయం, పాలనా
కార్యాలయాలు, శాఖాధిపతుల కార్యాలయాలు, హైకోర్టు వంటి అన్ని రకాల వ్యవస్థల్ని
అక్కడే ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్రగతి ఒక్కచోటే కేంద్రీక్రతం అవుతోంది.
మిగిలిన ప్రాంతాల్లో ప్రగతి కోసం పెద్దగా ఏర్పాట్లు జరగటం లేదు.

కేరళ లో 14 జిల్లాలు ఉంటే
అన్ని ప్రాంతాల్లో విస్తరణ కనిపిస్తుంది. దక్షిణ కేరళ లో రాజధాని తిరువనంతపురం
ఉంటుంది. అక్కడ కేవలం పరిపాలన పరమైన అభివ్రద్ది కనిపిస్తుంది. అక్కడ రెండు
మునిసిపల్ కార్పొరేషన్ లుఉన్నాయి. మధ్య కేరళ లో కొచ్చిన్ ఉంటుంది. ఎర్నాకుళం,
కొచ్చిన్ జంటనగరాల్లోనే హైకోర్టు, బిజినెస్ గ్రోత్ సెంటర్, కమర్షియల్ హబ్ లు
ఉంటాయి. ఇక్కడ కూడా రెండు మునిసిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఉత్తర కేరళ లో మలబార్
తదితర ప్రాంతాల్ని ఫైనాన్సియల్ గ్రోత్ సెంటర్స గా తీర్చిదిద్దారు. ఈ ప్రాంతానికి
చెందిన బంగారం, ఫైనాన్స్ వ్యాపారం ఇప్పుడు దేశ విదేశాలకు విస్తరించింది.
ఆంధ్రప్రదేశ్ లో పేరెన్నిక గన్న ఫైనాన్స్, బంగారం షాపుల హెడ్ క్వార్టర్స్ కేరళ వే
అంటే అతిశయోక్తి కాదు.

పరిపాలన, ప్రగతి సత్వరం
సాధించాలంటే వికేంద్రీకరణ అవసరం. దీన్ని పట్టించుకోకుండా ఒక్క ప్రాంతంకోసమే
పాకులాడటం అన్నది కచ్చితంగా తప్పే. అదే ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్ తప్పు
పడుతున్న అంశం. 

Back to Top