పున‌రావాసం ప‌రిహాసం

క‌ష్టాల గూటిలో పోల‌వ‌రం నిర్వాసితులు 

అధికారుల ఇష్టానుసారం సాగిన నిర్మాణాలు

అస‌హ‌నం వ్య‌క్తం చేసిన హైకోర్టు

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా))

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్వాసితుల జీవితం అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. అర‌కొర
ఇల్లు నిర్మించి,
ఎటువంటి సౌక‌ర్యాలు
ఏర్పాటు చేయ‌క అధికార వ‌ర్గం వేధిస్తోంది. కృష్ణాకు నీటిని త‌ర‌లించుకుపోయే ప‌ట్టిసీమ
ప్రాజెక్టుపై వారికున్న మ‌మ‌కారం కొద్దిపాటైనా పోల‌వ‌రంపై ఉంటే త‌మ జీవితాలు
వేరేలా ఉండేవ‌ని పోల‌వ‌రం నిర్వాసితులు వాపోతున్నారు. 

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్వాసితుల‌కు పున‌రావాసంలో భాగంగా నిర్మించిన ఇళ్లు
అసంపూర్తిగా ఉండ‌టంపై  గతంలో హైకోర్టు అస‌హ‌నం
వ్య‌క్తం చేసింది. పోల‌వ‌రం మండ‌లంలోని చేగొండిప‌ల్టి గ్రామానికి చెందిన కొంద‌రు
నిర్వాసితులు పున‌రావాసం కింద నిర్మించిన ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయ‌ని, నివాస యోగ్యంగా లేవ‌ని, కోర్టును ఆశ్ర‌యించ‌డంతో హైకోర్టు ఈవిధంగా
వ్యాఖ్యానించింది. భూసేక‌ర‌ణ ప్ర‌త్యేక క‌లెక్ట‌ర్‌ను స్వ‌యంగా  హాజ‌రై వివ‌ర‌ణ
ఇవ్వాల‌ని ఆదేశించింది.

 

అర‌కొర నిర్మాణాల‌తో అవ‌స్థలు..

అసంపూర్ణ  సౌక‌ర్యాల‌తో, అసంపూర్తిగా ఇళ్లు క‌ట్టి ఇవ్వ‌డంతో చేగొండిప‌ల్లి, సింగ‌న్న‌ప‌ల్లి పున‌రావాస కేంద్రాల్లో
ఉంటున్న పోల‌వ‌రం ప్ర‌జెక్టు నిర్వాసితులు తీవ్ర ఇక్క‌ట్లు ఎదుర్కొంటున్నారు.
అధికారుల‌కు తోచిన‌ట్టుగా ఇళ్లు క‌ట్టారు. ఎవ‌రేంచెప్పినా ప‌ట్టించుకోకుండా
ఇష్టానుసారం నిర్మాణాలు చేపట్ట‌డంతో నిర్మ‌ణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు
అధికారుల‌కు తాము ఏంచెప్పినా ప్ర‌యోజ‌నం  లేద‌ని నిర్వాసితులు వాపోతున్నారు. చాలా
పున‌రావాస గృహాలు నివాస‌యోగ్యంగా లేవని నిర్వాసితులు త‌మ బాధల‌ను వ్య‌క్తం
చేస్తున్నారు. పున‌రావాస కేంద్రంలో ఇళ్ల నిర్మాణానికి ప్ర‌తి కుటుంబానికి ప్ర‌భుత్వం
రూ. 3.15 ల‌క్ష‌లు మంజూరు చేసింది. ఈ సొమ్ముతో
రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చేగొండిప‌ల్లి నిర్వాసితుల‌కు 189 ఇళ్లు, స‌మీపంలో మ‌రో 36 ఇళ్లు, సింగ‌న్న‌ప‌ల్లి నిర్వాసితుల‌కు 25 ఇళ్లు నిర్మించింది. కొంద‌రు ప్యాకేజీ
సొమ్ముతో మిగిలిన ఇళ్ల నిర్మాణ ప‌నులు పూర్తి చేసుకుంటుండ‌గా, మ‌రికొంద‌రు సొమ్ములేక ఇబ్బంది ప‌డుతున్నారు.ఇదేవిదంగా
 పేరంపేట రోడ్డులో 265ఇళ్లు, పైడిపాకలో 180ఇళ్లు, రామ‌య్య‌పేట‌లో 76 ఇళ్లు నిర్మించారు. అన్ని నివాసిత కేంద్రాల‌లోనూ
ఇదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని ప్ర‌జ‌లు వాపోతున్నారు.  

గొడుగు త‌ప్ప‌నిస‌రి... 

ఇంటికి ఆనుకొని నిర్మించిన మ‌రుగుదొడ్ల నిర్మాణం మ‌రీఘోరం. బాత్రూమ్ పైక‌ప్పుకు
సిమెంటు ప్లేట్లు వేసి వ‌దిలేసారు. ప్లేట్ల‌ మ‌ధ్య ఖాళీ ఉండ‌టంతో వర్షం ప‌డితే
బాత్రూముకు గొడుగుతీసుకెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని నిర్వాసిత ప్ర‌జ‌లు
వాపోతున్నారు. ఈ న‌ర‌కం నుంచి బ‌య‌ట‌ప‌డేయాల‌ని అధికారుల‌కు ఎన్నిసార్లు విజ్ఞ‌ప్తి
చేసినా ప్ర‌యోజ‌నం లేకుండా పోతోంద‌ని నిర్వాసిత ప్ర‌జ‌లు వాపోతున్నారు.

 

బాధితులకు జన నేత పైనే ఆశలు

ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఏజన్సీ పర్యటనకు వస్తుండటంతో బాధితులంతా గంపెడాశతో
ఉన్నారు. పునరావాసం ప్యాకేజీ మీద వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం మీద గట్టి
ఒత్తిడి తీసుకొని రావాలని డిమాండ్ చేస్తున్నారు. స్పష్టమైన అజెండాతో పోరాట బాట
పట్టేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నారు.

 

Back to Top