ఎలుకలు, పాములకు అడ్డాగా మారిన గుంటూరు ప్రభుత్వాసుపత్రి..!

పసికందు మరణించినా మారని ప్రభుత్వ తీరు..!
పడకేసిన పాలన...పట్టించుకోని అదికారులు..!
ఎలుకల దాడులతో పేషెంట్ల ఆందోళన..!

గుంటూరుః ప్రభుత్వ అలసత్వం రోగుల ప్రాణాలమీదికి తెస్తోంది. గుంటూరు ప్రభుత్వాసుపత్రి ఎలుకలు, పాములకు అడ్డాగా మారింది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏం దాడి చేస్తాయో తెలియక పేషెంట్లు బిక్కుబిక్కమంటు గడపుతున్నారు. గత అనుభవాలు గుణపాఠం నేర్పినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. రోగుల మధ్యే ఎలుకలు,పాములు స్వైరవిహారం చేస్తున్నా చంద్రబాబు సర్కార్ మొద్దు నిద్ర వీడడం లేదు. 

మారని ప్రభుత్వ తీరు..!
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా  జీజీహెచ్ లో ఇటీవలే ఎలుకలు దాడి చేసిన ఘటనలో ఓ పసికందు మృతిచెందాడు. ఈవిషాద సంఘటన మరువకముందే నిన్నటికి నిన్న ఆస్పత్రిలోకి ఓపాము దూరడంతో రోగుల ప్రాణాలు గాల్లో కలిసినంత పనైంది. దీన్నుంచి  తేరుకునేలోపు మళ్లీ ఓమహిళపై ఎలుకలు దాడి చేయడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. ఇలా ఆస్పత్రిలో ఎలుకల విజృంభణ, పాములు కలకలం రేపుతుండడంతో  పేషెంట్లు బెంబేలెత్తుతున్నారు. ఇంత జరుగుతున్నాప్రభుత్వం చోద్యం చూడడంపై మండిపడుతున్నారు.  

వైద్యం సంగతేమోగానీ ముందు ఎలుకలు పట్టండి..!
ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన జెల్లీప్యాడ్ దగ్గర పాము కనిపించడంతో రోగులు వణికిపోయారు. ఈసంఘటన జరిగి 24 గంటలు గడవకముందే ఆర్థపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్న ఓమహిళపై ఎలుకలు దాడి చేశాయి. యేసమ్మ(40) అనే మహిళ చేతివేళ్లు తినేశాయి. దీంతో ఆమెను హుటాహుటిన అత్యవసర విభాగానికి తరలించారు. ప్రభుత్వాసుపత్రులపై ప్రభుత్వం ఏపాటి శ్రద్ధ వహిస్తుందో ప్రస్తుత సంఘటనలే చెబుతున్నాయి. మెరుగైన వైద్యం ఎలాగూ అందించరూ..కనీసం ఎలుకలు,పాములైన పట్టుకొండి మహా ప్రభో అని ప్రజలు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. 

తాజా వీడియోలు

Back to Top