ఫలించిన బాబుజోస్యం


అవినీతి పార్టీలన్నీ భవిష్యత్ లో కాంగ్రెస్ లో కలుస్తాయ్ అని చెప్పాడు చంద్రబాబు. 2013లో బాబు నోట్లోంచి ఊడిపడ్డ ఆణిముత్యం ఇది. అప్పటికి బీజేపీతో పొత్తుకు బాబు తహతహ లాడుతున్నాడు. మోదీ స్వింగ్ ను ఫుల్ గా క్యాష్ చేసుకునే పనిలో పడ్డాడు. రాష్ట్ర విభజనకు తన వంతు సాయంగా ఉత్తరాలు రాసి, గోడమీద పిల్లివాటాలు చేస్తూ రాష్ట్రం ముక్కలు కావడానికి చేతనైన పనులన్నీ చేసాడు. తెలంగాణాలో వేడి, ఆంధ్రాలో సెంటిమెంటు రెండు చోట్లా కాంగ్రెస్సే విలను. అందుకే బాబు కాంగ్రెస్ ను నానా తిట్లూ తిట్టాడు. సోనియాను దెయ్యం అన్నాడు. కాంగ్రెస్ ను ఎపిలో అడుగు పెట్టనివ్వను, ఏమనుకుంటున్నారు తమాషాలా అని ఊగిపోయాడు. భవిష్యత్ లో అవినీతి పార్టీలన్నీ కాంగ్రెస్ లో కలుస్తాయంటూ చిలకజోస్యం చెప్పాడు. ఐదేళ్లకి ఆ జోస్యం నిమైంది. బాబు భవిష్యత్ ఏమిటో ఖరారైంది. చక్రాలూడిన సైకిల్ ను హస్తానికిప్పగించిన చంద్రబాబు అవినీతిపార్టీలు ఏవో బహు చక్కగా ప్రజలకు అర్థం అయ్యేలా చేసాడు. కాంగ్రెస్ తో కలిసే చారిత్రక అవసంర చంద్రబాబుకు ఎందుకొచ్చిందో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎపిలో ఎదురుతిరుగుతున్న రాజకీయ పరిస్థితులు, ముంచుకొస్తున్న కేసులు, బయటపడుతున్న పచ్చనేతల అవినీతి భాగోతాలు, తరుముతున్న ఎన్నికల కాలం, వెంటాడుతున్న ఓటమి భయం అన్నీ కలిసి చంద్రబాబును దేశం అంతా పరుగులు పెట్టించాయి. కాంగ్రెస్ కాళ్లు పట్టించాయి. కాంగ్రెస్ కండువాలకు మెడలు వంచేలా చేసాయ్. తప్పదు కదా మరి, ఆపద ముంచుకొస్తున్నవేళ, ఓటమి ముంచేయబోతున్నదని తెలుస్తున్న వేళ,  కేసుల కత్తి మెడమీద పడబోతున్నవేళ బాబుకు కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకోవడం తప్ప మరో ప్రత్యామ్న్యాయం కనిపించలేదు. 

చంద్రబాబుతో చేయి కలిపిన చేయి ఏదైనా బూడిద కావాల్సిందే అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. పేరుకు 14 సీట్ల పంపకమైనా, పెత్తనమంతా నాదే, పెద్దన్నను నేనే అని చెప్పుకుంటున్నాడు చంద్రబాబు. తెలంగాణ సభల్లో మైకుల ముందు, కాంగ్రెస్ నాయకుల ముందు భూమి పుట్టకముందు నుంచీ అన్నీ నేనే చేసానంటూ తన నారా మార్క్ చిడతలు వాయిస్తూనే ఉన్నాడు. అవసరం కోసం అతుకుల బొంత కూటమికి ఒప్పుకున్న జాతీయ పార్టీ కూడా బాబు కూతలను కోకిల పాటల్లా ఆస్వాదిస్తోంది. ఇదే అదునుగా బాబుగారు తెలంగాణాలో కూటమిని తానే నడిపిస్తున్నా అని విపరీత ప్రచారం చేయిస్తున్నాడు. గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా నేనే ఎంపిక చేస్తాను అని చెప్పుకు తిరుగుతున్నాడు. ఎపిలో కుర్చీ ఎగిరిపోయినా తెలంగాణాలో తలకాయి అయినా మిగులుతుందని బాబు ఆశ. ఏకాస్త అధికారంలో వాటా దక్కినా చాలన్న పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబుకు తెలంగాణాలో చుక్కెదురైతే, మహాకూటమికి ఓటమి ఎదురైతే ఏమిచేయాలో కూడా తెలుసు. 

జోడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందని సీనియర్ నేతలు ఈమధ్య విషయాన్ని పొక్కించారు. తెలంగాణాలో కూటమి నామరూపాల్లేకుండా పోయినా, ఆ కూటమిని సైకిలెక్కించుకుని ఎపికి తెచ్చే పనిలో ఉన్నాడు చంద్రబాబు. భూస్థాపితం అయిన కాంగ్రెస్ ను, సమాధి కాబోతున్న టిడిపినీ బ్రతికించేందుకు బాబు పడే పాట్లు చూసి తెలుగు ప్రజల పొట్ట చెక్కలౌతోంది. మహా మాయా కూటమిని ప్రజా ఫ్రంట్ అంటూ కలరింగ్ ఇస్తూ, రంగుల కండువాల మాటున దాక్కోవాలని చూస్తున్న బాబు ప్రయత్నం ఫలిస్తుందో, బెడిసి కొడుతుందో మరుకొద్ది రోజుల్లో తేలపోనుంది. 
 
Back to Top