ప్రశ్నిస్తే చావకొడతాం...

ముస్లింలపై టీడీపీ ప్రభుత్వం దాష్టీకం..అమ‌రావ‌తి: ముస్లింలకు అండగా ఉండాల్సిన టీడీపీ ప్రభుత్వం వారిని భయభ్రాంతులకు గురి చేస్తోంది.మైనార్టీల ప్రయోజనాలు కాపాడవలసిన చంద్రబాబు ప్రభుత్వం ముస్లింలపై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది.న్యాయాన్ని ప్రశ్నిస్తే గొంతునొక్కే ప్రయత్నాలు చేస్తోంది.  ముస్లింలు సమస్యలు పరిష్కారిస్తామంటూ సభలు పెట్టి జైలుకు పంపించడం ఇదెక్కడి న్యాయమో చంద్రబాబే చెప్పాలి. ఇంతకు చంద్రబాబుకు ప్రేమ ముస్లింపైనా..లేక వారి ఓట్లపైనా అనే అనుమానం కలుగుతుంది. గుంటూరు నారా హమారా..టీడీపీ హమారా సభలో టీడీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన 8 మంది ముస్లిం యువకులను, వారిని పరామర్శించడానికి వెళ్ళిన వ్యక్తిని అరెస్ట్‌ చేసి బట్టలూడదీసి దాష్టీకానికి దిగడం దారుణమని ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్లింలకు వరాల జల్లులు కురిపిస్తాం అంటూ వారిని పిలిచి ఓట్లు కోసం  మాయాలో పడేయడానికి ప్రగల్భాలు పలికారు. అంత చేస్తాం..ఇంత చేస్తాం అన్నారు..కొంతమంది ముస్లిం యువకులు మైనార్టీలు కోసం ఏం చే శావంటూ ప్రశ్నించే సరికి తనలో ఉన్న నరకాసురుడు బయటకు వచ్చాడు  హమీలు నెరవేర్చమని అడిగిన పాపానికి  నేరస్తులంటూ ముద్రవేశారు.  30 గంటలకు పైగా నిర్భందించి అరెస్ట్‌లు చూపారు. శాంతియుతంగా ప్లకార్డులు చేతబూని  ప్రశ్నించినవారిపై జులుం ప్రదర్శించారు. దీనిపై ముస్లిం సోదరులు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామంటున్నారు. న్యాయం అడిగితే లాఠీలు దెబ్బలా అంటూ చంద్రబాబు వైఖరీని ప్రశ్నిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ముస్లింలకు భద్రతలేదని, ముస్లింలను  టీడీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ముస్లిం అభివృద్ధికి బడ్జెట్‌లో ప్రవేశపడుతున్న వందల కోట్లు ఎక్కడికి పోతున్నాయంటూ మైనార్టీ నాయకులు ప్రశిస్తున్నారు.  
Back to Top