రాచనగరిగా అమరావతి తగదా??

నదీతీరాల్లో మహానగరాల నిర్మాణం ఎంత పెను ముప్పుకు దారి తీస్తుందో పాలకులు కనీసం ఆలోచించడంలేదు. తామేదో చక్రవర్తులం అన్న భ్రమలో కోట పైనుంచి చూస్తే కింద మహానదులు, జలపాతాలు, మహోన్నత సౌధాలు కనబడాలని ఆశిస్తున్నారు. రాజమౌళి చిత్రాల్లో గ్రాఫిక్ లను తలపోసేలా నగరాల నిర్మాణం ఉండాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇది ప్రజలకు ఏమాత్రం మంచిది కాదని పర్యావరణ నిపుణులే  కాదు, ప్రభుత్వ అధికారులు కూడా చెబుతున్నారు. అయినా సరే చంద్రబాబు లాంటి కీర్తి కండూతి నాయకులకు అవి చెవికెక్కవు. ఆకాశహర్మ్యాలక ఆలోచనలే తప్ప నేల మీద చూపు నిలవదు. 
నదీ తీరాలు అంటే రివర్ బే ప్రాంతంలో భారీ కట్టడాలు, నగరాల నిర్మాణం సరైన ప్రణాళిక కాదని నిపుణులే కాదు గత చరిత్రలు కూడా చెబుతున్నాయి. ఎక్కడో ఎందుకు మన పొరుగునే ఉన్న తమిళ నాడు రాష్ట్రంలోనే చూస్తే చెన్నై ఇలాంటి పరిస్థితికి అద్దం పడుతూ కనబడుతుంది. గత కొన్నేళ్లు చెన్నై వరద ముంపుకు గురౌతోంది. ఆ విపత్తుల్లో ప్రాణనష్టం, ఆస్తినష్టం అపారంగా జరుగుతోంది. దీనికంతటికీ కారణం భారీ నిర్లక్ష్యం. విచ్చలవిడిగా పెరిగిపోయిన నగరం, కాంక్రీట్ జంగిల్ గా మారిపోవడం, తీర ప్రాంతమంతా నివాసాలు పెరిగిపోవడం, వర్షపు నీరు పోయేదారి లేకపోవడం ఈ కారణాలన్నీ చెన్నై దుస్థితికి కారణం అయ్యాయి. అక్రమ కట్టడాలదే ఇందులో సింహభాగం బాధ్యత వహిస్తాయి. కాంక్రీట్ కీకారణ్యంలో వర్షపు నీరు పోయే దారి ఉండదు. దానికి వరద తోడైతే మహానగరం కాస్తా ముంపు నగరం అయిపోతుంది. ప్రణాళిక లేకుండా ఇష్టం వచ్చినట్టు నగర నిర్మాణాన్ని చేసుకుంటూ పోవడమే దీనికి కారణం అని వేరే చెప్పక్కర్లేదు. వేలాది హెక్టార్ల పంటభూములు పోయి, చిత్తడి నేలలు తుడిచిపెట్టుకుపోయి, చెరువులు, కుంటలు కబ్జా అయ్యి మహానగరం జనావాసంగా కాక జలావాసంగా మారుతోంది. ఒక్క చెన్నై మాత్రమే కాదు, చాలా నగరాల దుస్థితి ఇలాగే ఉంది. ఆడంబరంగా, మెట్రో మహా సిటీలుగా పేరుమోసిన నగరాలన్నీ పైన పటారం, లోన లొటారం చందంగా ఉంటున్నాయి. 
ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలోనూ ఇలాంటి చర్చే నడుస్తోంది. నదీ తీరంలో కట్టడాలు, భారీ నిర్మాణాలు, రాజధాని నిర్మించుకోవడం వంటివి తగదని గ్రీన్ ట్రిబ్యులన్ మొత్తుకుంటోంది. అయినా సరే ఈ విషయం చంద్రబాబుకు పట్టదు. ప్రకృతి విలయాలకు కారణమయ్యే ఇలాంటి పోకడలనే ప్రశ్నిస్తున్నారు కొందరు రిటైర్డ్ ప్రభుత్వ అధికారులు. ప్రభుత్వ కార్యదర్శులుగా పనిచేసిన రిటైర్ అయిన ఇద్దరు సీనియర్ అధికారులు అమరావతి గురించి రాజధాని పేర ముఖ్యమంత్రి చేస్తున్న రియలెస్టేట్ దందా గురించి బహిరంగంగా చెబుతున్నారు. ఆ వివరాలను పుస్తకాలుగా ముద్రించి పంచుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సైతం కృష్ణా నదీ తీరాన మహానగర నిర్మాణం మంచిది కాదని వారు వారించారు. అయినా చంద్రబాబు తా పట్టిన కుందేలు పద్ధతినే అనుసరించడం దురదృష్టకరం. స్వయంగా ఆయనే కరకట్టమీద ఇల్లు కట్టుకుని, నిబంధనలను తుంగలో తొక్కుతూ, రేపు ప్రజల భవిష్యత్తును కూడా అభద్రతలోకి నెడుతున్నాడు. నేటి చెన్నై లాగే రేపటి అమరావతి మారితే పరిస్థితి ఏమిటి అనేది అంతుపట్టకుండా ఉంది. ఇప్పటికే రాజధానికోసం సేకరించిన పచ్చని భూములను, అటవీ ప్రాంతాన్నీ పప్పుబెల్లాల్లా కార్పొరేట్లకు పంచిపెడుతున్నాడు చంద్రబాబు. ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం సైతం నదీతీరంలో అమరావతి నిర్మాణం గురించి ఆరాతీసింది.
అమరావతి పాలనా నగరం కాదని, కేవలం రియలెస్టేట్ దందాగా చూస్తున్నారని ప్రతిపక్ష పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎన్నో సార్లు హెచ్చరించారు. వరద, ముంపు సమస్యలు లేని ప్రాంతాల్లో రాజధానిని నిర్మించాలని, పరిపాలన వికేంద్రీకరించాలని, అప్పుడే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధ్యం అవుతుందని తెలియజేసారు. కానీ చంద్రబాబు  
 
Back to Top