చంద్రబాబు పొలంలో ఎర్రచందనం దుంగలు..!

 ()
సీఎం   పొలంలో ఎర్ర‌చంద‌నం

()
అట‌వీ అధికారుల
దాడిలో వెల్ల‌డి

() బ‌య‌ట‌ప‌డుతున్న చంద్ర‌బాబు అక్ర‌మాలు

హైద‌రాబాద్‌: అవినీతి అంతుచూడ‌నిదే నిద్ర‌పోను.. నేను నిప్పు.. అని ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు
చేసే చంద్ర‌బాబు అక్ర‌మాలు ఒక్కొక్క‌టి బ‌య‌ట‌ప‌డుతున్నాయి. మొన్న ఇసుక కుంభ‌కోణం..నిన్న
రాజ‌ధాని భూ దురాక్ర‌మ‌ణ‌..నేడు ఆయ‌న సొంత పొలంలోనే ఎర్ర‌చంద‌నం దుంగ‌లు ల‌భ్యం.
అక్ర‌మాల‌కు ఆధ్యుడిగా ముఖ్య‌మంత్రి మార‌డం సిగ్గుచేటు. ఎర్ర‌చంద‌నంపై అనునిత్యం
పోరాటం చేస్తానని చెప్పుకొనే సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామంలోని పొలాల్లోనే అక్ర‌మంగా
దాచిన ఎర్ర‌చంద‌నం దుంగ‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. అయితే ఈ నెపం త‌న‌పైకి రాకుండా
ఉండేందుకు తానే స్వ‌యంగా ఈ విష‌యాన్ని అధికారుల ముందు బ‌య‌ట‌పెట్టి, అధికారుల వైఖ‌రీపై సీఎం మండిప‌డినట్లు
హడావుడి చేశారు. ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తే త‌న ప‌రిస్థితి ఏంట‌ని అధికారుల‌ను ప్ర‌శ్నించారు.

విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు ఇటీవ‌ల చిత్తూరు జిల్లాలోని చంద్ర‌బాబు సొంత
గ్రామంలోని పంట పోలాల్లో ఎర్ర‌చంద‌నం దుంగ‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. కొంత‌మంది స్మ‌గ్ల‌ర్లే
ఈ క‌ల‌ప దుంగ‌ల‌ను అక్ర‌మంగా పంట పొలాల్లో దాచి ఉంచిన‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మాచారాన్ని
అందుకున్న అట‌వీ శాఖ అధికారులు హుటాహుటిన వాటిని స్వాధీనం చేసుకొని వాటిని అక్క‌డి
నుంచి త‌ర‌లించారు. ఈ విష‌యం బ‌య‌ట‌కు రాకుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.  ప‌ల్లెలోని పంట పొలాల్లోనే ఎర్ర‌చంద‌నం దుంగ‌లు
బ‌య‌ట‌ప‌డ‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన చంద్రబాబు నెపాన్ని అటవీ అధికారుల మీదకు
నెట్టేందుకు ప్రయత్నించారు.  దీంతో
విషయాన్ని దాచి పెట్టేందుకు ప్రయత్నించిన అధికారులు తలల పట్టుకొన్నారు.

 

Back to Top