రాజన్నా.. మ‌ళ్లీ పుట్ట‌వా

– రాజన్న మనల్ని విడిచి తొమ్మిదేళ్లు
– ఆయ‌న దూర‌మైనా పలకరిస్తున్న పథకాలు
– ఆరోగ్యశ్రీతో వెలుగులు నింపిన మహనీయుడు

తెల్లని పంచకట్టు.. నిత్యం చిరునవ్వుతూ ఆకట్టుకునే రూపం.. చూడగానే చేతులెట్టి దండం పెట్టాలనిపించే ఆహార్యం.. సమస్యల్లో ఉన్నామని తెలియగానే పరిగెత్తుకొచ్చి పలకరించే సాయం.. పరిచయం అక్కర్లేని ఈ పర్యాయ పదాలకు యజమాని, జనం నెత్తిన పెట్టుకుని దేవుడిలా పూజించే నాయకుడి రూపం ఎవరో కాదు.. వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి. ఆయన అభిమానులు ఆప్యాయంగా పిలుచుకునే పేరు రాజన్న. రైతుల్లో రైతుగా.. కుటుంబానికి పెద్దగా.. ఒక డాక్టర్‌గా.. ఆయన పోషించిన ప్రతి పాత్రకు యనే ఒక సింబల్‌గా నిలిచారు. వెంటిలేటర్‌ మీదున్న పార్టీని విజయపథంలో నyì పించి అధికారంలో కూర్చోబెట్టిన నాయకత్వం ఆయన సొంతం. భౌతికంగా ఆయన మన మధ్యన లేకున్నా ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టిన పథకాలు ప్రతి పేదవాడినీ ఆయనకు దగ్గర చేశాయి. అందరూ ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు. జూలై 8న ఆయన జయంతి సందర్భంగా రాజన్న స్మృతిలో... 
పేదవాడు గుండెల్లో పెట్టుకున్న నాయకుడు
వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా పనిచేసింది ఆరేళ్లే అయినా.. ప్రజల బాగోగులు తెలిసిన ఒక బాధ్యతగల నాయకుడిగా చేపట్టి అమలు చేసిన ప్రభుత్వ పథకాలు ఆయన్ను నిండు నూరేళ్లు గుర్తుంచుకునేలా చరిత్రలో నిలబెట్టాయి. అభివృద్ధి చేశానని మీడియాలో డబ్బులిచ్చి ఊదరగొట్టించుకనే చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి మళ్లీ గత మూడేళ్లుగా పనిచేస్తున్నా చేయని అభివృద్ధి కార్యక్రమాలను కేవలం ఆరేళ్లలో చేసి చూపించి దేశంలోనే గొప్ప సీఎంగా పేరు తెచ్చుకున్నారు. రాజన్న గురించి చెప్పకపోయినా ఆయన చేపట్టిన ప్రభుత్వ పథకాల పేరు చెబితే చాలు ఆయన గుర్తుకొస్తారు. సంకల్పం దృఢంగా ఉంటే వారధి కూడా దారిస్తుందని సామెత రాజన్న విషయంలో అక్షర సత్యమనిపిస్తుంది. తొమ్మిదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో జనం కరువుతో అల్లాడిపోయారు. వైయస్‌ఆర్‌ ఏమంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆనాటి నుంచీ ఏపీ చరిత్ర నుంచి కరువు పరారై పోయింది. 2014లో బాబు ముఖ్యమంత్రి అయ్యాక అదే కరువు ఏపీలో అడుగుపెట్టింది. దీంతో జనాలకు అర్థమైంది రాజన్న రాజ్యంలో తామెలా సుఖసంతోషాలతో బతికిందీ..
చరిత్రలో నిలిచిపోయే పథకాలు...
ముఖ్యమంత్రి అవుతూనే రుణమాఫీపై తొలి సంతకం అంటూ తొలి సంతకానికి ప్రాధాన్యం తెచ్చిన మహానేత వైయస్‌ఆర్‌. నిప్పుల కురిసే ఎండలో చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు 1600 కిమీలకు పైగా పర్యటించి జనం పడుతున్న ఇబ్బందులను పరిశీలించి తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏంచేయాలో అప్పుడే ఒక నిర్ణయానికొచ్చారు. గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌ను దృష్షిలో పెట్టుకుని రైతులు, కూలీలు, పేదల బతుకులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆయన పాలన సాగింది. రైతులు ఆరుగాలం కష్టపడి సంపాదించిన సొమ్మునంతా పిల్లల చదువులకు, అనారోగ్యాలకు గురై ఆస్పత్రులకు ఖర్చు చేసి అప్పుల పాలవడం వైయస్‌ఆర్‌ను బాగా కదిలించింది. రైతు సంతోషంగా ఉండాలంటే ముందుగా వారిని అప్పుల నుంచి బయట పడేయాలని నిర్ణయించుకుని ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ అమలయ్యేలా చూశారు. బాబు హయాంలో కరెంటు బిల్లలు కట్టలేదని అధికారులు మోటార్లు పీక్కుపోతుంటే.. వైయస్‌ ముఖ్యమంత్రయ్యాక సాగుకు ఉచిత విద్యుత్‌ను అమలు చేసి రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. తెల్లకార్డున్న ప్రతి ఒక్కరికీ ఇంజినీరింగ్‌ విద్య అభ్యసించే విధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమల్లోకి తెచ్చారు. అనారోగ్యంతో బాధ పడే వారికి ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందేలా రాజీవ్‌ ఆరోగ్య శ్రీని అమల్లోకి తీసుకొచ్చారు. రూ. 70 ఇచ్చే పింఛన్లు రూ. 200లకు పెంచారు. గ్రామంలో నలుగురైదుగురికి అందే పింఛన్లు వైయస్‌ఆర్‌ ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకం అందేలా చర్యలు తీసుకున్నారు. ఆరేళ్ల కాలంలో 47 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చారు. చనిపోయే నాటికి మరో 40 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో  ఉండిపోయాయి. అంటే 80లక్షల ఇళ్లు నిర్మిచడమంటే రికార్డు. దేశం మొత్తం కలుపుకున్నా కూడా అన్ని ఇళ్లు నిర్మించిన దాఖలాలు లేవు. అదంతా రాజన్నకే సాధ్యమైంది. 108 ద్వారా ఫోన్‌ చేసిన అతి కొద్ది సమయంలోనే క్షతగాత్రులకు సేవ చేసేందుకు అంబులెన్సు వ్యవస్థను తీసుకొచ్చి మారుమూల పల్లెలకు కూడా ఆరోగ్యాన్ని హక్కుగా మార్చారు. వైయస్‌ఆర్‌ ప్రమాణ స్వీకారానికి ముందు వరకు నె్రరెలు బారిన పొలాలు రాజన్న రాకతో ప్రాజెక్టుల రూపంలో నిలువెల్లా తడిసి పులకించిపోయాయి. ఎడారి నేలలు పచ్చని వనాలుగా మారి పంట చేలు సంతోషంతో పరవళ్లు తొక్కాయి. ఆయన మొత్తం 80 ప్రాజెక్టులు ప్రారంభిస్తే చనిపోయేనాటికి 47 ప్రాజెక్టులు సంపూర్ణంగా పూర్తయ్యాయి. మరో 40 ప్రాజెక్టులు దాదాపు యాభై శాతం పూర్తయ్యాయంటే మాటలు కాదు. వైయస్‌ఆర్‌ హయాంలోనే 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులకు మూడేళ్లకు పూర్తి చేసి చంద్రబాబు రిబ్బన్‌ కటింగ్‌లు చేసేసి జొబ్బలు చరుచుకుంటున్నాడు.

