రాష్ట్రం లో ఎమర్జెన్సీ రోజులుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది. అధికార పార్టీ నేతల కుంభకోణాలను కప్పిపుచ్చుకునేందుకే 144 సెక్షన్ విధించి మరీ నిజాలను భూస్థాపితం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న సున్నపురాయి దోపిడీ పై హైకోర్టు సైతం విస్మయాన్ని వ్యక్తం చేసింది. నిజా నిజాలను తేల్చి ప్రజల ముందు ఉంచాలని వైస్సార్ కాంగ్రెస్ చేసిన ప్రయత్నానికి చంద్రబాబు ప్రభుత్వం అడ్డు పడింది. అవినీతి పరులైన తన నేతలను కాపాడుకునేందుకు ప్రభుత్వం అడ్డదారులు తొక్కేందుకూ సిద్ధపడుతోంది. ప్రతిపక్ష నాయకుల్ని నిర్బంధించి మైనింగ్ ప్రాంతాల్లో నిషేధాలు విధించి నిజాలను దాచే ప్రయత్నం చేస్తోంది. 


అక్రమ వ్యాపారం అధికార పార్టీ వ్యవహారం....

అనుమతి లేనిచోట్ల భారీ యంత్రాలతో, పేలుళ్లతో ఖనిజాలు అక్రమంగా దోచేస్తున్నారు టీడీపీ నేతలు. జిల్లాల వారీగా ఖనిజాలు దోచుకుంటూ కేసులను మాత్రం తమ బినామీలు, పనిచేసే పేదలపై బనాయించి తప్పించుకుంటున్నారు. కోనంకి, నడికుడి, కేసానుపల్లిలో గ్రామాల్లో భారీగా అక్రమ మైనింగ్ వ్యాపారం సాగుతోంది. అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే యథేచ్ఛగా సాగుతున్న ఈ వ్యవహారం పై ప్రతిపక్ష వైస్సార్ కాంగ్రెస్ పోరాడుతూనే ఉంది. 4 సంవత్సరాల్లో  లక్షల టన్నుల సున్నపురాయి అక్రమంగా తవ్వుకు పోయారని అంటున్నారు. ఇందుకోసం ఉపయోగించే పేలుడు పదార్థాలు కూడా నిషేధితాలే. వీటిపై అధికారులు కాస్తైనా దృష్టి పెట్టలేదు. పెట్టి ఉంటే దాచేపల్లి పేలుళ్ల ఘటనలో అమాయక కూలీలు ప్రాణాలు పోయేవి కాదు. గుంటూరు లో 295 క్వారీల్లో సగానికి పైగా క్వారీల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని అధికారిక రికార్డులు చెబుతున్నాయి. బ్లాస్టింగ్ అనుమతుల విషయం లోనూ ఇదే నిర్లక్ష్యం కనబడుతోంది. మైనింగ్ లో పని చేసే కార్మికుల భద్రత కూడా గాలికే. నిబంధనల ప్రకారం వారికి ఇన్సూరెన్స్ చేయించాల్సి ఉన్నా, యజమానులు చేయించడం లేదు.

కూలీలపై కేసులు ....

అక్రమ మైనింగ్ వ్యవహారం లో ఎప్పుడూ సాధారణ కూలీలపై కేసులు పెట్టి అసలు నేరస్థులను తప్పిస్తున్నారు. హైకోర్టు ఆదేశించిన తర్వాత అధికారులు హడావిడిగా విచారణకు వచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావు కు సైతం వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది హైకోర్టు. మైనింగ్ పై లోకాయుక్త అధికారులు దర్యాప్తు చేశారు. అందులో టీడీపి ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావు పేరు ప్రస్తావించారు. కానీ మైనింగ్ అధికారులు మాత్రం ఆ పేరునే తమ విచారణలో వినిపించనీకుండా కూలీలపై కేసులు నమోదు చేశారు. సొంత ఇల్లు లేని, ఎకరం భూమి లేని నిరుపేదలైన కూలీలు కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని చెప్పటం చూసి సామాన్యులే నిర్ఖాంత పోతున్నారు. హైకోర్టుకు కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం అందులో బాధ్యుల నుండి రికవరీ గురించి చర్యలు ఏమీ తీసుకున్నట్టు చెప్పలేదు. నిజానికి ప్రభుత్వం అనామకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ట్రాక్టర్లు జప్తు చేసి చేతులు దులుపుకుంది. వారెలాగూ అధికార పార్టీ సభ్యులు, కార్యకర్తలుగా, నేతల బినామీలుగా ఉన్నవారే. వీరిని రేపు కేసుల నుండి బయట పడేస్తామని, పెద్ద ఎత్తున ఆర్ధిక సాయం చేస్తామని, కేసు ఖర్చులు భరిస్తామనే ఒప్పందాలపై అక్రమ మైనింగ్ కేసులు నెత్తిన వేసుకునేలా ఒప్పించినట్టు తెలుస్తోంది.

మునుపూ ఇదే జరిగింది....
గతం లో ఇలాగే కేసానుపల్లిలో ఓ వ్యక్తిమీద మైనింగ్ కేసులు పెట్టారు. ఆవ్యక్తి మరణించి ఎన్నో ఏళ్ళు అవుతోంది. ఆధారాలు చూపించినా సరే అధికారులు నోటీసులు తీసుకోకపోతే అరెస్టులు చేస్తామంటూ కుటుంబాన్ని బెదిరించారు. మైనింగ్ మాఫియాలను కాపాడేందుకు అమాయకులను బలి చేస్తున్నారు. మైనింగ్ ఇంకా విజిలెన్స్ అధికారులు కోట్ల రూపాయల అపరాధ రుసుములు చెల్లించమంటూ ఇచ్చిన నోటీసులు చూసి కొందరు నోరెళ్ల బెడుతున్నారు. ఎందుకంటే అక్రమ మైనింగ్ జరిగిందని నోటీసులు ఇచ్చిన ప్రదేశాల్లో ST కాలనీ ఉంది. ఆ సమీపం లొనే  MLA నిర్వహించే అక్రమ క్వారీ ఉంది. కానీ వారిని వదిలిపెట్టి అమాయకులపై దొంగ కేసులు బనాయిస్తున్నారు. ఈ కుట్రలన్నీ అధికార పార్టీ నేతలను కాపాడేందుకు జరుగుతున్నాయని బాధితులు వాపోతున్నారు.
Back to Top