పండగైనా, పస్తులున్నా అన్నీ పాదయాత్రలోనే


ప్రజా సంకల్ప యాత్ర మొదలై నాటి నుంచి రూపాయి రూపాయి పోగేసారు ఇద్దరు మహిళా కూలీలు.  యువనేత తమ ఊరికి ఎప్పడు వస్తాడా అని ఎదురు చూసారు. వారి ఎదురు చూపు ఫలించింది.  పాదయాత్రలో భాగంగా తమ ఊరికి వచ్చిన వైయస్ జగన్ ను కలిసి తాము  కూడబెట్టిన  500 రూ.లను ప్రజా సంకల్ప యాత్రకు విరాళంగా ఇచ్చారా చెల్లెమ్మలు. అది వారి ప్రేమకు నిదర్శనం. ప్రజా సంకల్ప పాదయాత్రలో కళ్లు చెమర్చే ఇలాంటి ఘటనలు ఎన్నో ఎన్నెన్నో. 

యువనేతపై కురిసిన అనంతమైన ప్రేమ

అనంతపురంలో ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా పూర్తయింది. అనంత ప్రజలు వైయస్ తనయుడికి బ్రహ్మరథం పట్టారు. 9 నియోజక వర్గాలు 176 గ్రామాల మీదుగా అనంతలో ప్రజా సంకల్పం సాగింది. 8 బహిరంగ సభలు, 4 సదస్సులు జరిగితే అవన్నీ అశేష జనవాహినులను తలపించాయి. అనంతపురం జిల్లా పరిధిని దాటుతున్నప్పుడు ఊళ్లకు ఊళ్లే కదలి వచ్చాయి.  సీమ కన్నీళ్లకు అనంత ఓ ఉదాహరణగా నిలిచింది. ఎల్లో కమిటీల కారణంగా గ్రామాల్లో జరుగుతున్న కిరికిరిల గురించి అడుగడుగునా ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జన్మభూమి కమిటీల అనుమతిలేనిదే ఏ పనీ జరగడం లేదని, అధికారులు కూడా వారి మాటకు ఎదురు చెప్పడం లేదని అన్నారు అనంతపురం ప్రజలు. వైయస్ ఆర్ కాంగ్రెస్ సానుభూతి పరులని తెలిస్తే చాలు వారిని రకరకాల బాధలకు గురిచేస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారని తెలిస్తే ఉపాధి పనులకు పిలవడం లేదని, పథకాలు అందనివ్వడం లేదని, ఫించన్లను కూడా రానీయడం లేదంటూ వాపోతున్నారు. వీటన్నిటికీ సమాధానం వచ్చే ఎన్నికల్లో గెలిచాక చెబుదామంటూ వారిని ఓదార్చారు వైయస్ జగన్. 

చంద్రబాబులా మోసం కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా నన్న ప్రతిపక్ష నేత

అనంతలోని కదిరిలో భారీ బహిరంగ సభలో రైతులతో ఎన్నో అంశాలను చర్చించారు వైయస్ జగన్. అదే రోజు జాతీయ రైతు దినోత్సవం కావడం విశేషం. వ్యవసాయాన్ని పండుగలా చేయాల్సిన రైతన్నలు, కాడె వదిలి వలస బాట పడుతున్నారని, రుణాలు మాఫీ కాక ప్రాణాలు తీసుకుంటున్నారని, ఇదంతా చంద్రబాబు పాపం కాదా? అని ప్రశ్నించారు. వైద్య ఖర్చులు 1000దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తామని ప్రకటించారు. ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తెస్తామని, ఎక్కడైనా వైద్యం చేయించుకునే అవవాశం కల్పిస్తామన్నారు. ప్రజలకు మంచి చేసేందుకు నాన్న వేసిన ఒక్క అడుగుకు తాను మరో రెండడుగులు ముందుకేస్తానని అన్నారు వైయస్ జగన్. ప్రతి కుటుంబం లోనూ ఒక డాక్టరో, ఇంజనీరో, ఉన్నత విద్యా వంతుడో ఉండాలని వైఎస్ కలలు కన్నారని, అందుకే ఫీజు రీయంబర్సు మెంటు ప్రవేశ పెట్టారన్నారు ప్రతిపక్షనేత. చంద్రబాబు దానికి తూట్లు పొడిచాడన్నారు. చదువు ఒక విప్లవం అవుతుందని, ప్రతి పేదింటి విద్యార్థి ఉన్నత చదువులు చదువుకునేలా చేస్తానని మాటిచ్చారు. పిల్లలను బడులకు పంపండి, వారి చదువులకయ్యే ఖర్చు అంతా నేనిస్తాను అని అక్కచెల్లెళ్లకు భరోసా ఇచ్చారు యువనేత. చంద్రబాబులా కాదని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ విలువలతో రాజకీయాలు చేస్తామని మీడియా మిత్రులతో జరిపిన ముఖాముఖీలో చెప్పారు. నిజాలు చెప్పాల్సిన బాధ్యతాయుతమైన మీడియా అధికార టిడిపి చేతిలో కీలుబొమ్మ అవుతోందని దుయ్యబట్టారు. 

