రైతుల పాలిట రాక్షసుడు...!

భూములివ్వని రైతులపై కక్షసాధింపు..!
బాధితులకు అండగా వైఎస్ జగన్..!

గుంటూరుః వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. భూములివ్వని రైతులపై ప్రభుత్వం కక్షసాధింపు ధోరణికి పాల్పడడంపై మండిపడ్డారు. మల్కాపురంలో అగ్నికి ఆహుతైన గద్దె చంద్రశేఖర్  చెరకు పంటను వైఎస్ జగన్  సందర్శించి వారి కుటుంబానికి అండగా నిలిచారు. చంద్రబాబు మానవత్వాన్ని మరచి రాక్షసుడిగా మారి రైతులను ఇబ్బందుల పాలు జేస్తున్నాడని వైఎస్ జగన్ విమర్శించారు.  గత 10 నెలల కాలంలో 13 సార్లు ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. 

రైతుల జీవితాలతో ఆటలా..!
చంద్రబాబు దగ్గరుండి పురమాయించడం, మంత్రులు పంటపొలాలను నాశనం చేయడం జరుగుతుందని వైఎస్ జగన్ అన్నారు. స్టేషన్ కు వెళ్లి కేసులు పెడితే పట్టించుకోరని, ఇదెక్కడి న్యాయమని వైఎస్ జగన్ పోలీసులు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తగలబెట్టలేదు, తగలబడిందని చెప్పాలంటూ పోలీసులు మాట్లాడిన వైఖరిపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ సిగరేట్ ఏమైనా పడి పంట కాలిందా అని ఎద్దేవవా చేశారు. ఒకవేళ అలా కాలితే చెప్పాలని,  అప్పుడైనా కేసులు పెడతామన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రైతుల జీవితాలతో ఆడుకుంటే చూస్తూ ఊరుకోబోమని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

గీత దాటి ప్రవర్తిస్తున్నారు..!
చంద్రబాబు, మంత్రులు మానవత్వం  అన్న గీత దాటి ప్రవర్తిస్తున్నారని వైఎస్ జగన్ ఫైరయ్యారు. రైతుల ఇష్టం లేకుండా భూములు లాక్కుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. చంద్రబాబు ఆటలు ఎల్లకాలం సాగవని...మరో రెండు, మూడేళ్లలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని....వచ్చిన వెంటనే రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తామన్నారు.  బాధిత రైతులకు అండగా ఉంటామని జననేత వారిలో భరోసా కల్పించారు. న్యాయపోరాటం కోసం కోర్టుకెళ్తామన్నారు. 

రైతులకు అండగా..!
రాజధాని నిర్మాణం కోసం  భూములు ఇవ్వలేదనే కారణంతో మల్కాపురం గ్రామానికి చెందిన గద్దె చినచంద్రశేఖర్ అనే రైతుకు చెందిన 4 ఎకరాల 79 సెంట్లలోని చెరకు తోటను ...కొందరు దుండగులు గురువారం రాత్రి తగులబెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంతో రాజధాని నిర్మాణానికి భూములివ్వని అనేక మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలోనే పచ్చ చొక్కాల దురాగతాలకు బలై పోతున్న రైతు కుటుంబాలకు వైఎస్ జగన్ అండగా నిలుస్తూ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. 
Back to Top