పోలవరం.. ఒక నత్త నడక ప్రాజెక్టు

న్యూఢిల్లీ) పోలవరం ప్రాజెక్టు మీద చంద్రబాబు ప్రభుత్వం ఆడుతున్న నాటకాల్ని
కేంద్రం గమనిస్తోంది. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఇందుకు సంబంధించి వాడీ
వేడి చర్చ జరిగినట్లు సమాచారం. న్యూడిల్లీలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమక్షంలో
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంబంధిత ఉన్నతాధికారులు చర్చించినట్లు
తెలుస్తోంది.

అసలు ఏం జరుగుతోంది.

పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ద‌క్కిన నేప‌థ్యంలో... కేంద్రానికి
ప్రాజెక్టును అప్ప‌గిస్తే నిర్మాణం వేగంగా జ‌రిగే అవ‌కాశం ఉంది. కేంద్రానికి అప్ప‌గిస్తే...
ప‌నులు చేసే స‌త్తాలేక చ‌తికిల ప‌డిన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ మీద వేటు
ప‌డ‌డం ఖాయం. అదే జ‌రిగితే... అంచ‌నాలు పెంచి సొమ్ము దండుకోవాల‌న్న త‌మ ల‌క్ష్యం
నెర‌వేర‌ద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం పోల‌వరాన్ని కేంద్రానికి అప్ప‌గించేందుకు మోకాల‌డ్డుతోంది.
పోల‌వ‌రం టెండ‌ర్‌ను రూ. 4054 కోట్ల‌కు ద‌క్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్ 60 నెల‌ల్లో ప‌నులు పూర్తి చేయాలి. కాంట్రాక్టు
ద‌క్కించుకుని ఇప్ప‌టికి 36 నెల‌లు దాటినా హెడ్‌వ‌ర్క్స్‌కు సంబంధించి
కేవ‌లం ఐదున్న‌ర శాతం ప‌నులు మాత్ర‌మే పూర్త‌య్యాయి. కాంట్రాక్ట‌ర్‌కు ఇచ్చిన గ‌డువు
ప్ర‌కారం చూసినా రాష్ట్ర ప్ర‌భుత్వం చెబుతున్న గ‌డువు(2018) ప్ర‌కారం చూసినా... ఇక మిగిలింది 24నెల‌లే. అంటే 90శాతం ప‌నిని రెండేళ్ల‌లో పూర్తి చేయాల్సి
ఉంటుంది. 

కేంద్రం అసంత్రప్తి

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నులు మ‌రీ నెమ్మ‌దిగా సాగుతున్న తీరుపై పోల‌వ‌రం
ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఇదే తీరుగా చేస్తే
ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్త‌వుతుందంటూ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగా నిల‌దీసింది.
పీపీఏ - రాష్ట్ర ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకోవ‌డానికి ఎంత స‌మ‌యం అవ‌స‌ర‌మ‌ని ప్ర‌శ్నించింది.
ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏ ప‌నుల‌ను ఎప్ప‌టికి పూర్తి చేయాల‌నే ప్ర‌ణాళిక
(టైం షెడ్యూల్‌) లేక‌పోవ‌డం ఏమిటంటూ మండిప‌డింది. ప‌నుల్లో వేగం పెంచుతామంటూ
రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌త స‌మావేశాల్లో ఇచ్చిన హామీల‌ను గాలికి విడిచిపెట్ట‌డాన్ని
తప్పుబ‌ట్టింది. వ‌చ్చే స‌మావేశానికైనా టైం షెడ్యూల్‌తో రావాల‌ని, ఆ మేర‌కు ప‌నులు చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం
చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను వివ‌రించాల‌ని సూచించింది.

.

Back to Top