జనం మెచ్చిన నాయకుడు


– ప్రతి కష్టంలోనూ అండగా నిలిచిన జననేత
– ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరు
– ప్రతి అడుగూ ‘వైయస్‌ఆర్‌ కుటుంబానికి’ అండగా 

ఇద్దరితో మొదలై.. ప్రభంజనంగా మారిన వైయస్‌ఆర్‌సీపీ ప్రస్థానం ఆంధ్రప్రదేశ్‌ రా్రçష్టంలో ఒక చరిత్ర. ఓదార్పు యాత్రకు అనుమంతించలేదని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఎదిరించి బయటకొచ్చిన జననేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు అనుక్షణం అండగా నిలిచారు. అంతటి ఆదరణ చూపిన ప్రజల రుణం తీర్చుకుంటూ వైయస్‌ జగన్‌ టీడీపీతో యుద్ధమే చేస్తున్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టిస్తున్నా నిస్వార్థంగా ప్రజల పక్షాన చేస్తున్న పోరాటమే ఆయన్ను జనానికి మరింత చేరువ చేసింది. 
వైయస్‌ కొడుకు నుంచి ప్రతిపక్ష నాయకుడి దాకా..
వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి అకాల మరణంతో రాష్ట్రం దిక్కులేదనిదైంది. మహానేత మరణ వార్త విని తట్టుకోలేక ఎంతోమంది అభిమానులు గుండెలు పగిలి చనిపోయారు. వారందరికీ అండగా నిలిచేందుకు కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కూడా ఎదిరించి బయటకొచ్చి జనామోదంతో సొంతంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారు. అప్పట్నుంచి వెనుదిరిగి చూసింది. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేసిన క్షణం నుంచి నేటి వరకు యుద్ధం చేస్తూనే ఉన్నారు. తల్లీకొడుకులే ప్రజాప్రతినిధులుగా వైయస్‌ఆర్‌సీపీ ప్రస్థానం 2014 నాటికి ప్రభంజనంగా మారింది. 67 మందితో ప్రతిపక్షంగా అవతరించింది. కేవలం రెండు శాతం స్వల్ప ఓట్లతో ఓటమి చవిచూసినా వెనకడుగు వేసింది లేదు. తొలిరోజు నుంచే ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో, ప్రజా క్షేత్రంలో అలుపెరుగుని పోరాటం చేస్తూనే ఉన్నారు.
 
ప్రతిసమస్యపైనా ముందున్నాడు..

ప్రజా సమస్యలపై స్పందించిన తీరే వైయస్‌ జగన్‌ను ప్రజలకు మరింత దగ్గరకు చేర్చింది. ఎన్నికల హామీలు ఇవ్వకుండా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం చేసిన మోసాలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాల పక్షాన చేసిన నిరంతర పోరాటం వైయస్‌ కొడుకుగా రాజకీయాల్లో ఎంపీ స్థాయి నుంచి అనతికాలంలోనే సొంత పార్టీని స్థాపించి ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగారు. కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఒక పెద్ద కుటుంబాన్ని నిర్మించుకున్నారు. ఆపదల్లో ఉన్నామని తెలిసిన వెంటనే.. సాయం కోరకుండానే వచ్చి పలకరించిన గొంతు ఆయనది. సమస్యల్లో ఉన్నప్పుడు వచ్చి గడప తొక్కే తొలి అడుగు ఆయనది. ఇదే ఆయన్ను జననేతను చేసింది. ఆయనపై వచ్చిన ఎన్నో ఆరోపణలకు తన పనితీరుతూనే సమాధానం చెప్పారు. వ్యక్తిగతంగా  రెచ్చగొట్టాలని చూసినా సంయమనంతో వ్యవహరించి అందరి మనసులు గెలిచాడు. గరగప్రరు లాంటి సున్నిత సంఘటన సమాయాల్లో కులమతాలకు అతీతంగా వ్యవహరించి రాజీ చేసొచ్చారు. ఎవరూ చేరలేని చాపరాయి లాంటి ప్రాంతాలను నడిచెల్లి అభిమానుల కోసం ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధమనే సందేశం పంపారు. 

ఫిరాయింపులు అడ్డుకాలేదు..

పార్టీలో ఆత్మవిశ్వాసం దెబ్బతీయడం ద్వారా వైయస్‌ జగన్‌ను నిలువరించాలని చూసిన టీడీపీ కుట్రలకు ఆత్మవిశ్వాసంతో సమాధానమిచ్చారు. డబ్బులతో చేసే రాజకీయాల కన్నా ప్రజాభిమానం ఎంత గొప్పదో నిరూపించారు. పిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఆయన చేపట్టిన పాదయాత్రలే జనాదరణకు నిదర్శనం. నంద్యాల, కాకినాడ వంటి ఎన్నికల్లో ధన ప్రవాహం, అధికారమే పెట్టుబడిగా పెట్టి చేసిన విచ్చలవిడి ధనయజ్ఞం, గూండాయిజాన్ని కూడా చిరునవ్వుతోనే ఎదుర్కొన్నారు. పార్టీ ఏర్పాటైన నుంచి ఎదుర్కొన్న సవాళ్లతో పోల్చుకుంటే ఇవి చాలా చిన్నవేనంటూ ప్రజాభిమానాన్నే నమ్ముకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఆరోగ్య శ్రీ అమలు తీరు, అమరావతి భూముల దందా, గోదావరి ఆక్వా ఫుడ్, బందరు పోర్టు భూ బాధితులు, వంశధార నిర్వాసితులు, అతివృష్టి, రాయలసీమలో కరువు ఇలా ఏ సమస్య వచ్చినా బాధితులను పరామర్శించిన మొదటి వ్యక్తి వైయస్‌ జగన్‌. అందుకే ఆయన జనం మెచ్చిన నాయకుడు.

తాజా ఫోటోలు

Back to Top