పేరుకి ఫ్రీ.. పెత్తనం తెలుగు తమ్ముళ్లది..!

() ఇసుక ఆదాయం రుచి మరిగిన టీడీపీ నేతలు

() రక రకాల
పేర్లతో వసూళ్లకు పాల్పడుతున్న వైనం

() అధికార
యంత్రాంగం అండదండలతో చెలరేగుతున్న పచ్చ చొక్కాలు

హైదరాబాద్) ఇసుక ను ఉచితంగా ఇస్తున్నామంటూ గొప్పలు చెబుతున్న తెలుగుదేశం..
తెర చాటుగా తెలుగు తమ్ముళ్ల సాయంతో ఇసుక దోపిడీ  సాగిస్తోంది.  రక రకాల పేర్లు చెప్పి టీడీపీ నేతలు డబ్బులు
గుంజుతున్నారు

రుచి మరిగిన
నేతలు

ఇసుక దోపిడీ తో అడ్డగోలుగా సంపాదించవచ్చని చంద్రబాబు ప్రభుత్వం చాటి
చెప్పింది. ప్రతీ జిల్లాలోనూ ఇసుక రీచ్ లను టీడీపీ నేతలు ఆక్రమించుకొన్నారు. ప్రతీ
చోట వాటాలు పంచుకొంటూ కోట్ల రూపాయిలు కొల్లగొట్టేశారు. ఆర్థిక మంత్రి యనమల
రామక్రిష్ణుడు మాట్లాడుతూ రెండు వేల కోట్ల రూపాయిల మేర దోపిడీ జరిగిందని స్వయంగా అంగీకరించారు.
అనధికారికంగా ఏ మేర దోచుకొన్నారో అర్థం అవుతుంది. దోపిడీ చేసేదంతా టీడీపీ నేతలే
కావటంతో ప్రభుత్వం పేరు మట్టి కొట్టుకొని పోయింది. దీంతో తెలివిగా ఇసుక ఉచితం అంటూ
ప్రకటించి మార్కులు కొట్టేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

వసూళ్లు షురూ..!

అదే సమయంలో ఇసుక రీచ్ లను ఆక్రమించుకొన్న టీడీపీ నేతలు అక్కడ నుంచి కదలటం
లేదు. అప్ లోడింగ్ ఛార్జీలు అని, స్థానిక డెవలప్ మెంట్ పండ్ అని, రోడ్డు వేయించినందుకు
విరాళం అంటూ సొమ్ములు గుంజుతున్నారు. ఉదాహరణకు రాజధాని ప్రాంతానికి చేరువలో ఉన్న తాడేపల్లి రీచ్ లో స్థానిక టీడీపీ నాయకుడి హవా
నడుస్తోంది. ఇక్కడ రోడ్ నిర్మించామని అందుకోసం వసూలు చేస్తున్నామంటూ
గుంజుతున్నారు. 40, 50 లారీలు ఏర్పాటు చేసుకొని ఇసుకను సరఫరా చేస్తున్నారు. సగటున
రోజుకి 50, 60 వేల రూపాయిల చొప్పున సంపాదిస్తున్నట్లు సమాచారం. రాజధాని
ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు కావటంతో ప్రశ్నించేందుకు అధికారులు
భయపడుతున్నారు.

తెలిసిన
రహస్యాలు

టీడీపీ నేతల దందా గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకి స్పష్టంగా తెలుసు.
అందుకే తాను నీతిమంతుడిలా కలరింగ్ ఇచ్చేందుకు గాను ఇసుక ఫ్రీ చేశానని, డబ్బులు
అడిగితే ప్రశ్నించండని హంగామా చేస్తున్నారు. ఇసుక మాఫియాకు అధికార యంత్రాంగం
అండదండలు ఉండనే ఉన్నాయి. పొరపాటున ఏ అధికారి అయినా ఈ మాఫియా జోలికి వస్తే ఏం
జరుగుతుంది అనేది మహిళా తహశీల్దార్ వనజాక్షి ఎపిసోడ్ చెప్పకనే చెబుతోంది. దీంతో
స్థానికంగా దందా చేసేవాళ్ళు మాఫియా గానూ, తెర వెనుక నుంచి వ్యవహారాన్ని
నడిపిస్తున్న చంద్రబాబు నీతిమంతుడిగానూ చెప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Back to Top