పండుగలు వేడుకలూ అన్నీ పాదయాత్రలోనే

అనంత జిల్లా కదిరి నియోజక వర్గంలోనే యువనేత అడుగులు 600కి.మీల మైలు రాయిని చేరుకున్నాయి. ఈ సంరద్భంగా ఆ ప్రాంత వాసులు తమ ప్రియతమ నాయకుడికి పూలబాటతో స్వాగతం పలికారు. ప్రజా సంకల్పానికి వివిధ వర్గాల ప్రజలు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. 25న క్రిస్మస్ వేడుకలను కూడా జననేత ప్రజాసంకల్పంలోనే చేసుకున్నారు. పాదయాత్రకు విరామం ఇచ్చినప్పటికీ ఆయన ఇంటికి వెళ్లలేదు. కుటుంబ సభ్యులంతా వైయస్ జగన్ బస చేసిన ప్రాంతానికే చేరుకున్నారు. తల్లి విజయమ్మ, సతీమణి భారతి, కుమార్తెలు హర్ష, వర్షలతో కలిసి శిబిరంలోనే కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు జరిపారు వైయస్ జగన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45ఏళ్లకే పింఛన్ విషయంలో కొందరు విమర్శలు చేస్తున్నారనీ, కాసీ ఎస్సీ,ఎస్టీ,బిసి వర్గాలకు చెందిన పేదలు పని చేయందే పూట గడవని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. పాదయాత్రకు కొద్ది రోజుల ముందు ధర్మవరంలో చేనేతల నిరాహార దీక్షలు చేస్తున్నప్పుడు వారి కష్టాలేమిటో తెలిసాయని, అందుకే 45 ఏళ్లకే ఫించను ప్రవేశ పెట్టామని అన్నారు. దానికి వైయస్ ఆర్  చేయూత ఫింఛన్ అనే పేరు పెట్టామన్నారు. వృద్ధాప్య ఫించన్లు కూడా 60 ఏళ్లు నిండగానే ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగ విరమన వయసును 60  చేసినప్పుడు వృద్ధా ప్య ఫించనును 65 ఏళ్లకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. 

చిత్తూరు లోఆరంభమైన ప్రజా సంకల్పం

డిసెంబర్ 28న చిత్తూరు జిల్లాలో అడుగుపెట్టింది ప్రజా సంకల్ప యాత్ర. పాదయాత్ర 46వ రోజు చిత్తూరు జిల్లా తంబళ్ల పల్లెలో ఆరంభమైంది. మొత్తం 260కి.మీ మేర చిత్తూరు జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర సాగనుంది. 150 గ్రామాల మీదుగా 20 రోజుల పాటు సాగే ప్రజా సంకల్పంలో ప్రజలు పడే ఇబ్బందులను తెలుసుకుని, వారికి భరోసా ఇచ్చేందుకు సాగుతున్నారు జననేత. సిఎమ్ చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో అభివృద్ధి ఆమడ దూరంలో ఉంది. హంద్రీనీవా, గాలేరునగరి వంటి పెద్ద ప్రాజెక్టులు ఇంత వరకూ పూర్తి  కాలేదు. చిత్తూరు జిల్లాకు వరాల జల్లు కురిపించిన చంద్రబాబు తిరిగి ఆ జిల్లా ముఖమైనా చూడదలేదు. బాము చిత్తూరు వాసులను ఏమార్చిన తీరును అడుగడుగునా ఎండగడతానన్నారు వైయస్ జగన్. 

తాజా వీడియోలు

Back to Top