పేదలపై ఛార్జీల మోత..!

ప్రజలకు చంద్రబాబు కరెంట్ షాక్..!
విపరీతంగా పన్నుల వాత..!

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. పేదలపై చంద్రబాబు విశ్వరూపం చూపిస్తున్నాడు. భూములు కొల్లగొట్టడం దగ్గర్నుంచి పన్నుల మోత వరకు ప్రజలను ఎడాపెడా వాయించేస్తున్నాడు. నిన్నటికి నిన్న పెద్ద ఎత్తున ఆర్టీసీ ఛార్జీలు పెంచి సామాన్యుని నడ్డివిరిచిన పచ్చసర్కార్...ఇప్పుడు విద్యుత్ ఛార్జీలపై పడింది. పెంచిన ఛార్జీలు తగ్గించాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నా బేఖాతరు చేస్తూ..కరెంట్ వాత పెట్టేందుకు చంద్రబాబు కత్తులు నూరుతున్నాడు.

పేదలకు పవర్ షాక్..!
పాతబకాయిల వసూళ్ల పేరుతో సామాన్యప్రజానీకాన్ని ముప్పులు తిప్పలు పెట్టేందుకు చంద్రబాబు సన్నద్ధమయ్యాడు. వసూలు చేసిన వాటినే తిరిగి వసూలు చేసేందుకు కుట్ర పన్నుతున్నాడు. విద్యుత్ ట్రూ అప్ పేరిట ప్రజలకు కరెంట్ షాక్ ఇస్తున్నాడు. సర్దుబాటు ఛార్జీల పేరుతో గత ప్రభుత్వాలు వసూలు చేసిన వాటినే మళ్లీ ట్రూ అప్ అంటూ చంద్రబాబు పేదలకు వాత పెడుతున్నాడు. దాదాపు రూ. 7వేల కోట్లకు పైగా భారాన్ని ప్రజలపై రుద్దేందుకు కంకణం కట్టుకున్నాడు. దీనికి తోడు ట్రాన్స్ కో ప్రతిపాదించిన మరో రూ.650 కోట్లు అదనంగా చేర్చుతూ మోత మోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయంపై ప్రజాగ్రహం..!
ఎన్నికల సమయంలో ఎలాంటి ఛార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు తన నయవంచనకు మచ్చరాకుండా చూసుకుంటున్నాడు. మోసాలకు పెట్టింది పేరు అన్నట్లు చెలరేగిపోతున్నాడు. అడ్డగోలుగా పేదలపై వడ్డన విధిస్తూ ఛార్జీలతో  బాదేస్తున్నాడు. ప్రభుత్వ నిర్ణయంపై  ప్రజలు భగ్గుమంటున్నారు. ఛార్జీల పెంపును వెనక్కితీసుకోకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు.
Back to Top