చంద్రబాబుకి ఎందుకు కోపం వచ్చిందంటే..!

() పుష్కరాల పనుల్లో కోపం చూపించిన చంద్రబాబు

() ఇలాగైతే కుదరదు అంటూ
హడావుడి

() బాబు ఆవేశం మేరకు సీఎం
కార్యాలయం నుంచి ఉత్తర్వులు

() అసలు నాటకానికి తెర
దీస్తున్న ఉన్నతాధికారులు

విజయవాడ) ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు విజయవాడలో పుష్కరాల పనుల్ని పరిశీలించారు. పనులు ఆలస్యంగా
జరుగుతున్నాయని, జాప్యాన్ని తాను సహించనని మండిపడ్డారు. మీడియా కెమెరాల వైపు
తిరిగి కోపాన్ని మరింతగా ప్రదర్శించారు. తెల్లారేసరికి పచ్చ మీడియా పత్రికల్లో
పుష్కరాల పనులపై సీఎం ఆగ్రహం, వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశాలు, అధికారులపై
బాబు మండిపాటు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇక్కడే అసలు కథ మొదలు కాబోతోంది.

పుష్కరాలకు ముందే సన్నాహాలు

వాస్తవానికి పుష్కరాలు
అన్నవి ఇప్పటికిప్పుడు వచ్చిపడ్డవి కావు. ఆగస్టు నెల రెండో వారంలో పుష్కరాలు అన్న
సంగతి ఏడాది ముందే తెలుసు. అటువంటప్పుడు ఆరు నెలల ముందే బడ్జెట్ కేటాయింపులు
పూర్తవుతుంటాయి. సాధారణంగా ఇటువంటి బ్రహత్తర కార్యక్రమాలకు ఒక ఐఎఎస్ అధికారిని
స్పెషల్ ఆఫీసరు గా నియమించటం ఆనవాయితీ. ఆ అధికారి సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఇతర
అధికారులతో సమన్వయం చేసుకొంటూ పనులు చేయిస్తారు. కానీ చంద్రబాబు హయంలో అటువంటి
ఆనవాయితీలు పాటించరు. ఎందుకంటే పనులు సమన్వయంతో సాగటం ఆయనకు ఇష్టం ఉండదు. అంతా
చంద్రబాబు కనుసన్నల్లోనే జరగాలన్నది ఆయన ఫిలాసఫీ. అందుకే ప్రత్యేక అధికారిని
నియమించకుండా కాలం నెట్టుకొస్తున్నారు. పైగా బడ్జెట్ కేటాయింపులు చేసినా టెండర్లు
పిలవటం, పద్దతి ప్రకారం పనులు జరిపించటం చేయించలేదు.

పక్కా స్కెచ్ తోనే కోపం

పుష్కరాల పనుల్ని
పరిశీలించేందుకు చంద్రబాబు మందీ మార్బలంతో తరలి వెళ్లారు. మీడియాను కూడా
పెద్దఎత్తున తీసుకొని వెళ్లారు. అక్కడ పనులు నత్త నడకన నడుస్తుండటాన్ని చూసి
చంద్రబాబు కోపం తెచ్చిపెట్టేసుకొన్నారు. ఇలా అయితే సహించేది లేదని, కఠిన చర్యలు
తీసుకొంటానని తెగేసి చెప్పారు. మీడియా ప్రతినిధులకు స్పష్టంగా తెలిసేలా మరింత
గట్టిగా కోప్పడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉత్తర్వులు
వెలువడుతుండగానే అసలు డ్రామాకు తెర దీస్తారు. అందుకోసమే ఈ హడావుడి అన్నది అసలు
లోగుట్టు.

నామినేషన్ పద్దతిన
పంచుకొనేందుకే

ముఖ్యమంత్రి పనులు వేగంగా
జరిపించాలని ఆదేశాలు జారీ చేయగానే పచ్చ తమ్ముళ్లు గద్దల్లా వాలిపోతారు. పుష్కరాలకు
రెండు నెలల సమయం కూడా లేదు కాబట్టి వెంటనే పనుల్ని నామినేషన్ పద్దతిన
కేటాయించేస్తారు. అప్పుడు బహిరంగ టెండర్లు పిలవాల్సిన అవసరమే లేదు. టీడీపీ
నాయకులకు కోట్ల రూపాయిలు గుమ్మరించేస్తారు. అందిన కాడికి దోచుకొంటూ పనుల్ని తూతూ
మంత్రంగా చేయించేస్తారు. నామినేషన్ విధానంలో, అందునా టీడీపీ నేతల పనులు కాబట్టి
చెక్కులు చక చకా విడుదల అయిపోతాయి. నాణ్యత గురించి అడిగే దిక్కు ఉండదు. అప్పుడు
దోచుకొన్న వారికి దోచుకొన్నంతగా డబ్బు మిగులుతాయి.

          ఎందుకంటే సరిగ్గా గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు
కనుసన్నల్లో పనులు ఇలాగే జరిగాయి. అందుకే అంతా బాబే నడిపించినట్లుగా కలరింగ్
ఇచ్చేశారు. పచ్చ మీడియా కూడా కీర్తిస్తూ కథనాలు రచించింది. ఇప్పుడు క్రిష్ణా
పుష్కరాల్లో కూడా అలాగే జరగబోతోంది.

 

Back to Top