దోచుకొన్నవారికి దోచుకొన్నంత..!

() ముఖ్య‌మంత్రి, మంత్రి క‌నుస‌న్న‌ల్లో వెలిగొండ ప్రాజెక్టులో
అవినీతి

()
 
కాంట్రాక్ట‌ర్ల‌కు అద‌నంగా రూ. 68.44 కోట్లు

()
ప‌నులు చేయ‌క‌పోయినా
అడిగినంత చెల్లింపులు

 

 సాగునీటి ప్ర‌జెక్టుల్లో అవినీతి వ‌ర‌ద
పారిస్తున్న పాల‌కులు మ‌రో దందాకు తెర‌తీశారు. వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల ప‌నుల్లో
కాంట్రాక్ట‌ర్ల నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అద‌న‌పు చెల్లింపులు చేస్తూ ప‌ర్సంటేజీల‌ను
జేబుల్లో నింపుకుంటున్నారు. ముఖ్య‌మంత్రి, కీల‌క మంత్రి క‌నుస‌న్న‌ల్లోనే కాంట్రాక్ట‌ర్ల‌కు
ప్ర‌జాధ‌నాన్నిదోచిపెడుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. శ్రీశైలం రిజ‌ర్వాయ‌ర్
నుంచి కొల్లం వాగు మీదుగా 43.5 టీఎంసీల‌ను త‌ర‌లించి ప్ర‌కాశం, నెల్లూరు, వైయ‌స్ఆర్ జిల్లాల్లో 4.47 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగు నీరందించేందుకు దివంగత
మహానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో వెలిగొండ ప్రాజెక్టును చేప‌ట్టారు. ఈ
ప్రాజెక్టులో భాగంగా రెండు ట‌న్నెల్స్(సొరంగాలు) త‌వ్వాల‌ని నిర్ణ‌యించారు. ఇప్పుడు
ఈ పనులు జరగుతున్నాయి.

నెల్లూరు జిల్లా టీడీపీ నేత‌ల‌కు చెందిన సాబీర్ డ్యాం అనే సంస్థ‌, ప్ర‌సాద్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌తో క‌ల‌సి మొద‌టి
ట‌న్న‌ల్ ప‌నుల‌ను రూ. 624.6 కోట్ల‌కు ద‌క్కించుకుంది. రెండో ట‌న్నెల్ ప‌నుల‌ను
టీడీపీ స‌న్నిహిత సంబంధాలున్న హెచ్‌సీసీ - సీపీఐఎల్ (జేవీ) సంస్థ రూ. 735.21 కోట్ల‌కు ద‌క్కించుకుంది. మొద‌టి సొరంగాన్ని
మ‌రో 5.674 కిలోమీట‌ర్ల మేర త‌వ్వాల్సి ఉంది. రెండో
సొరంగాన్ని 9.428 కిలోమీట‌ర్లు త‌వ్వాల్సి ఉంది. రాష్ట్రంలో
టీడీపీ అధికారంలోకి రాగానే కాంట్రాక్ట‌ర్లు ప‌నులు నిల‌పివేశారు. సొరంగాల త‌వ్వ‌కానికి
విదేశాల నుంచి యంత్రాల‌ను దిగుమ‌తి చేసుకున్నామ‌ని, వాటి మ‌ర‌మ్మ‌తులు వ‌స్తే విడిభాగాల‌ను
విదేశాల నుంచి కొనుగోలు చేయాల్సి వ‌స్తోంద‌ని... తొమ్మిదేళ్ల‌లో విదేశీ మార‌క ద్ర‌వ్యంలో
భారీగా తేడాలు వ‌చ్చాయ‌ని,
ఆ మేర‌కు అద‌న‌పు
నిధులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. ముఖ్య‌మంత్రి, కీల‌క మంత్రి ఆశీస్సుల‌తోనే కాంట్రాక్ట‌ర్లు
ఈ డిమాండ్ల‌ను తెర‌పైకి తెచ్చిన‌ట్లు స‌మాచారం.

నిబంధ‌న‌లు నీరుగారుస్తూ...

కాంట్రాక్ట‌ర్ల‌కు అద‌నంగా చెల్లించ‌డం ఈపీసీ విధానానికి పూర్తి విరుద్ధం.
అయినా వెలిగొండ కాంట్రాక్ట‌ర్ల‌కు అద‌న‌పు చెల్లింపులు చేయాల్సిందేన‌ని ముఖ్య‌మంత్రి, కీల‌క మంత్రి స్ప‌ష్టం చేశారు. ఆ మేర‌కు ప్ర‌తిపాద‌న‌లు
పంపాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. మొద‌టి ట‌న్నెల్ కాంట్రాక్టర్‌కు విదేశీ మార‌క‌ద్ర‌వ్యం
తేడాల్లో స‌ర్దుబాటు,
ధ‌ర‌ల స‌ర్దుబాటు
కింద మొత్తం రూ. 50.15 కోట్లు, రెండూ ట‌న్నెల్ కింద మొత్తం రూ. 18.29 కోట్లు చెల్లించాల‌ని కోరుతూ ప్రాజెక్టు సీఈ
ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపారు. అద‌న‌పు నిధులు చెల్లించేందుకు కేబినెట్
అంగీక‌రించింది. వెలిగొండ ట‌న్నెల్ కాంట్రాక్ట‌ర్ల‌కు చెల్లించిన త‌ర‌హాలోనే త‌మ‌కూ
అద‌న‌పు నిధులు ఇవ్వాలంటూ సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్ట‌ర్లు ప‌ట్టుబ‌డుతున్నారు.
లేక‌పోతే ప‌నులు ఆపేస్తామ‌ని అల్టిమేటం జారీ చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

 

Back to Top