చంద్రబాబు గొప్పగా ప్రచారం చేసుకుంటన్న పోలవరం ప్రాజెక్టును వైయస్‌ఆర్‌ హయాంలోనే 50 శాతం పనులు పూర్తిచేశారు. అర్ధ శతాబ్దానికిపైగా ప్రారంభానికి నోచుకుని పోలవరం ప్రాజెక్టు వైయస్‌ఆర్‌ రాకతోనే కదలిక వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుమతులు సంపాదించి నిర్మాణం 50 శాతం పూర్తిచేస్తే.. చంద్రబాబు మాత్రం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టును రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ చేతుల్లో పెట్టేసి ప్రశ్నార్థకం చేశాడు. వైయస్‌ఆర్‌ అధికారంలోకి వచ్చాక లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చేందుకు రాజన్న చేసింది నిజంగా భగీరథ ప్రయత్నమే. ఎంతోమంది చిన్నారుల గుండెల్లో పడిన చిల్లులు పూడ్చి మరణశయ్య మీదున్న వారికి ఆక్సిజన్‌లా మారారు. అందుకేనేమో ఆయన తీసుకొచ్చిన పథకాలతో లబ్ధిపొందిన ప్రతి ఇంట్లో ఆయన ఫొటో ఉండి తీరుతుంది.  ఒక మనిషిని వందేళ్లు గుర్తుంచుకోవాలంటే.. అతను వంద సంవత్సరాలు బతకాల్సిన పనిలేదు.. ఆయన చేసిన పనులే జనాలు గుర్తుంచుకునేలా చేస్తాయని చెప్పడానికి రాజన్న చేసిన మేళ్లే(వైయస్‌ఆర్‌ మేళ్లే అంటారు) ఉదాహరణ.
Back to Top