అస‌లైన నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్‌

పులివెందుల‌) ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ సొంత నియోజ‌క వ‌ర్గం పులివెందుల లో ప‌ర్య‌టిస్తున్నారు. గుర్తు పెట్టుకొని ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్న జ‌న నేత ను చూసి జ‌నం..  ఆయ‌న‌లో తండ్రి, దివంగ‌త మ‌హానేత  వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని చూసుకొంటున్నారు.

క్యాంపు కార్యాల‌యం వేదిక‌గా
రాష్ట్రమంతా ప్ర‌తిప‌క్ష నాయ‌కుని హోదాలో వైయ‌స్ జ‌గ‌న్ అనేక అంశాల‌పై ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాటం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో దీక్ష‌లు, ధ‌ర్నాలు, ఉద్య‌మాలు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో సొంత నియోజ‌క వ‌ర్గం పులివెందుల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా ద‌ర్శిస్తున్నారు. ఆ స‌మ‌యంలో ఒక పూట క్యాంపు కార్యాల‌యంలో గ‌డిపేట్లుగా ఆయ‌న కార్య‌క్ర‌మం షెడ్యూల్ చేసుకొంటున్నారు. ఈ సారి కూడా ప‌ర్య‌ట‌న‌లో బుధ‌వారం ఉద‌యం అంతా క్యాంపు కార్యాల‌యంలో గ‌డిపారు. దొంగ కేసులు, దొంగ చాటు ప్ర‌య‌త్నాలు చేస్తున్న తెలుగుదేశం ప్ర‌భుత్వం ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు. ఎన్ని బెదిరింపుల‌కు పాల్ప‌డినా భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు.

రైతుల‌కు అండ‌గా
సాయంత్రం వైయ‌స్ జ‌గ‌న్ తొండూరు మండ‌లం ఇన‌గ‌నూరు లో ప‌ర్య‌టించారు. అక్కడ వేరు శ‌న‌గ రైతుల్ని క‌లిసి స‌మ‌స్య‌ల్ని అడిగి తెలుసుకొన్నారు. మండ‌ల వ్య‌వ‌సాయ అధికారిని పిలిపించి మాట్లాడారు. రైతాంగ స‌మ‌స్య‌ల‌కు విత్త‌నా స‌మ‌స్యే మూలం అని నిర్ధారించుకొన్నారు. మ‌రో విడత విత్త‌నాలు తెప్పించ‌ట‌మే ప‌రిష్కారం అని వ్య‌వ‌సాయ సిబ్బంది, రైతులు తేల్చారు. దీంతో అక్క‌డిక‌క్క‌డే వైయ‌స్ జ‌గ‌న్ .. జిల్లా క‌లెక్ట‌ర్ కు ఫోన్ చేశారు. స‌మ‌స్య‌ను వివ‌రించి విత్త‌నాలు స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోరారు. దీనికి క‌లెక్ట‌ర్ అంగీక‌రించారు.

వెంట‌నే ప‌రిష్కారం దిశ‌గా..
పులివెందుల ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచేలా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు. స‌మ‌స్య ఉంద‌ని చెప్పిన‌ప్పుడు ప‌రిష్కారం దిశ‌గా అడుగులు వేస్తున్నారు. దీంతో నియోజ‌క వ‌ర్గ ప్ర‌జలు ఆయ‌న‌లో తండ్రి, దివంగ‌త మ‌హానేత వైయస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డినిచూసుకొంటున్నారు. స‌మ‌స్య‌ల‌పై వెంట‌నే స్పందించే విధానాన్ని గుర్తు చేసుకొంటున్నారు. 
Back to Top