రేపు రీయింబర్స్‌మెంట్‌పై వైఎస్సార్‌సిపి ధర్నా: ఆగష్టు 9, 2012

దివంగ‌త ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హ‌యాంలో పేద విద్యార్థులను ఉద్దేశించి.. ప్రవేశ‌పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ప‌థ‌కంపై స‌ర్కారు నీళ్లు చ‌ల్లేందుకు య‌త్నిస్తోంది. ఇక‌మీద‌ట ఈ ఫీజులు చెల్లంచలేమ‌ని కిర‌ణ్ స‌ర్కారు చేతులెత్తిసింది. గ‌త కొంత కాలంగా ప్రభుత్వం విద్యార్థుల‌పై చూపుతున్న విముఖ‌త‌ను నిర‌సిస్తూ.. వైఎస్సార్‌సిపి పోరాటం చేస్తూనే ఉంది.

ఇందులో భాగంగానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు కుషాయిగూడ రాధిక థియేట‌ర్ వ‌ద్ద వైఎస్‌ఆర్ సీపీ నేతలు ధర్నాను నిర్వహించ‌నున్నారు. రాష్ట్రంలో పేద‌విద్యార్థులకు ఈ ప‌థ‌కం ఆశాజ్యోతిగా నిలిచింది. ఇంజినీరింగ్‌, ఎంబిఎ, ఎంసిఎ వంటి వృతి విద్యా కోర్సులు చ‌దివే విద్యార్థులకు స‌ర్కారు తీరుతో పెద్ద షాక్ త‌గ‌ల‌నుంది. దాంతో మొత్తంగా ఫీజును విద్యార్థులే భ‌రించాల్సిందిగా స‌ర్కారు చెబుతూ వ‌స్తుంది. మైనారీటీలు, ఎస్సీ, ఎస్టీల మిన‌హా మిగిలిన బీసీ, ఈబీసీల‌కు వేటు ప‌డ‌నుంది.

Back to Top