ఈ ప్రశ్నలకు బదులేది బాబూ..!


హైదరాబాద్) అసెంబ్లీ నుంచి నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్
చేసిన ఎమ్మెల్యే రోజా ..చంద్రబాబు, ఆయన మంత్రుల తీరుని కడిగేశారు.
మహిళల పాలిట కాలకేయుడిలా రాక్షస పాలన సాగిస్తున్నారని ఆమె మండిపడ్డారు.

అసెంబ్లీలో తన మీద, తోటి ఎమ్మెల్యేల మీద మూడు
రోజులుగా విపరీతంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు చేసిన
వ్యాఖ్యల్ని బయట పెట్టి, ఆ తర్వాత తాము ఇచ్చిన మాటల్ని
బయటపెడితే పూర్తి నిజాలు బయటకు వస్తాయని ఆమె అన్నారు. మొత్తం ఫుటేజ్ ను బయటకు
తీస్తే వాస్తవాలు అందరికీ అర్థం అవుతాయన్నారు. అసెంబ్లీలో తమ మీద చేస్తున్న
ఆరోపణలకు స్పీకర్ కు విన్నవించుకొన్నామని, దానిని కూడా రక
రకాలుగా ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. చంద్రబాబును ఉద్దేశించి ఆమె చేసిన
పవర్ ఫుల్ కామెంట్స్ ఏమిటంటే..!

1.   అసెంబ్లీని ఎన్టీయార్ భవన్
(టీడీపీ పార్టీ కార్యాలయం) లా మార్చేశారు.

2.   ముందు టీడీపీ వాళ్లు తిట్టిన
తిట్లు చూపించటంలేదు కానీ, వాటికి మేం ఇచ్చిన జవాబుల్ని మాత్రం విజువల్స్ బయటకు ఇచ్చి కారెక్టర్ ను
అసాసినేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

3.   బోండా ఉమ అందరినీ పాతేస్తాను, రండిరా రౌడీల్లారా అన్నారు.
బుచ్చయ్య చౌదరి సమయం సందర్భం లేకుండా నా గురించి ఏం మాట్లాడారు. రావెల కిషోర్ మా మహిళల్ని తిట్టిపోశారు..
వీటి మీద చర్యలు ఉండవా.

4.    వడ్డీ వ్యాపారుల బాక్సర్లు
వచ్చి తమ భార్యలను, పిల్లలను లాక్కుపోతుంటే ఏం
చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రజలు ఉన్నారే. వాళ్ల కన్నీళ్లు కనిపించలేదా? మీ కుటుంబ సభ్యులను ఇలాగే
లాక్కెళ్లిపోతే కడుపుమంటతో సీఎంను నిలదీస్తారా.. వదిలేస్తారా

5.   వనజాక్షి తప్పు చేశారని
అసెంబ్లీలో చెబుతున్నారే..నిజంగా ఆమె జిల్లా దాటి వచ్చి ఉంటే ఆమెను సస్పెండ్
చేయండి. అధికారిని కొట్టినందుకు చింతమనేనిని నాన్ బెయిలబుల్ కేసులో అరెస్టు
చేయండి. మీరు ఆ పని చేయగలరా

6.   నారాయణ కాలేజిలో 18 మంది పిల్లలు చనిపోతే
తల్లిదండ్రులు ఎలా రోదిస్తున్నారో చూడరా? కనీసం మీ మంత్రిమండలి నుంచి
నారాయణను డిస్మిస్ చేశారా, ఆ కేసులు విచారించారా, ఎవరికైనా శిక్షలు వేశారా?'

7.   మహిళా ఎమ్మెల్యేలకు చీము, నెత్తురు ఉంటే.. అంగన్‌వాడీ
మహిళలను బట్టలిప్పి కొడుతుంటే మీరేం చేస్తున్నారని అడుగుతున్నాను. కల్తీ మద్యం
తాగి ఎంతమంది మహిళల పుస్తెలు తెగిపోయాయి.. వాళ్లు వితంతువులు అవ్వడానికి కారణమైన
మీరు మీ షూటింగ్ పిచ్చితో పుష్కరాల్లో 30 మంది మరణించారు.. అది చూసి మీరు సిగ్గుతో
తలదించుకోవాలి తప్ప నేను తలదించుకోనక్కర్లేదు.

8.   గిరిజన మహిళ బాక్సైట్
తవ్వితే గిరిజనులకు నష్టం కలుగుతుందని పోరాడితే ఆమె మీద దేశద్రోహం నేరం మోపుతారు.
ఆమెను జీవిత ఖైదు చేయాలట. ఎవరు మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ల క్యారెక్టర్‌ను
చంపేస్తారన్న మాట. ఇంతకుముందు అందరూ అలాగే అనుకుంటే చంద్రబాబు, ఆయన మంత్రులు ఉండేవాళ్లా?

9.   నువ్వున్న విజయవాడలోనే ఇన్ని
జరుగుతుంటే, విజయవాడకు చెడ్డపేరు
తేవడానికి నేను ప్రయత్నిస్తున్నానని చెప్పడం సిగ్గుచేటు

10.                ఆడవాళ్లే
కదా అబలలే కదా అని అనుకొంటే చాలా తప్పు. కాలికింద వేసి నలిపేయచ్చు అనుకోవటం సరి
కాదు. మహిళా శక్తి తిరగబడితే అంతు చూసే దాకా వదలదు అని గుర్తించుకోవాలి. 

 

Back to Top