స్పీకర్ గా కోడెల చేసిన తప్పిదాలు


హైదరాబాద్)
శాసనసభలో స్పీకర్ స్థానానికి కోడెల శివప్రసాద్ రావు తలవంపులు తెస్తున్నారన్న రోజు
రోజుకీ బలపడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం సమయంలో ఆయన
ప్రవర్తన, మాట తీరు ఈ వాదనకు బలం కలగించేవిగా నిలిచాయి. దీంతో అవిశ్వాస తీర్మానం
తెచ్చేందుకు వైఎస్సార్సీపీ నిర్ణయించుకొంది.

       శాసనసభలో హుందాగా ప్రవర్తించాల్సిన స్థానం
స్పీకర్ ది. న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తి స్థానానికి ఉండేంతగా గౌరవం దక్కుతుంది.
అందుకే  గత తరం స్పీకర్ లకు ప్రజాస్వామ్య
వ్యవస్థలో అంతటి గౌరవం దక్కేది. కానీ శాసనసభలో కొంత కాలంగా మరీ ముఖ్యంగా అవిశ్వాసం
సమయంలో కోడెల శివప్రసాద్ రావు ప్రవర్తన ను చాలా మంది తప్పు పడుతున్నారు.

       చర్చ ప్రారంభం నుంచి ప్రతిపక్ష నేత వైఎస్
జగన్ ప్రసంగాన్ని స్పీకర్ అడ్డుకోవటాన్ని గుర్తు చేసుకొంటున్నారు. కొద్ది సేపు
ప్రసంగం జరుగుతుండగానే మైక్ కట్ చేయటం, వెంటనే అధికార పార్టీ సభ్యులకు ఇవ్వటాన్ని తప్పు
పడుతున్నారు. పైగా ప్రతిపక్ష నేతను అనరాని మాటలు అంటూ దూషిస్తున్నప్పటికీ అడ్డుకోక
పోవటం కూడా అనుమానాలు కలగిస్తోంది.

       ఇవన్నీ ఒక ఎత్తయితే అవిశ్వాస తీర్మానం వంటి
ముఖ్య విషయాన్ని కూడా మూజువాణీ ఓటుతో నడిపించేయటాన్ని చాలా మంది తప్పు
పడుతున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు డివిజన్ కు పట్టు పట్టినప్పటికీ
అవకాశం ఇవ్వక పోవటంపై స్పీకర్ స్థానం వివాదాస్పదం అయింది. ఇది ప్రభుత్వాన్ని, ముఖ్యంగా
ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడే చర్య అని అర్థం అవుతోంది. ఇంత నిస్సిగ్గుగా
స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు వ్యవహరించినందునే అవిశ్వాస తీర్మానం తెస్తున్నట్లు
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. 

Back to Top