జన నాయకుడి ‘ప్రజా సంకల్పం’

– పాదయాత్రకు ప్రజా సంకల్ప యాత్రగా నామకరణం
– 125 నియోజకవర్గాల్లో పర్యటించనున్న జననేత 
– 125 భారీ బహిరంగ సభల నిర్వహణకు ప్లాన్‌ 
– 45 లక్షల కుటుంబాలను నేరుగా కలవనున్న ప్రతిపక్ష నేత
– పాదయాత్రకు ముందు తిరుమలలో శ్రీవారి దర్శనం
-ఇడుపులపాయలో వైయస్ఆర్ కు నివాళులర్పించి పాదయాత్రకు శ్రీకారం

ప్రజల యొక్క.. ప్రజల చేత.. ప్రజల కొరకు.., ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై ఉద్యమానికి ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ నడుంబిగించారు. ‘ప్రజా సంకల్ప యాత్ర’ తో జననేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి  నవంబర్‌ 6 నుంచి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఇడుపులపాయ నుంచి మొదలయ్యే ఈ సుదీర్ఘ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగుస్తుంది. పద్నాలుగేళ్ల క్రితం మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి మాదిరిగానే శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురంలో పాదయాత్రను ముగించేలా రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఆరు నెలలపాటు జరిగే పాదయాత్రలో 125 నియోజకవర్గాలు.. 10 వేల గ్రామాలు, 45 లక్షల కుటుంబాలను కలవనున్నారు. నియోజకవర్గానికి ఒక భారీ బహిరంగ సభ ఉండేలా పాదయాత్రను ప్లాన్‌ చేశారు. మిగిలిన 50 నియోజగకర్గాల్లో బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఈ పాదయాత్రలో భాగంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలతో వైయస్‌ జగన్‌ ప్రత్యక్షంగా మాట్లాడనున్నారు. దాదాపు 20వేల మంది కార్యకర్తలతో ఆయన చర్చించనున్నారు. ప్రజల్లోకి నేరుగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడంతోపాటు పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతారు. 

వైయస్‌ఆర్ ఘాట్‌లో నివాళులర్పించి 
పాదయాత్ర ప్రారంభించే రెండు రోజులు ముందు ప్రతిపక్ష నాయకుడు తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. వచ్చే నెల 6వ తేదీ ఉదయం 11 గంటలకు ఇడుపులపాయలోని వైయస్సార్‌ ఘాట్‌ వద్ద దివంగత ముఖ్యమంత్రి డా.వైయస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక నివాళులర్పిస్తారు.  పాదయాత్రను ప్రారంభించే ముందు ఇడుపులపాయలో నిర్వహించే బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ అక్కడికి వచ్చిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి తన పాదయాత్రను ప్రారంభిస్తారు. ఇప్పటికే ఇడుపులపాయలో జరిగే బహిరంగ సభ ప్రదేశాన్ని వైయస్సార్సీపీ నేతలు పరిశీలించారు. కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌ రెడ్డి,  మాజీ మంత్రి వైయస్‌ వివేకానంద రెడ్డి, వైయస్‌ జగన్‌ రాజకీయ  సలహాదారు   సజ్జల రామక్రిష్ణా రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌ రెడ్డి,  రఘురామి రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి,  కోరముట్ల శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ రెడ్డి తదితరులు ఇడుపులపాయలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.  
Back to Top