మహానేత అడుగుజాడల వెంట

 మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి
ప్రజాప్రస్థాన పాదయాత్రకు నేటితో 15 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ దశాబద్దన్నర కాలంలో ఆయన అడుగు జాడలను స్మృతి పథాలుగా తలుచుకునే గుండెలు ఎన్నో
లెక్కేలేదు. ఆ పాదం రామపాదమై, రామరాజ్యాన్ని
స్థాపించడాన్ని తెలుగు వారు మరిచిపోలేరు. సంక్షేమ యుగాన్ని,
పాలనకు ఓ కొలమానాన్ని అందించిన అరుదైన కాలం వైఎస్సార్ ది. ఆయన సంకల్పం ధృఢం. ఆయన ప్రస్థానం అద్వితీయం.

 చంద్రబాబు చెరలో ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2003 సంవత్సరంలో
కరుకాటకాలతో అల్లాడుతోంది. చంద్రబాబు అరాచక పానల వల్ల ప్రజలు
విద్యుత్ ఛార్జీలు, బస్సు ఛార్జీలు, పన్నుల
భారంతో కుంగిపోతున్నారు. రైతుల పరిస్థితి అత్యంత దయనీయం.
ప్రాజెక్టులు లేవు, పంటలు లేవు. ప్రపంచ బ్యాంకు పాదాల వద్ద రాష్ట్ర సంపదను తాకట్టు పెట్టేశాడు చంద్రబాబు.
వేల కోట్ల అప్పులు తెచ్చి, ప్రజల నెత్తిన గుదిబండలు
వేసాడు. అమెరికా ప్రధానులను తెచ్చి, విందులిచ్చి,
ఐటి తప్ప మరోటి లేదన్నట్టుగా వ్యవహరించాడు. రోమ్
నగరం కాలుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తిలా చంద్రబాబు రాష్ట్రాన్ని రావణ కాష్టం
చేసిన తరుణంలో నాటి ప్రతిపక్ష నేత వైఎస్సార్ ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు పాదయాత్ర
దారిపట్టారు. ప్రభుత్వం ప్రజలను విస్మరిస్తే, పాలకుడు వంచకుడు అయితే, రాష్ట్రం నిర్లక్ష్యానికి గురైతే
ఎలా ఉండాలో అలాగే ఉంది అప్పటి ఆంధ్రరాష్ట్రం. ఆ చీకటి పాలనే వైఎస్సార్
ప్రజాప్రస్థానానికి మూలమైంది.

అన్నపూర్ణ రాష్ట్రంలో అన్నదాతల
చావులు

 దక్షిణ భారతదేశపు ధాన్యాగారం
అనిపిలవబడ్డ నేలపై అన్నదాతల ఆత్మఘోష పట్టించుకునే దిక్కు లేకపోయింది. వరస కరువులతో
రైతన్నలు అల్లాడుతుంటే వ్యవసాయం దండగ అన్నాడు చంద్రబాబు. బోర్లు
వేసుకుని పండించటానికైనా కరెంటు లేక ఉచిత విద్యుత్ ఇమ్మంటే, విద్యుత్
తీగలపై బట్టలారేసుకుంటారని ఛీదరించుకున్నాడు. రైతులను హీనంగా
చూసాడు. క్రూరంగా హింసించాడు. బిల్లులు
కట్టలేక, కరెంటు షాకులకు గురై ప్రాణాలు పోగొట్టుకున్న రైతులకు
లెక్కే లేదు. కనీసం వారి కుటుంబాలకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు
చంద్రబాబు.

 చలించిన నాటి  ప్రతిపక్ష నేత

రైతుల ఆత్మహత్యల గురించి
విని చలించిపోయారు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్. ప్రజల సమస్యలను దగ్గరుండి
తెలుసుకోవాలని, వారి కష్టాన్ని తీర్చేందుకు తోడుగా ఒకరున్నారనే
నమ్మకాన్ని కలిగించాలని ప్రజాప్రస్థానం పాదయాత్రను ఆరంభించారు. 2003 ఏప్రిల్ 9న ఆరంభమైంది ఈ సాహసోపేతమైన పాదయాత్ర.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఆరంభించి జూన్ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ సాగింది ప్రజాప్రస్థానం. నడి వేసవి సమయం 40 డిగ్రీలకు పైబడి ఎండలు. ఆయన వయసు అప్పటికే ఐదు పదులు దాటింది. పాదయాత్రలో మధ్యలో
ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆ సమయంలో రాష్ట్రం అంతా వైఎస్సార్
కోలుకోవాలని ప్రార్థనలు చేసింది. వారి ప్రేమానురాగాలే ప్రజల మనిషిగా
ఆయనకు తిరిగి స్వస్థతను అందించాయి. 68 రోజులు, 11 జిల్లాలు, 56 అసెంబ్లీ నియోజక వర్గాలు, 690 గ్రామాల ప్రజలుంఇదీ ఆయన పాదయాత్ర ట్రాక్ రికార్డ్. టీడీపీ
ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా చేప్పట్టిన ప్రజాప్రస్థానానికి
అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభించింది. వైఎస్సార్ కు అశేష
జనవాహిని అభిమానం లభించింది. ఆ యాత్రే రాష్ట్ర ప్రజలకు సువర్ణయుగాన్ని
అందించింది. సరిగ్గా ఇదే రోజు ఆ పాదయాత్రికుని ప్రజాప్రస్థానం
పాక్షికంగా పూర్తి అయ్యింది. అధికారం చేపట్టిన వెంటనే వైఎస్సార్
తన అడుగులను ప్రజల సంక్షేమం వైపు వేసారు. ప్రజల కోసమే నాయకుడు
అంటూ అనుక్షణం వారివైపే నడిచారు. అలా ప్రజల వద్దకు పయనిస్తూనే
తిరిగిరాని లోకాలకు చేరిపోయారు. ఆ మహానేతను ఈ సందర్భంగా తలుచుకునే
అవసరం ఉంది. అలాంటి మహోన్నత పాదయాత్రకు కొనసాగింపుగా ఆయన వారసుడు
చేస్తున్న ప్రజా సంకల్పానికి వస్తున్న అశేష జన స్పందనను చూసి మురిసిపోవాల్సిన సందర్భమిది. 

 

 

 

Back to Top