ఇవేం కేసులు

  • మానవత్వం మరచిన చంద్రబాబు సర్కార్
  • బస్సు ప్రమాద ఘటనలో బాధితులకు అన్యాయం
  • జేసీ దివాక‌ర్‌రెడ్డిపై ఎలాంటి కేసు న‌మోదు చేయ‌ని ప్ర‌భుత్వం
  • ప్ర‌శ్నించిన ప్ర‌తిప‌క్ష నేతపై అక్ర‌మ కేసులు 
  • చ‌నిపోయిన బ‌స్సు డ్రైవ‌ర్‌పైనే కేసు న‌మోదు
హైద‌రాబాద్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నియంత పాల‌న సాగుతుంది. ఇందుకు అనేక ఉదాహ‌ర‌ణ‌లు ఇదివ‌ర‌కే చూడ‌గా..తాజాగా నిన్న కృష్ణా జిల్లాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదం ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వ ఉదాసీన వైఖ‌రి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రాజ‌ధాని ప్రాంతానికి 20 కిలోమీట‌ర్ల దూరంలో మూల‌పాడు గ్రామం వ‌ద్ద టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డికి చెందిన ట్రావెల్స్ క‌ల్వ‌ర్టును ఢీకొని 20 అడుగుల లోతు కాల్వ‌లో ప‌డిన ఘ‌ట‌న‌లో డ్రైవ‌ర్‌తో స‌హా 12 మంది మృత్యువాత ప‌డ్డారు. మ‌రో 32 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం ఎలాంటి విచార‌ణ చేప‌ట్ట‌కుండానే చ‌నిపోయిన డ్రైవ‌ర్‌పై కేసు న‌మోదు చేశారు. నిబంధ‌న‌లు పాటించ‌ని బ‌స్సు యాజ‌మాన్యాన్ని కేసు నుంచి తప్పించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేప‌ట్టింది.  ఇందులో భాగంగానే నిన్న నందిగామ ఆసుప‌త్రి వ‌ద్ద ప్ర‌మాదంలో మృతి చెందిన వారికి పోస్టుమార్టం నిర్వ‌హించ‌కుండానే శ‌వాల‌ను మూటక‌ట్టారు. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌శ్నించిన ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, సామినేని ఉద‌య‌భాను, జోగిర‌మేష్‌పై ప్ర‌భుత్వం ఏకంగా మూడు సెక్ష‌న్ల కింద అక్ర‌మ కేసులు బ‌నాయించింది.  డ్రైవ‌ర్ మృత‌దేహానికి పోస్టుమార్టం చేయ‌కుండానే పంపించే ప్ర‌య‌త్నం చేసిన అధికారులు, డ్రైవ‌ర్ మ‌ద్యం సేవించి ఉంటే అప్పుడు బ‌స్సు యాజ‌మాన్యంపై కేసు న‌మోదు చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం శోచ‌నీయం. ప్ర‌శ్నించే వారిపై కేసులు పెడుతూ..త‌ప్పుచేసిన వారిని శిక్షించ‌కుండా వ‌దిలివేయ‌డం చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికే చెల్లింది. ప్ర‌భుత్వ తీరును ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నారు. ఇవేం కేసుల‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వ తీరు మారాలి. లేదంటే ప్ర‌జ‌లు తిరుగ‌బ‌డే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయి.
Back to Top