ప్రజా సంకల్పం మహాసంకల్పం

అతడొచ్చే దారులన్నీ పూల దారులు మాత్రమే కాదు, లక్షలాది మంది అభిమానుల గుండె రాదారులు కూడా. ప్రియమైన నేత, అభిమానించే ఆత్మీయుడు, అన్నీ చెప్పుకుని ఓదార్పు పొందగలిగే స్వాంతన, నమ్మకాన్ని నిలిపే నాయకుడు...ఇవన్నీ ఒక్కరే అయినప్పుడు ఆ అడుగుల కోసం గుండె గుడి కట్టని మనిషెవరుంటారు. వైఎస్ జగన్ ఈ పేరు ఓ బ్రాండ్. చిరునవ్వుకు...చెలిమికి...అభిమానానికి...ఆత్మీయమైన నమ్మకానికీ ప్రజలెన్నుకున్న బ్రాండ్. ఆ అభిమానం జనం గుండెల్లో ఎలా పుట్టింది? పదేళ్లకంటే ముందు ఓ మహనీయుడు చేసిన మంచి వల్లే ఆయన కొడుకుని ఇంతగా ప్రేమిస్తారా? తండ్రి మేలు చేసాడనే ఒక్క కారణంతో కొడుకు మీద అంతులేని అభిమానం కురిపిస్తారా? కాదు...అది ఒక్క కారణం మాత్రమే. జగన్ జన ప్రేమను తానకుతానే గెలుచుకున్నాడు. ప్రజల గుండెలోతులను తరచి చూసాడు. తన వ్యక్తిత్వంతో, తన ప్రవర్తనతో, తన వైఖరితో, తన నిర్ణయాలతో, తన ఆచరణతో ప్రజాభిమానాన్ని తనవంతుగా సంపాదించుకున్నాడు. 

ప్రజా సంకల్పంలో ప్రజా నేత

అవ్వా తాతల కష్టాన్ని చూసి చలించి పోయాడు. బిడ్డలకు భారమై, వృద్ధాప్యం శాపమైన వారికి చేయూత ఇవ్వాలనుకున్నాడు. అక్క చెల్లెమ్మల గుండె కోతను అర్థం చేసుకున్నాడు. పిల్లల భవిష్యత్తుకు భరోసా నేనంటూ వాగ్దానం చేసాడు. ఆధారం లేనివారు, అండలేని వారు, గూడు లేనివారు, కూడు లేని వారు ఒక్కరేమిటి వ్యధ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ ఒక్కడినే ఆశ్రయిస్తున్నారు. కష్టం కలిగిన ప్రతి ఒక్కరూ అతడికే చెప్పుకుంటున్నారు. ప్రజా సంకల్ప యాత్ర ఒకవిధంగా కన్నీళ్ల సుడిగుండంలో చిక్కుకుపోయిన లక్షలాది జీవితాలను ఒడ్డుకు చేర్చే ఓ చుక్కాని. బ్రతుకు ఆశను బతికించే దిక్సూచి. 

ఎంత ఎదిగినా

కష్టం తెలియక్కర్లేని సంపన్న కుటుంబం, ఎన్నుకున్న రంగంలో విజయపథం, ఓ గొప్ప రాజకీయ వారసత్వంం ఇవి చాలవా చాలామందిలా ఆకాశంలో నిలబడటానికి. ఇవి చాలవా నేలను తాకనైనా తాకకుండా బతికేయడానికి. కానీ అతను ఆ చుక్కల దారి నెంచుకోలేదు. నేలపై ముళ్లబాటలో ముందుకు సాగాడు. తన కష్టం కంటే తనను, తన కుటుంబాన్నీ నమ్ముకున్న వారి కష్టమే పెద్దదని భావించాడు. తండ్రి ఇచ్చిన బాధ్యత ఇంత పెద్ద కుటుబం అనుకున్నాడు. వారి బాగు కోసం, వారి భవిష్యత్ కోసం వజ్రసంకల్పం చేపట్టాడు. పెద్దాయనకు చేతికర్రలా నిలబడ్డప్పుడు, ఓ చెల్లెమ్మకు జారిపోయిన కాలి జోడు తీసి అందించినప్పుడు, ఆకలిదప్పులతో ఎదురుచూసే తమ్ముడికి ఆసరా అయినప్పుడు, గుడిసెలో మంచపట్టిన మనిషికి చిరుఆశను స్వయంగా వెళ్లి తీర్చినప్పుడు, ఆత్మీయంగా ప్రతి ఒక్కరినీ కౌగిలిస్తున్నప్పుడు, అందరివాడై మనిషి మనిషినీ పలకరిస్తున్నప్పుడుం అతడు ఎంత ఎదిగినా ఒదిగే మహావృక్షాన్ని గుర్తుకు తెస్తాడు. 

విజయపథం

ఇడుపులపాయలో వైఎస్సార్ స్మృతివనం దగ్గర ప్రజా సంకల్పయాత్ర ఆరంభం అయ్యింది. ఆ తొలి అడుగే కోట్ల గొంతుల రణధ్వని అయ్యింది. అధికారం, అణిచివేతలపై తిరుగుబాటు బావుటా అయ్యింది. నిజం గొంతు నులిమే సంకేళ్లను తెంపే పిడికిలయ్యింది. ప్రజాసంకల్పంంప్రజల కోసం ఓ ప్రజానాయకుడు సంకల్పించిన ఆశయం. దుర్మార్గాలపై ప్రజాపోరాట ఆయుద్ధం. పాలకుల అక్రమాలను, అవినీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని ఎండగడుతూ, కన్నీరౌతున్న ప్రజలకు నేనున్నాననే ధైర్యాన్నిస్తూ, భవిష్యత్ ఆశలకు ఊపిరి పోస్తోంది ప్రజాసంకల్పపాదయాత్ర. అనుమానం లేదు ఎవరికీ.  నేటి జననేత... రేపటి ప్రగతిపథ విజేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.  


 
Back to Top