రాజ‌కీయాల‌నే మార్చ‌నున్న రాజీనామా

  • విశ్వ‌స‌నీయ‌త‌కే  వైయ‌స్ జ‌గ‌న్‌ పట్టం
  • జ‌న సందోహం ముందు శిల్పాచ‌క్ర‌పాణిరెడ్డి రాజీనామా
  • టీడీపీని ఇరుకున పెట్టిన బ‌హిరంగ లేఖాస్త్రం 
  • పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు
  • శిల్పా స‌వాల్‌ను స్వీకరించకుండా పారిపోయిన పచ్చపార్టీ
ఒక్క బ‌హిరంగ స‌భ‌తో టీడీపీ అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. ఒక్క బ‌హిరంగ స‌భ ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్ని మార్చేసే ప‌రిస్థితులు తీసుకొచ్చాయి. ఒక్క రాజీనామా ముఖ్య‌మంత్రి స‌హా అధికార‌ పార్టీకి నిద్ర లేకుండా చేస్తోంది. ఆ రాజీనామా ప‌ద‌వుల కోసం పార్టీలు మారిన 21 మందిని నిల‌దీసి నిప్పుతో క‌డిగేసింది. మాట్లాడాల్సిన అవ‌సరం లేదు. ప్ర‌శ్నించాల్సిన ప‌నిలేదు. అన్నింటికీ ఒక్క రాజీనామాతో స‌మాధానం చెప్పారు జ‌న‌నేత‌. విశ్వ‌స‌నీయ‌తకు క‌ట్టుబ‌డ్డామ‌ని చెప్ప‌డానికి నిన్నటి నంద్యాల ప్ర‌భంజ‌నంలో శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా చాలు. మీలాగా మాట‌లు చెప్పం.. చేత‌ల్లో చూపిస్తామ‌ని స్పీక‌ర్ ఫార్మాట్‌లోనే రాజీనామా సమ‌ర్పించ‌డ‌మే కాదు.. ఇప్ప‌టికే ఆ రాజీనామా సోష‌ల్ మీడియాలో  స‌ర్క్యులేట్ అవుతోంది. ల‌క్ష మంది ప్ర‌జా ప్ర‌భంజ‌నం ముందు చంద్ర‌బాబుకు చెంప దెబ్బ కొట్టిన‌ట్టుగా .. నంద్యాల ప్ర‌జ‌ల ముందే సంత‌కం చేసి మరీ చూపించిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి రాజీనామా ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మే.  ఎమ్మెల్సీగా గెలిచిన‌ మూణ్నెళ్లకే పార్టీ మారేందుకు అడ్డుగా ఉందని.. గెలిచిన పార్టీ ద్వారా సంక్ర‌మించిన ప‌ద‌వి వ‌ద్ద‌నుకుని విశ్వ‌స‌నీయ‌త‌కు క‌ట్టుబ‌డి చేసిన  రాజీనామా సంచ‌ల‌న‌మే. 

వైయ‌స్ ఆర్  సీపీకి కొత్త‌కాదు..
నిజానికి పార్టీ మారేట‌ప్ప‌డు ఆ పార్టీ ద్వారా సంక్ర‌మించిన ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి వైయ‌స్ ఆర్ సీపీలోకి రావ‌డం ఇప్పుడేమీ కొత్త‌కాదు. గ‌తంలోనే పార్టీ పెట్టిన‌ప్పుడు కాంగ్రెస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా పార్టీ ప‌ద‌వులు, ఎమ్మెల్యే ప‌ద‌వులు, మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామాలు స‌మ‌ర్పించి మ‌రీ వ‌చ్చారు. ఉప ఎన్నిక‌ల్లో అఖండ మెజారిటీతో గెలిచి సంచ‌ల‌నం న‌మోదు చేశారు. పార్టీ అధినేత ఆ స‌మ‌యంలో జైల్లో ఉన్నా విశ్వ‌స‌నీయ‌త‌కు క‌ట్టుబ‌డిన పార్టీ నిర్ణ‌యాన్ని జ‌నం స్వాగ‌తించారు. జ‌గ‌న్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. కంటెంట్‌ ఉన్నోడికి క‌టౌట్ చాల‌ని అన్న‌ట్టుగా పార్టీ అభ్య‌ర్థుల‌కు ఏపీ  ప్ర‌జ‌లు విజ‌య‌హార‌తులు ప‌ట్టారు. ఇదీ జ‌న‌నేత మీద ప్ర‌జ‌ల‌కున్న విశ్వాసం. మొన్న‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీ ప‌రాజ‌యం పాలైనా ఏనాడూ  నిరుత్సాహంతో వెన‌క్కి తిరిగి చూసుకున్న‌ది లేదు. ప్ర‌జ‌ల్లోనే ఉంటూ మ‌రింత ఆద‌ర‌ణ చూర‌గొంటూనే ఉన్నారు. అధికార పార్టీ అరాచ‌కాల‌పై వెన‌క‌డుగు వేసిన దాఖ‌లాలు లేవు. ఢీ అంటే ఢీ అని ముందుకే సాగారు. జ‌న‌నేత ఇచ్చిన స్పూర్తితో నాయ‌కుల ద‌గ్గ‌ర్నుంచి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు కూడా అదే దూకుడును ప్ర‌ద‌ర్శిస్తూనే ఉన్నారు. 

2014 ఎన్నికల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులు జరిగాయి. తెలంగాణలో ఇతర పార్టీ ప్రజా ప్రతినిధుల్ని టీఆర్‌ఎస్‌ లాక్కుంటే 'రాజకీయ వ్యభిచారం..' అని విరుచుకుపడ్డ చంద్ర‌బాబే ఏపీలో పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించి క్షుద్ర రాజ‌కీయాల‌కు  కేరాఫ్‌గా మారాడు. పార్టీ ఫిరాయించింది చాలక, మంత్రి పదవులూ సొంతం చేసుకుని, ప్రజాస్వామ్య వ్యవస్థనే అపహాస్యం పాల్జేయడం చూశాం. ఇక, ఇప్పుడు శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మల్సీ పదవికి చేసిన రాజీనామాతో పార్టీ ఫిరాయించిన ప్రజా ప్రతినిధుల్లో ఒత్తిడి తీవ్రతరం కానుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్‌కి కొత్త తలనొప్పి వచ్చిపడింది. 'దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళండి..' అన్నమాట ప్రతిపక్షం నుంచి ఇంకా గట్టిగా ఎదురవనుంది చంద్రబాబు సర్కార్‌కి. వైయస్సార్సీపీ లేవనెత్తే ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేని పచ్చ పార్టీ ఎదురుదాడికి దిగుతూ నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది. 

తాజా వీడియోలు

Back to Top