చంద్రబాబు నిర్వాకం... ప్రజలకు శాపం

() బాబు ప్రచారం కోసం
అంకెలు పెంచి చూపిన ప్రభుత్వం

() రూ. 50వేల కోట్ల మేర
దొంగలెక్కలు కట్టారని తేల్చిన కేంద్రం

() రాష్ట్రానికి ఇవ్వాల్సిన
నిధుల్లో కోత పెట్టిన కేంద్రం

() కేంద్రాన్ని
నిందించేందుకు పచ్చ మీడియాకు బాధ్యతలు

హైదరాబాద్) చంద్రబాబు
మార్కు దొంగ నాటకం మరోసారి బయట పడింది. రెండంకెల వృద్ధి సాధించామని బాబు అండ్
గ్యాంగ్ చెబుతున్న గొప్పల్లో  నిజం లేదని
తేలిపోయింది. వృద్ధి లెక్కలు పూర్తిగా తప్పుల తడక అని కేంద్రం ఆధారాలతో సహా
తేల్చి చెప్పింది. సుమారు రూ. 50 వేల కోట్ల రూపాయిల మేర దొంగ అంకెలు వేశారని
స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం తాను తీసుకొన్న గోతిలో తానే
పడినట్లయింది.

          రెండేళ్లలో  చంద్రబాబు
ప్రభుత్వం అవినీతి, అరాచకాలు తప్ప చేసిందేమీ లేదు. దీంతో ప్రజల్లో మార్కులు
కొట్టేసేందుకు కొత్త టెక్నిక్ అమలు చేశారు. వృద్ధి రేటు కు  సంబంధించిన లెక్కల్ని మార్చేశారు. ఆయా ప్రభుత్వ
శాఖల్లో విపరీత మైన ప్రగతి సాధించినట్లు లెక్కలు చూపించారు. అయితే మత్స్య శాఖ కు
సంబంధించిన నిధులు 60 శాతం మాత్రమే ఖర్చు పెట్టినట్లు లెక్కలు రాశారు. కానీ ఇందులో
300 శాతం ప్రగతి సాధించినట్లు కేంద్రానికి నివేదికలు పంపించారు. దీంతో అనుమానం
వచ్చి అసలు లెక్కలన్నీ బయటకు తీస్తే బండారం బయటకు వచ్చింది. అన్ని ప్రభుత్వ శాఖల
లెక్కల్ని తనిఖీ చేస్తే సుమారు 50వేల కోట్ల రూపాయిల మేర దొంగ లెక్కలు రాసినట్లు
నిర్ధారణ అయింది. దీంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయంలో కోత
విధించింది. సాధారణంగా వృద్ధి రేటు లెక్కించటంలో కేంద్రానికి, రాష్ట్రానికి
కొద్దో గొప్పో తేడా రావచ్చు. కానీ ఈ స్థాయిలో తేడాలు రావటం ఆంధ్రప్రదేశ్
చరిత్రలోనే మొదటిసారి అంటున్నారు. దీన్ని బట్టి చంద్రబాబు చేసిన మోసం కేంద్ర
పెద్దల బుర్ర తిరిగేలా చేసింది. దీంతో ప్రజలకు అందాల్సిన సాయంలో కోత పడింది.

          కేంద్రం దగ్గర బండారం బయట పడటంతో నిధులు రాక తగ్గిందని
చంద్రబాబు ప్రభుత్వం గ్రహించింది. దీంతో విషయం బయటకు వస్తే పరువు పోతుందని
భావిస్తోంది. దీంతో తప్పుని అధికారుల 
మీదకు నెట్టేసేందుకు ప్రయత్నిస్తోంది. అధికారులే అత్యుత్సాహంతో లెక్కల్ని
తప్పుగా చూపించారని పచ్చమీడియాలో వార్తలు రాయిస్తోంది. అధికారుల్ని బకరాల్ని చేసి,
నెపాన్ని కేంద్రం మీదకు నెట్టేందుకు కుట్ర చేస్తోంది. పైగా కేంద్రం నుంచి సరైన
సాయం అందటం లేదని ప్రచారం చేసేందుకు పూనుకొంది. ఇదీ చంద్రబాబు నిర్వాకం అన్నమాట..!

To read this article in English:  http://bit.ly/1Xn3tHc 



Back to Top