కంచుకోటను కదిలించలేరు

కర్నూలు: నంద్యాలకు వైయస్ జగన్ రాకతో అధికార టీడీపీకి ముచ్చెమటలు పడుతున్నాయి. వైయస్సార్సీపీ తలపెట్టిన బహిరంగసభకు ప్రజలను రానీయకుండా టీడీపీ చేసిన కుట్రలన్నీ బెడిసికొట్టాయి. జననేత వైయస్ జగన్ వెంటే తాము అంటూ నంద్యాల ప్రజానీకం బహిరంగ సభకు పోటెత్తడంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఉన్న వ్యతిరేకత నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో భారీ స్థాయిలో బయటపడుతోంది. గుండెమండిన రైతులు, దెబ్బతిన్న మహిళలు, మోసపోయిన యువతీయువకులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై నిప్పులు చెరుగుతున్నారు.  చంద్రబాబును ఓడించి తీరుతామని అంటున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని  గెలిపించి చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతామని అంటున్నారు.

ఈ సభకు పలు అడ్డంకులు సృష్టించినా అశేషజనవాహిని హాజరైంది. ఈ నేపథ్యంలో సభ ప్రారంభానికి ముందు మీడియా వారి అభిప్రాయాన్ని కోరగా.. ‘చంద్రబాబులాంటి నయవంచక ముఖ్యమంత్రిని మేం ఇప్పటి వరకు చూడలేదు. ఈయన కమిటీల ముఖ్యమంత్రి. మోసాల ముఖ్యమంత్రి. ఇలాంటి సీఎం మాకు వద్దు. మాకు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కావాలి. చంద్రబాబు నాయుడు నంద్యాలలో టీడీపీకి ఓటు వేస్తే మాకు 5 నుంచి పదివేలు ఇస్తానంటున్నాడు. అయినా సరే వారు గెలవరు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి గెలుస్తారు. మేం గెలిపించుకుంటాం. ఎందుకంటే ఇది వైయస్‌ఆర్‌సీపీ కంచుకోట. కడప, కర్నూలులో వైయస్‌ జగన్‌ను ఓడించేవారు లేరు. చంద్రబాబు ఇంత దుర్మార్గంగా పరిపాలిస్తాడని అనుకోలేదు. ఆయన చేసేవన్నీ కూడా చెడ్డపనులే’ అంటూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Back to Top